అన్వేషించండి

Snoring Side Effects: గురక వల్ల శ్వాస ఆగిపొయే ప్రమాదం ఉందా? ఈ ఆహార నియమాలతో అరికట్టండి!

గురకను ఎవరూ కావాలని పెట్టరు. కానీ, అది పక్కవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే, మీకు గురక సమస్య ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే..

గురకే కదా అని మనలో చాలా మంది లైట్ తీసుకుంటాం. కానీ, గురక పక్కనవారి నిద్ర చెడగొట్టటమే కాక, ప్రమాదకరమైన స్లీప్ డిజార్డర్, స్లీప్ అప్నియాకు దారి తీయవచ్చు అంటున్నారు నిపుణులు. స్లీప్ అప్నియా అంటే నిద్రలో ఉన్నపుడు శ్వాస మాటిమాటికీ ఆగిపోతూ ఉంటుంది. సాధారణంగా, గురక సమస్య ఉన్నవారిలో ఇది వస్తుంటుంది. స్లీప్ అప్నియా వల్ల ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది. కానీ, ఆహారపు అలవాట్లను మార్చుకోవటం వల్ల, స్లీప్ అప్నియా వల్ల వచ్చే ముప్పును అరికట్టవచ్చు అంటున్నాయి కొన్ని పరిశోధనలు. ఎలాంటి ఆహారం వల్ల గురక, తద్వారా వచ్చే స్లీప్ అప్నియా నుంచి బయటపడొచ్చో ఇప్పుడు చూద్దాం!

ఊబకాయం సమస్య ఉన్నవారికి ఎక్కువగా గురక వస్తుంటుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు బయటి ఆహారం తీసుకోకపోవటం మంచిది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకునే వారిలో గురక సమస్య అతి తక్కువగా ఉందని ఒక పరిశోధన గుర్తించింది. అలాగే, అధికంగా జంక్ ఫూడ్ తీసుకొని, తక్కువగా ఆకుకూరలు, కూరగాయలు తినే వారిలో గురక సమస్య అతి ఎక్కువగా ఉందని కూడా ఈ పరిశోధన చెప్పింది. 

ఫ్లైండర్స్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్. యొహన్నెస్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. "మొక్కల నుంచి వచ్చే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవటం వల్ల, శరీరంలో వాపు, ఊబకాయం తగ్గుతుందని.. తద్వారా, గురక , స్లీప్ అప్నియా రాకుండా కాపాడుకోవచ్చు’’ అని తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు భయంకరమైన స్లీప్ డిజార్డర్స్ నుంచి బయటపడటానికి ఏ విధంగా దోహదపడతాయనేది అంశాలను ఆయన తన పరిశోధనల్లో వెల్లడించారు.

నిద్రలో ఉన్నపుడు శ్వాసకోశం మూసుకుపోయి, గాలి బయటకు రాక శ్వాస నిలిచిపోతుంది. దీన్నే స్లీప్ అప్నియా అంటారు. దీని వల్ల ఒక్కోసారి ప్రాణాలు పోవచ్చు. ఇందులో సాధారణంగా వచ్చే రకం అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA). ఈ డిజార్డతో 1.5 బిలియన్ల బ్రిటీష్ ప్రజలు సమస్య ఎదురుకుంటున్నారని సర్వేలు చెప్తున్నాయి. మెలకువగా ఉన్నపుడు, నీరసంగా ఉండటం.. అందువల్ల దేని మీద శ్రద్ధ పెట్టలేకపొవటం, మాటిమాటికీ. మూడ్ మారిపోవటం.. ఇంకా, పొద్దున లేవగానే తలనొప్పి రావటం జరుగుతుంటుంది.

ERJ ఓపెన్ పరిశోధనలో మనుషుల ఆహారపు అలవాట్లు, ఏ విధంగా ప్రమాదకరమైన వ్యాధుల ప్రభావానికి గురి చేస్తాయో నిరూపంచబడింది. US హెల్త్ అండ్ న్యుట్రిషన్ సర్వేలో పాల్గొన్న 14,210 మంది డాటాను పరిశోధకులు పరిశీలించారు. 24 గంటల వ్యవధిలో వారు తీసుకున్న ఆహారం, వారికి ఇది వరకు స్లీప్ అప్నియా ఉండేదా? తదితర విషయాల మీద దృష్టి పెట్టారు. అధికంగా, చక్కెర, స్వీట్లు, జంక్ ఫూడ్ తినే వారిలో ఈ సమస్య 22 శాతం ఎక్కువగా ఉన్నట్లు వారు తేల్చారు. జంక్ తినే వారిలో అధికంగా పురుషుల కంటే స్త్రీలకే స్లీప్ అప్నియా ముప్పు ఎక్కువగా ఉన్నట్లు వారు కనుగొన్నారు. 

అనారోగ్యాన్ని కలిగించే జంక్ తక్కువగా లేదా మొత్తంగా మానివేసి, మొక్కల నుంచి వచ్చే ఆహారాన్ని మాత్రమే తినటం వల్ల, గురక, అబ్స్ట్రక్టివ్  స్లీప్ అప్నియా సమస్యల నుంచి తొందరగా బయటపడొచ్చని క్రీట్ యూనివర్సిటీ ప్రోఫెసర్ సోఫియా షిఝా అంటున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget