అన్వేషించండి

Patanjali Medicine: కిడ్నీ హెల్త్ కోసం ఆయుర్వేద మెడిసిన్.. పతంజలి రెనోగ్రిట్ తో సమస్యలు దూరం

Ayurvedic Medicine For Kidney Protection | మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు మూత్రంలోని విషపూరితాలను తొలగిస్తుంది. పతంజలి తీసుకొచ్చిన ఆయుర్వేద మెడిసిన్ రెనోగ్రిట్ వరం అని సంస్థ తెలిపింది.

Kidney Health: మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు ఒకటి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు మూత్రం ద్వారా విషపదార్థాలను తొలగిస్తాయి. అంతేకాకుండా, రక్తపోటును నియంత్రించడంలో, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో మూత్రపిండాలు పాత్ర కీలకం. మన శరీరంలో ఖనిజ లవణాలు, ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేసి మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. మూత్రపిండాల నిర్మాణ యూనిట్లను నెఫ్రాన్లు అంటారు. ఇవి గ్లూకోజ్, నీరు, అమైనో ఆమ్లాలు వంటి ముఖ్యమైన మూలకాలను తిరిగి గ్రహించి వాటిని శరీరానికి అందిస్తాయి. 

అయితే, అల్లోపతి మందుల వాడకం క్రమంగా పెరుగుతోంది. వీటిని అధికంగా, ఎక్కువ కాలం వాడటం మూత్రపిండాలకు హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పలు పరిశోధనల ప్రకారం 5- 35 శాతం కేసులలో వాంకోమైసిన్ మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. దీనివల్ల పేషెంట్లు చికిత్స కోసం ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండవలసి వస్తుంది. దాంతో వారి ట్రీట్మెంట్, మెడిసిన్ ఖర్చులు పెరుగుతాయి. అలాగే కిడ్నీ పనితీరు తగ్గడంతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.

వాంకోమైసిన్ కిడ్నీ పనితీరును ఎలా దెబ్బతీస్తుంది?

వాంకోమైసిన్ మూత్రపిండాలను దెబ్బతీయడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని రీసెర్చ్‌లో తేలింది. వాంకోమైసిన్ శరీరంలో రియాక్టివ్ ఆక్సిజన్ జాతులు (ROS)ని పెంచుతంది. అవి మూత్రపిండ కణాలను దెబ్బతీస్తాయి. తీవ్రమైన ఇంటర్‌స్టీషియల్ నెఫ్రిటిస్ అని పిలిచే మూత్రపిండ నాళాల చుట్టూ వాంకోమైసిన్ వాపును కలిగిస్తుంది. ఆ వాపు, ఆక్సీకరణ ఒత్తిడి వల్ల మూత్రపిండ కణాలు చనిపోతుంటాయి. దాంతో మీ మూత్రపిండాలు ఎప్పటిలాగా మెరుగ్గా పనిచేయవు.

మూత్రపిండాల సమస్యను ప్రారంభంలోనే గుర్తించడం మనకు చాలా ముఖ్యం. తద్వారా సమస్యలకు సాధ్యమైనంత త్వరగా చికిత్స తీసుకోవచ్చు. మూత్రం ఉత్పత్తి తగ్గడం, కాళ్లు, చీలమండలలో వాపు, బలహీనంగా అనిపించడం లేదా మానసిక గందరగోళం వంటివి సాధారణ లక్షణాలు. ఒకవేళ మీరు ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే, అవి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కిడ్నీ ఆరోగ్యానికి ఆయుర్వేద పరిష్కారాలు

అల్లోపతి మందుల దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు రెనోగ్రిట్ అనే ఆయుర్వేద మెడిసిన్ తయారు చేసింది. ఇందులో అపమార్గ్, కాస్ని, పషన్భేద్, పలాష్, వారున్, పునర్నవ మూల్, గోఖరు వంటి సహజ మూలికలు ఉంటాయి. మోనోస్పెర్మోస్సైడ్, బ్యూటిన్‌లో ఉండే గాలిక్ యాసిడ్, బెర్జెనిన్, మిథైల్ గాలెట్, క్వెర్సెటిన్, బోయిరావిన్ B వంటివి మీ కిడ్నీలకు మేలు చేస్తాయి.

మోడ్రన్ రీసెర్చ్‌లో ప్రభావం చూపిన రెనోగ్రిట్ 

రెనోగ్రిట్ మెడిసిన్ మనుషులపై ఏ మేరకు ప్రభావిన్ని చూపుతుందో రెండు విధాలుగా పరీక్షించామని పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. 

  • మానవ మూత్రపిండాలలోని 'ప్రాక్సిమల్ ట్యూబ్యులర్' కణాల నుండి త్రీ-డైమెన్షనల్ నిర్మాణాలు (స్పిరాయిడ్స్) తయారు చేసి, వాటిపై వాంకోమైసిన్ ఏ మేరకు ప్రభావం చూపుతుందని పరిశీలించారు. ఆ తర్వాత ఈ స్పిరాయిడ్లపై 'ఇన్-విట్రో' (ల్యాబ్) పరీక్షలో రేనోగ్రిట్ అనే మెడిసిన్ ఉపయోగించగా మూత్రపిండాలను దెబ్బతీసే కారకాలను ఈ మెడిసిన్ నియంత్రించినట్లు గుర్తించారు.
  • అనంతరం ఎలుకలపై 'ఇన్-వివో' (జీవరాశులపై) టెస్ట్ చేశారు. వాటికి వాంకోమైసిన్ ఇచ్చి మూత్రపిండాల పనితీరును విశ్లేషించారు. ఈ పరీక్షలో బ్లడ్ యూరియా నైట్రోజన్, సీరమ్ క్రియాటినిన్, వాటి క్లియరెన్స్, ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్, శరీరం, మూత్రపిండాల బరువు నిష్పత్తి, ఆక్సిడేటివ్ స్ట్రెస్, జీన్ ఎక్స్‌ప్రెషన్‌లను కొలిచి చూశారు. ఈ ప్రక్రియలో రేనోగ్రిట్ మెడిసిన్ కిడ్నీ ప్రాబ్లమ్స్‌కు సంబంధించిన కొన్ని సమస్యలను పరిష్కరించినట్లు గుర్తించారు. 

పతంజలి తయారుచేసిన రెనోగ్రిట్ మెడిసిన్ ఆయుర్వేదానికి వైద్యశాస్త్రంలో పలు అనారోగ్య సమస్యలను  పరిష్కరిస్తుందని నిరూపించింది. ఇది వాంకోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్ దుష్ప్రభావాల నుండి కిడ్నీలను కాపాడటంతో పాటు వాటి పనితీరు మెరుగు చేస్తుంది. ప్రకృ సహజ మూలికలతో చేయడం వల్ల ఇది చాలా సురక్షితం. ఆయుర్వేద మెడిసిన్ మన ఆరోగ్యానికి నమ్మకమైన ప్రొడక్ట్ అని రెనోగ్రిట్ నిరూపిస్తోంది.

Disclaimer: ది స్పాన్సర్ స్టోరీ. ABP నెట్‌వర్క్ /లేదా ABP Desam గానీ ఇందులోని విషయాలను, ఈ అభిప్రాయాలను నిర్ధారించదు. మీకు ఏదైనా వైద్య సమాచారం కావాలన్నా, మెడిసిన్, ట్రీట్మెంట్ కోసమైనా ముందుగా నిపుణులను సంప్రదించాలి, వారి సలహా మేరకు నిర్ణయాలు తీసుకోవాలని సూచన.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget