అన్వేషించండి

Mothers Milk: తల్లిపాలు పిల్లలకు ఏ వయసులో మానిపించాలి?

తల్లిపాలు పిల్లలకు ఎప్పుడు మానిపించాలి అనే విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

కొందరు చంటి పిల్లలకు ఆరు నెలలకే తల్లిపాలు మానిపిస్తారు. మరికొందరు ఏడాదికి, ఇంకొందరు రెండేళ్ల వరకు తల్లిపాలు పెడతారు. ఎప్పుడు తల్లిపాలు మానిపిస్తే వారిపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉంటుందో వైద్యులు వివరిస్తున్నారు.

చంటి పిల్లలకు ఆరు నెలల వయసు వచ్చాక బయటి ఆహారాన్ని ఇవ్వడం మొదలుపెడతారు. ఉడకబెట్టిన ఆహారాలు, రాగి జావ, అన్నాన్ని జావలా చేసి వారి చేత తినిపించడం వంటివి చేస్తూ ఉంటారు. తల్లిపాలతో పాటు ఇలా ఘన రూపంలో ఆహారాన్ని అందించడం వల్ల వారి ఎదుగుదల బాగుంటుంది. అయితే హఠాత్తుగా తల్లిపాలు మానిపిస్తే మాత్రం వారిపై చాలా ప్రభావం పడుతుంది. పిల్లలు పుట్టిన ఆరు నెలల పాటు కేవలం వారికి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాతే తల్లిపాలను మానిపించే ప్రక్రియ మొదలు పెట్టాలి. హఠాత్తుగా తల్లిపాలను మానిపించకూడదు. రోజులో కనీసం ఐదు నుంచి ఆరుసార్లు తల్లిపాలు ఇస్తూనే, బయట ఆహారాన్ని తినిపిస్తూ ఉండాలి. ఆరు నెలల వయసు తర్వాత తల్లిపాలను తగ్గించాలి. కానీ పూర్తిగా మానిపించకూడదు. ఆరు నెలల తర్వాత కూడా కేవలం తల్లిపాలు ఇచ్చేవారు ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఐరన్, ఇతర పోషకాలు లోపించే అవకాశం ఉంది. కాబట్టి ఆరు నెలల వయసు దాటాక తల్లిపాలతో పాటు ఇతర ఆహారాలను అలవాటు చేయాలి.

మొదట ఆరు నెలల వయసులో లిక్విడ్ డైట్ ను పిల్లలకు ప్రారంభించాలి. కూరగాయలను మెత్తగా ఉడికించి జ్యూస్ లా చేసి వాటిని తినిపించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఇతర ఆహారాలను రుచి చూసేందుకు ఇష్టపడతారు. అన్నం వంటి వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేశాకే వారికి తినిపించాలి. గట్టిగా ఉండే ఘనాహారాన్ని పెట్టకూడదు. అన్నాన్ని కూడా నీళ్లు కలిపి జావలా చేయాలి. అప్పుడే వాళ్ళు మింగగలుగుతారు.

అలా ఎప్పుడైతే బయటి ఆహారాన్ని తినడం పిల్లలు ప్రారంభిస్తారో తల్లిపాలు తాగడం ఆటోమేటిక్‌గా తగ్గిస్తారు. నిద్రపోయే సమయాల్లో మాత్రమే వారికి తల్లిపాలు అవసరం పడతాయి. దీనివల్ల తల్లికి కూడా ఒత్తిడి తగ్గుతుంది. పిల్లలు ఏడాది వయసు వచ్చేసరికి తమంతట తాము తినడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సమయంలో వారు తల్లిపాలను ఇంకా తగ్గిస్తారు. ఆరు నుంచి 12 నెలల వరకు పిల్లలకు లిక్విడ్ డైట్‌నే అలవాటు చేయాలి. ఓ పక్క తల్లిపాలు తాగిస్తూ లిక్విడ్ డైట్ ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. ఏడాది నిండాక మాత్రం మెత్తగా ఉన్న గణాహారాన్ని అలవాటు చేయాలి. పోషక సమస్యలు లేకుండా ఉడికించిన క్యారెట్, పాలకూర, ఆపిల్, బంగాళదుంప లాంటివి పిల్లలకు తినిపిస్తూ ఉండాలి. ఏడాది దాటాక పిల్లలు తల్లి పాలను మానేసినా పెద్దగా ప్రమాదం లేదు. వారికి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తూ ఉంటే వారిలో పోషకాహారలేమి రాకుండా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్లో ఐరన్ లోపిస్తూ ఉంటుంది. కాబట్టి వారికి బెల్లంతో చేసిన ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి. దీనివల్ల తల్లిపాలు ఆపేసిన కూడా వారిలో ఐరన్ లోపం రాదు.

Also read: మగవారు వాసెక్టమీ చేయించుకుంటే లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

టాప్ హెడ్ లైన్స్

Bloating After Eating : తిన్న వెంటనే మీకు గ్యాస్ వస్తుందా? అయితే మీరు ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి
తిన్న వెంటనే మీకు గ్యాస్ వస్తుందా? అయితే మీరు ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి
Heart Health : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎన్ని అడుగులు వేయాలి? 6,000 లేదా 10,000? వైద్యుల సూచనలు ఇవే
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎన్ని అడుగులు వేయాలి? 6,000 లేదా 10,000? వైద్యుల సూచనలు ఇవే
Budget Family Trip : ఫ్యామిలీతో ట్రిప్​కు ప్లాన్ చేస్తున్నారా? తక్కువ బడ్జెట్​లో ఇండియాలో వెళ్లేందుకు బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే
ఫ్యామిలీతో ట్రిప్​కు ప్లాన్ చేస్తున్నారా? తక్కువ బడ్జెట్​లో ఇండియాలో వెళ్లేందుకు బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే
Perfect Tea : టీ పర్​ఫెక్ట్​గా రావాలంటే ముందుగా పాలు వేయాలా? లేదా నీళ్లా? బెస్ట్ టేస్ట్ కోసం ఈ పద్ధతి ట్రై చేయండి
టీ పర్​ఫెక్ట్​గా రావాలంటే ముందుగా పాలు వేయాలా? లేదా నీళ్లా? బెస్ట్ టేస్ట్ కోసం ఈ పద్ధతి ట్రై చేయండి

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
Sahaa Movie : గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Embed widget