(Source: ECI/ABP News/ABP Majha)
Food Allergy : ఫుడ్ అలర్జీని లైట్ తీసుకోవద్దు - గుండె ఆగిపోద్ది!
Heart Problems: తరచుగా ఫుడ్ అలర్జీకి గురవ్వుతున్నారా? దాన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. అది గుండె జబ్బులకు కారణం కావచ్చు.
Heart attack with food allergy : ఒక్కోసారి మనకు ఆహార పదార్థాల వల్ల ఎలర్జీ రావడం చూస్తూనే ఉంటాం. ఇందుకు ప్రత్యేకంగా కారణాలు లేకపోయినప్పటికీ.. మన శరీరం కొన్ని రకాల ఆహార పదార్థాలను గ్రహించలేకపోవడం కారణంగా ఈ రకం ఎలర్జీలు వస్తూ ఉంటాయి. సాధారణంగా కొంతమందికి సీ ఫుడ్, పాల ఉత్పత్తులు, నట్స్ వి తీసుకోవడం వల్ల ఎలర్జీలు వస్తుంటాయి. వీటిని తిన్నప్పుడు వారి శరీరంలో రియాక్షన్స్ మొదలవుతాయి. ఫలితంగా వాంతులు విరోచనాలు స్కిన్ ర్యాషెస్ వంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ఎలర్జీల వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ లేకపోవచ్చని మనం భావిస్తూ ఉంటాము. కానీ ఇటీవల వైద్య నిపుణులు ఎలర్జీల వల్ల కలిగే ప్రమాదకరమైనటువంటి జబ్బుల గురించి పరిశోధనలో తేల్చారు. తాజాగా ఓ పరిశోధనలో ఫుడ్ ఎలర్జీ వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని తేల్చారు.
యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా హెల్త్ సిస్టమ్‌లోని పరిశోధకులు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో పాలు, వేరుశెనగ వంటి ఆహారాల వల్ల తలెత్తే ఎలర్జీ వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి అలర్జీల వల్ల ధూమపానం కంటే ఎక్కువగా గుండెనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఫుడ్ అలెర్జీకి గుండె జబ్బులకు ఉన్న లింక్ ఇదే?
యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా హెల్త్ సిస్టమ్‌లోని పరిశోధకులు వేలాది మంది రోగులపై ఒక సర్వే నిర్వహించారు. ఇందులో పాల ఉత్పత్తులతో సహా ఇతర ఆహారాలకు ప్రతిస్పందనగా శరీరం ఉత్పత్తి చేసే అలర్జీలు హృదయ సంబంధిత మరణానికి గురయ్యే ప్రమాదం ఉందని కనుగొన్నారు.
ధూమపానం, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి మాత్రమే గుండె జబ్బులకు ప్రమాద కారకాలు కావు అని ఆ అధ్యయనం తేల్చింది. ఆవు పాలకు అలెర్జీ ఉన్నవారు, వేరుశెనగ, రొయ్యలు వంటివి తిన్నప్పుడు కూడా శరీరంలో ఉత్పత్తి అయ్యే అలెర్జీ కారకాలు గుండె జబ్బులకు కారణం అవుతాయని ఈ పరిశోధనలో తేలింది.
ఈ పరిశోధనలను మరింత అధ్యయనం చేయవలసి ఉండగా, శరీరంలోని అలెర్జీ కారణంగా గుండె ప్రమాదం పెరగవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు, ఇది నేరుగా శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. "సుమారు 15 శాతం మంది జనాభాలో ఆవు పాలు, వేరుశెనగ, ఇతర ఆహారాలను తిన్నప్పుడు వారి శరీరంలో IgE యాంటి బాడీస్ ఉత్పత్తి అవుతాయి’’ అని అధ్యయనం పేర్కొంది.
మీరు తెలుసుకోవలసిన అత్యంత సాధారణ ఆహార అలెర్జీలలో 6:
ఆరోగ్య నిపుణులు తెలిపిన ప్రకారం.. ఇమ్యునోగ్లోబులిన్ E (IgE), ఒక రకమైన యాంటీబాడీ ఇది అలెర్జీ ద్వారా శరీరంలో భారీ పరిమాణంలో అయినప్పుడు అలర్జీలు సంభవిస్తాయి. రియాక్టెంట్ ఫుడ్‌లోని ప్రోటీన్ సాధారణంగా ఇమ్యూనిటీ వ్యవస్థపై రియాక్షన్ చూపిస్తుంది.
అయితే, ఈ అలర్జీలు ఆహారపు అలవాట్లు, ఫ్యామిలీ హిస్టరీని బట్టి మారుతూ ఉంటాయి. ఫుడ్ అలెర్జీలు వయస్సు ప్రకారం.. వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. గుడ్డు, వేరుశెనగ, మొక్కజొన్న, పాలు, పాల ఉత్పత్తులు, గోధుమ (గ్లూటెన్), సోయా వంటి ఆహార పదార్థాలు అలర్జీలకు కారణం అవుతుంటాయి.
Also Read : తలస్నానం చేసేప్పుడు ఆ తప్పులు చేస్తే మీ జుట్టు హాంఫట్!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.