Vitamin B12: విటమిన్ బి 12 లోపంతో బాధపడుతున్నారా? ఇవి తింటే ఆ లోపం నుంచి బయటపడొచ్చు
చాలా మంది అనేక రోగాలతో బాధపడుతూ ఉంటారు. వాటికి కారణం విటమిన్స్, ఖనిజాలు లోపం కావచ్చు. శరీరానికి కావాల్సిన పోషకాలు సక్రమంగా అందకపోతే బలహీనంగా కనిపిస్తాం.
చాలా మంది అనేక రోగాలతో బాధపడుతూ ఉంటారు. వాటికి కారణం విటమిన్స్, ఖనిజాలు లోపం కావచ్చు. శరీరానికి కావాల్సిన పోషకాలు సక్రమంగా అందకపోతే బలహీనంగా కనిపిస్తాం. ఇవి సరిగ్గా లేకపోతే అనారోగ్య సమస్యలకుదారి తీస్తుంది. అందుకే శరీరానికి అవసరమైన విటమిన్స్, ఖనిజాలు సమృద్దిగా ఉండే విధంగా మనం ఆహారం తీసుకోవాలి. ఒక్కోసారి బాగా తిన్నప్పటికీ నీరసంగా ఉంటుంది. బాగా తిన్నప్పటికీ శరీరంలో విటమిన్స్ లోపం తలెత్తుతుంది. అటువంటిదే విటమిన్ బి 12 లోపం. ఇది శరీరానికి తగినంత అందకపోతే నీరసంగా ఉంటుంది. అంతే కాదు అలసట, వికారం, కండరాల నొప్పి వంటివి విటమిన్ బి 12 లోపనికి సాంకేటాలుగా గుర్తించాలి. ఈ లోపాన్ని అధిగమించేందుకు అనేక సప్లిమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు ఆహారపు అలవాట్లలో కొద్దిగా మార్పులు చేసుకున్నా విటమిన్ బి 12 పొందవచ్చు. ఈ విటమిన్ పొందేందుకు కొన్ని ఆహారాలు పదార్థాలను మీ డైట్లో భాగం చేసుకోవాలి.
బి 12 లభించే పదార్థాలు
పుట్ట గొడుగులు: వీటిల్లో విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది. ఈ లోపంతో బాధపడే వాళ్ళు తరచూ పుట్ట గొడుగులు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
సాల్మన్ చేప: ఈ చేపలో విటమిన్ B12కి మంచి మూలం. అంతే కాదు ఇందులో ఒమేగా-3 కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
క్లామ్స్( Clams): ఇందులో విటమిన్ B12 అధికంగా ఉంటుంది. దీన్ని వండిన లేదా పచ్చిగా కూడా తినవచ్చు. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఐరన్ ను అందిస్తుంది.
తృణ ధాన్యాలు: విటమిన్ బి 12 నుంచి పోరాడేందుకు తృణ ధాన్యాలు అల్పాహారంగా తీసుకుంటే మంచిది.
పాలు: పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాలిష్యం ఇవ్వడంతో పాటు విటమిన్ బి 12, విటమిన్ డి కూడా అందేలా చూస్తుంది. మీ ఆహారంలో ఒక గ్లాస్ పాలు తీసుకోవడం చేశారంటే విటమిన్ బి 12 నుంచి ఉపశమనం పొందవచ్చు.
Also Read: రోజూ నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? లేక ఆరోగ్యానికి చెడు చేస్తుందా?
Also Read: కొరియా చిట్కా - ఐస్ నీళ్లలో ముఖం పెడితే అన్ని ప్రయోజనాలా? మీరు అస్సలు నమ్మలేరు!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.