అన్వేషించండి

Backward Walking : వెనక్కి నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఎప్పుడు, ఎంత సేపు నడిస్తే మంచిది?

Retro Walking : రోజూ ముందుకు కాదు.. కాస్త వెనకకు నడవాలి అంటున్నారు నిపుణులు. మరి దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో.. ఎవరు, ఎంతసేపు నడవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వెనక్కి నడక కాళ్ల కండరాలు, శరీర సమతుల్యతను గణనీయంగా మెరుగుపరుస్తుంది.
  • మోకాళ్ల పనితీరు, మెదడు-కండరాల సమన్వయం పెరుగుతుంది, నడిచేటప్పుడు జాగ్రత్తలు ముఖ్యం.
  • సురక్షిత ప్రదేశంలో నిదానంగా నడవడం వల్ల వ్యాయామంలో వైవిధ్యం, కొత్త అనుభూతి.

Backward Walking Explained : వాకింగ్ అంటే ముందుకు నడవడమే అనుకుంటున్నారా? అయితే వెనక్కి నడవడం (Backward Walking లేదా Retro Walking) గురించి కూడా తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు. సాధారణ నడకకు బదులుగా వెనక్కి నడవడం వల్ల కాళ్ల కండరాలు, శరీర సమతుల్యత, కదలికలపై ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. కొన్ని అధ్యయనాలు కూడా వెనక్కి నడక వల్ల మోకాళ్ల పనితీరు, నడక సామర్థ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. 

అలాగే ఇది అందరికీ సరిపోదని.. ఇలా నడిచేప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. మరి వెనక్కి నడవడం వల్ల కలిగే లాభాలు ఏంటో.. ఎవరు నడవకూడదో తెలుసుకుందాం.

Also Read : ఉదయం నడిస్తే మంచిదా? సాయంత్రం నడక బెటరా? ఎప్పుడు వాక్ చేస్తే మంచిదో తెలుసా?

శరీర సమతుల్యత కోసం..

వెనక్కి నడిచేటప్పుడు ఏమి సరిగ్గా కనిపించకపోవచ్చు కాబట్టి నిధానంగా, జాగ్రత్తగా నడవాలి. క్రమంగా, సురక్షితంగా నడవడం ప్రాక్టీస్ చేస్తే.. శరీర సమతుల్యత, కదలికల మధ్య సమన్వయం మెరుగుపడవచ్చు. వెనక్కి నడిచేటప్పుడు అడుగులు, శరీర భంగిమ, సమతుల్యతను ఒకేసారి నియంత్రించాల్సి ఉంటుంది. దీనివల్ల మెదడు, కండరాల మధ్య సమన్వయం ఏర్పడుతుంది.

కాళ్ల కండరాలకు వ్యాయామం

ముందుకు నడిచే విధానానికి భిన్నంగా వెనక్కి నడిచేటప్పుడు తొడల ముందు భాగం, కాళ్లలోని కొన్ని కండరాలు వేరే విధంగా పనిచేస్తాయి. దీంతో కండరాలకు భిన్నమైన వ్యాయామం లభిస్తుంది. అయితే కండరాల బలం పెరగడం అనేది నడక వేగం, వ్యవధి, వ్యక్తి శారీరక సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.

Also Read : రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?

మోకాళ్లపై పడే ఒత్తిడి

వెనక్కి నడవడం వల్ల అడుగులు వేసే తీరు మారుతుంది. కొన్ని పరిశోధనల్లో ఈ విధమైన నడక మోకాళ్లపై పడే భారాన్ని, కదలికల విధానాన్ని మార్చగలదని గుర్తించారు. మోకాళ్ల నొప్పి ఉన్నవారికి.. ఫిజియోథెరపీలో భాగంగా దీనిని ఫాలో అవుతారు. మోకాళ్ల నొప్పి ఉన్నవారు వైద్య నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. 

గుండె ఆరోగ్యం కోసం..

