Induction Stove: ఇండక్షన్ స్టవ్ కొంటున్నారా? ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి
ఇప్పుడు ఎక్కువ మంది గ్యాస్ స్టవ్ కంటే ఇండక్షన్ స్టవ్ వాడకమే అధికంగా ఉంటుంది. అందుకు కారణం వంట సులభం, తక్కువ సమయం. కానీ ఎలాంటిది కొనాలనే దాని మీద పూర్తి అవగాహన అవసరం.
వంట చేసుకునే పద్ధతి రోజురోజుకీ సులువై పోతుంది. మైక్రోవేవ్ ఓవెన్, కాఫీ మేకర్, జ్యూస్ మేకర్, ఇండక్షన్ ఇలా వంట గదిలో అనేక విద్యుత్ ఉపకరణాలు వచ్చేస్తున్నాయి. ఇవి వంట చేసే సమయాన్ని తగ్గిస్తున్నాయి. గ్యాస్ స్టవ్ మీద వంట ఎక్కువ సేపు పడుతుందని సింపుల్ గా ఎక్కడ అంటే అక్కడ అమరే విధమైన ఇండక్షన్ స్టవ్ కి అత్యధికులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. గ్యాస్ ఎలా ఉపయోగించాలో తెలియని వాళ్ళు ఇండక్షన్ మీద ఆధారపడుతున్నారు. అయితే మీరు ఎటువంటి ఇండక్షన్ కొనుక్కుంటున్నారు అనేది చాలా ముఖ్యం. తక్కువ రేటు కదా అని నాణ్యత లేనిది కొనుగోలు చేస్తే త్వరగా చెడిపోతుంది. అందుకే మీరు ఇండక్షన్ కొనే ముందు ఈ విషయాలు తప్పకుండా గుర్తు పెట్టుకోండి.
వాట్స్
వంట గది కోసం ఇండక్షన్ కొనుగోలు చేసేటప్పుడు అది ఎన్ని వాట్స్ అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. దాని అధిక శక్తి వల్ల ఆహారం వేగంగా అవుతుంది. వంట గదికి ఎన్ని వాట్స్ ఉత్తమ ఇండక్షన్ ఉండాలి అంటే 1000-2000 వాట్స్ మధ్య ఉన్నది తీసుకుంటే చక్కగా అమరుతుంది. వంట చేయడం సులభమవుతుంది.
ఆటో స్విచ్ ఆఫ్ ఫీచర్
ఆన్/ ఆఫ్ స్విచ్ తో వచ్చే ఇండక్షన్ లు ఉన్నాయి. ఈ ఆటో స్విచ్ ఆఫ్ ఫీచర్ ఆహారం వేడెక్కకుండా నిరోధిస్తుంది. అంటే కూరలు మాడిపోకుండా చేస్తుంది. అతిగా ఉడకకుండా ఆహారంలోని పోషకాలను ఆదా చేస్తుంది. ఇండక్షన్ మీద పెట్టి పాన్ లేదా మరేదైనా వస్తువు తీసేసిన వెంటనే ఈ ఫీచర్ ఇండక్షన్ ని ఆఫ్ చేస్తుంది. మీరు ప్రత్యేకంగా వంట చేసిన తర్వాత ఆపాల్సిన అవసరం ఉండదు.
సాంకేతిక వివరాలు
ఈరోజుల్లో ఇండక్షన్ కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. అందుకే ప్రతి ఇండక్షన్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏమి ఉన్నాయో చెక్ చేసుకోవడం ముఖ్యం. ఇండక్షన్ లో గ్యాస్ వంటి నాబ్ లేదు. కానీ ఉష్ణోగ్రతను తగ్గించడానికి, పెంచడానికి ఖచ్చితంగా బటన్ ఉంటుంది. మరికొన్ని ఇండక్షన్స్ లో టైమర్ కూడా ఉంటుంది. ఇండక్షన్ హీటింగ్ టైమ్ తనిఖీ చేయడం చాలా ముఖ్యం.
బ్రాండ్, వారెంటీ
ఏదైనా ఇండక్షన్ కొనుగోలు చేసే ముందు దాని బ్రాండ్ తనిఖీ చేయడం చాలా ముఖ్యం. కంపెనీ ISI మార్కు ఉందా లేదా చూసుకోవాలి. ఇండక్షన్ స్టవ్ ని కొనుగోలు చేస్తే సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ వారంటీ ఉంటుంది. ISI గుర్తు లేకపోతే అటువంటి దానిని కొనుగోలు చేయకుండా ఉండటమే మంచిది.
మరిన్ని జాగ్రత్తలు
ఆన్ లైన్ లో ఇండక్షన్ కొనుగోలు చేయడం మానుకోండి. ఎందుకంటే అది కొన్ని సార్లు సరిగా పని చేయకపోవచ్చు. వారంటీ కూడా ఉండదు. ఇండక్షన్ మీద ఎప్పుడు స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు మాత్రమే ఉపయోగించండి. ఈ పాత్రలు వాడటం వల్ల ఇండక్షన్ ఎక్కువ రోజులు మన్నికగా పని చేస్తుంది.
Also Read: ఒత్తిడిని దీర్ఘకాలం పాటు సాగితే మానసిక సమస్యలు రావొచ్చు