News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Kiss To Inmate: హతవిధీ.. హంతకుడికి ముద్దు పెట్టిన లేడీ జడ్జి.. కెమేరాకు చిక్కిన రొమాన్స్!

బాధ్యతాయుత పదవిలో ఉన్న న్యాయమూర్తి.. ఏకంగా ఓ హంతకుడికి ముద్దు పెట్టి చిక్కుల్లో పడింది. ఇప్పుడు క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొంటోంది.

FOLLOW US: 
Share:

.. మ.. మ.. ముద్దంటే చేదా? నీకా ఉద్దేశం లేదా? అని అడిగితే.. ఎవరు ఊరుకుంటారు చెప్పండి. కానీ.. ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన న్యాయమూర్తి (జడ్జి) కూడా ఇలా టెంప్ట్ అవుతారని ఎవరూ ఊహించలేరు. కానీ, అదే మ్యాజిక్కు. అర్జెంటీనాకు చెందిన ఓ న్యాయమూర్తి ఆ పనే చేసింది. ఏకంగా హత్య ఘటనలో శిక్ష అనుభవిస్తున్న హంతకుడికే ముద్దుపెట్టింది. చివరికి చిక్కుల్లో పడింది. పాపం ఎవరూ చూడటం లేదు కదా అని ముద్దుకు కక్కుర్తి పడింది. నిఘా నేత్రానికి చిక్కి అడ్డంగా బుక్కైంది.  

అర్జెంటీనాలో చుబూట్ ప్రావిన్స్‌కు చెందిన న్యాయమూర్తి మారిల్ సురెజ్.. క్రిస్టియన్ మాయి బుస్టాస్ అనే ఖైదీతో రొమాన్స్ చేస్తూ సీసీటీవీ కెమేరాకు చిక్కింది. డిసెంబరు 29న చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొట్టింది. ఈ విషయం సుప్రీం కోర్డు వరకు వెళ్లింది. వెంటనే మారిల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ.. అర్జెంటీనా సుపీరియర్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆదేశించారు. 

ఏం జరిగింది?: 2009 సంవత్సరంలో లీండ్రో రాబర్ట్స్ అనే పోలీస్ అధికారిని షూట్ చేసి దారుణంగా చంపేశాడు. ఈ కేసుపై ఇటీవలే కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. ఈ హత్య ఘటనకు ముందే బుస్టాస్ మరో హత్య కేసులో నిందితుడు. తన పిన కొడుకుని కొట్టి చంపిన కేసులో కారాగార శిక్ష అనుభవిస్తున్న అతడు.. జైలు నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా అతడు ఓ పోలీస్ అధికారిని కాల్చి చంపాడు. ఈ ఘటనలో అతడి సోదరుడు కూడా చనిపోయాడు. 

కోర్టు సమాచారం ప్రకారం.. బుస్టాస్‌కు విధించిన శిక్షను తగ్గించాలంటూ ఇటీవల జరిగిన విచారణలో జడ్జి మారిల్ అతడికి అనుకూలంగా ఓటేసింది. కానీ, తుది తీర్పులో కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. అయితే.. అతడికి, లేడీ జడ్జికి ఎప్పుడు బంధం ఏర్పడిందో తెలీదు. అర్జెంటీనా ప్రావిన్షియల్ పెనిటెన్షియరీ ఇన్స్టిట్యూట్‌లో అతడిని కలవడానికి వెళ్లిన మారిల్.. అతడికి ముద్దు పెట్టింది. ఈ ఘటన పెద్ద దుమారమే రేపింది. ఎందుకంటే.. మారిల్ స్త్రీవాది. న్యాయవ్యవస్థలో పురుషులతోపాటు స్త్రీలకు కూడా సమాన ప్రాతినిధ్యం పెంచాలని ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మహిళలకు ఆదర్శంగా ఉండాల్సిన ఆమె ఇలా చేయడం చాలా బాగోలేదంటూ అంతా మండిపడుతున్నారు. 

వీడియో: 

Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్

Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!

Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)

Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 07 Jan 2022 10:15 PM (IST) Tags: Argentina judge kiss Argentina kiss judge kissed inmate అర్జెంటీనా జడ్జి కిస్

ఇవి కూడా చూడండి

Chicken Pakodi Recipe : సండే స్పెషల్ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ పకోడి.. టేస్టీ టేస్టీ రెసిపీ ఇదే

Chicken Pakodi Recipe : సండే స్పెషల్ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ పకోడి.. టేస్టీ టేస్టీ రెసిపీ ఇదే

Christmas Gifts : క్రిస్మస్​కు గిఫ్ట్స్ ఇస్తున్నారా? అయితే ఇవి గుర్తించుకోండి

Christmas Gifts : క్రిస్మస్​కు గిఫ్ట్స్ ఇస్తున్నారా? అయితే ఇవి గుర్తించుకోండి

Winter Foods For Glowing Skin : వింటర్​లో చర్మాన్ని పొడిబారకుండా చేసే ఫుడ్స్ లిస్ట్ ఇదే

Winter Foods For Glowing Skin : వింటర్​లో చర్మాన్ని పొడిబారకుండా చేసే ఫుడ్స్ లిస్ట్ ఇదే

Christmas 2023 gift ideas : క్రిస్మస్ రోజు మీ పిల్లలకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఇవి ట్రై చెయ్యండి

Christmas 2023 gift ideas : క్రిస్మస్ రోజు మీ పిల్లలకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఇవి ట్రై చెయ్యండి

Herbs benefits: ఆయుర్వేదం - మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మూలికలు ఇవే, ఏయే రోెగాల నుంచి రక్షిస్తాయంటే?

Herbs benefits: ఆయుర్వేదం - మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మూలికలు ఇవే, ఏయే రోెగాల నుంచి రక్షిస్తాయంటే?

టాప్ స్టోరీస్

Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి

Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి

Balineni YSRCP : మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

Balineni YSRCP :  మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా  - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

Tripti Dimri: నెట్టింట్లో త్రిప్తికి ఫుల్ క్రేజ్, ‘యానిమల్‌’ తర్వాత ఓ రేంజ్​లో పెరిగిన ఇన్‌స్టా ఫాలోవర్స్‌!

Tripti Dimri: నెట్టింట్లో త్రిప్తికి ఫుల్ క్రేజ్, ‘యానిమల్‌’ తర్వాత ఓ రేంజ్​లో పెరిగిన ఇన్‌స్టా ఫాలోవర్స్‌!

Revanth Reddy Canvoy: ట్రాఫిక్‌లో ఇరుక్కున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కొత్త కాన్వాయ్ నంబర్ ఇదే

Revanth Reddy Canvoy: ట్రాఫిక్‌లో ఇరుక్కున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కొత్త కాన్వాయ్ నంబర్ ఇదే