వెనక్కి నడవడం కూడా శారీరక శ్రమలో ఒక భాగమే. కొద్దిసేపు వెనక్కి నడిచినా శరీరం అదనపు శక్తిని వినియోగిస్తుంది. అయితే గుండె ఆరోగ్యానికి ఇది ఒక్కటే సరిపోదు. వేగంగా నడవడం వంటి సాధారణ ఏరోబిక్ వ్యాయామాలు కూడా హార్ట్ హెల్త్ని మెరుగుపరుస్తాయి. 

Also Read : రోజూ ఎంతసేపు నడిస్తే షుగర్, బరువు కంట్రోల్ అవుతుంది? 1 నుంచి 60 నిమిషాలు నడకతో జరిగే మార్పులు ఇవే

నడకలో మార్పులు

కొన్ని ఫిజియోథెరపీ కార్యక్రమాల్లో వెనక్కి నడవడాన్ని నడక తీరు, కాళ్ల కదలికలు, శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా పునరావాస వ్యాయామాల్లో నిపుణుల పర్యవేక్షణలో దీనిని ప్రాక్టీస్ చేయిస్తారు. 

రోజూ ఒకే విధంగా నడవడం బోర్‌గా అనిపిస్తే, సురక్షితమైన ప్రదేశంలో కొద్దిసేపు వెనక్కి నడవడం మీ వ్యాయామంలో వైవిధ్యాన్ని తీసుకురావచ్చు. కొత్త కదలికను నేర్చుకోవడం వల్ల వ్యాయామంపై ఆసక్తి పెరగవచ్చు. 

Also Read : ఉదయాన్నే 30 సెకన్లు వెనక్కి నడిస్తే చాలు.. శారీరక, మానసిక ప్రయోజనాలు పొందడం ఖాయం

వెనక్కి నడవడానికి సరైన సమయం ఏదంటే..

వెనక్కి నడవడానికి ఉదయం లేదా సాయంత్రం అనే ప్రత్యేకమైన ఉత్తమ సమయం లేదు. మీకు అనుకూలమైన సమయంలో, సురక్షితమైన ప్రదేశం ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయవచ్చు. నిద్రలేచిన తర్వాత శరీరాన్ని సిద్ధం చేసేందుకు కొద్దిసేపు సాధారణ నడకతో ప్రారంభించి.. ఆ తర్వాత వెనక్కి నడవడాన్ని ప్రయత్నించవచ్చు.

పార్కులో లేదా సమతలంగా ఉన్న సురక్షితమైన ప్రదేశంలో సాధన చేయవచ్చు. చుట్టుపక్కల వ్యక్తులు, వస్తువులు ఉన్నాయో లేదో గమనించి వాక్ చేసుకోవచ్చు. ముందుగా 1 నుంచి 2 నిమిషాల పాటు నడవడం నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత క్రమంగా పెంచుకోవచ్చు. మోకాళ్లు, నడుము లేదా చీలమండల్లో నొప్పి, తలతిరగడం అనిపిస్తే వెంటనే ఆపేయాలని సూచిస్తున్నారు నిపుణులు.

Also Read : భోజనం తర్వాత పది నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా? బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి రెట్టింపు లాభాలు

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cigarette Cravings : సిగరెట్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ తినండి, స్మోకింగ్ తగ్గించుకోగలుగుతారు
సిగరెట్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ తినండి, స్మోకింగ్ తగ్గించుకోగలుగుతారు
Curry Leaf Oil For Hair : కరివేపాకులు తెల్లజుట్టును నల్లగా మార్చేస్తాయా? ఇంట్లోనే కరివేపాకు నూనె ఇలా చేసుకోండి
కరివేపాకులు తెల్లజుట్టును నల్లగా మార్చేస్తాయా? ఇంట్లోనే కరివేపాకు నూనె ఇలా చేసుకోండి
High Cholesterol : భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
Cough and Cold in Kids : చలికాలంలో పిల్లలకు దగ్గు, జలుబు వచ్చాయా? ఉపశమనం కోసం ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
చలికాలంలో పిల్లలకు దగ్గు, జలుబు వచ్చాయా? ఉపశమనం కోసం ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
Advertisement

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Bigg Boss Season 10 Today October 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
‌‌UPI Wrong Transfer: యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
Jailer 2: ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
CBFC Leaks: ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!
ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!
Embed widget