అన్వేషించండి

Antibiotics: యాంటీబయోటిక్స్ ఎడాపెడా వాడుతున్నారా? చాలా ప్రమాదకరం

యాంటీబయోటిక్స్ ఎడాపెడా వాడుతున్న దేశాల్లో మనది ఒకటి.

యాంటీబయోటిక్స్ ఎప్పుడు వాడాలి? దీనిపై మన దేశంలో అవగాహన చాలా తక్కువగా ఉంది. అందుకే వీటిని ఎప్పుడు పడితే అప్పుడు వాడే దేశాల్లో మనది అగ్రస్థానంలో ఉంది. జనాభా అధికంగా ఉండడం, పేదరికం, అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత ఇవన్నీ కూడా ఇలా యాంటీబయోటిక్స్ ను నచ్చినట్టు వాడే పరిస్థితికి కారణం అవుతున్నాయి. ఎవరూ నమ్మని విషయం ఏమిటంటే ప్రపంచం మొత్తం మీద ఎయిడ్స్, మలేరియా వంటి రోగాల కన్నా యాంటీబయోటిక్స్ వాడి మరణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది.

ప్రపంచ దేశాల్లో యాంటీబయోటిక్స్‌ను అధికంగా వాడుతున్న దేశాల్లో మనదే మొదటి స్థానం. వీటిని వాడే పద్ధతి కూడా మన జనాభాకు సరిగా అవగాహన లేదు. అంతేకాదు యాంటీబయోటిక్స్ ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం కూడా మనదే. అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దుకాణాల్లో యాంటీబయోటిక్స్ ను అడ్డదిడ్డంగా అమ్మేది కూడా మనమే. అందుకే ఆరోగ్య నష్టాలు మన జనాభాలోనే అధికంగా ఉన్నాయి. అవసరం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు యాంటీబయోటిక్స్ వాడడం వల్ల మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. సాధారణ మందులకు లొంగాల్సిన బాక్టీరియా కూడా మన శరీరంలో జన్యు పరిణామాలకు లోనై శక్తివంతంగా తయారవుతుంది. యాంటీబయోటిక్స్ ను తట్టుకునే శక్తిని సంపాదించుకుంటోంది. దీనివల్ల సాధారణ యాంటీబయోటిక్స్‌కు రోగాలు తగ్గవు. మరింత శక్తివంతమైన యాంటీబయోటిక్స్ వాడాల్సి వస్తుంది. ఇలా వాడడం వల్ల శరీరం చాలా నీరసపడిపోతుంది. అవయవాలు నీరసపడతాయి.

యాంటీబయోటిక్సు కూడా తట్టుకునే శక్తి గల బ్యాక్టీరియాలను సూపర్ బగ్స్ అంటారు. మనం ఎడాపెడా యాంటీబయోటిక్స్ వాడడం వల్ల మన శరీరంలో ఈ సూపర్ బగ్స్ జీవించే అవకాశం ఉంది. సాధారణ బ్యాక్టీరియానే మనం వాడే యాంటీబయోటిక్స్ తట్టుకొని నిలిచే సూపర్ బగ్స్ గా రూపాంతరం చెందుతున్నాయి.  ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు సాధారణ ఔషధాలకు ఈ సూపర్ బగ్స్ లొంగవు. యాంటీ బ్యాక్టీరియా మందులకు కూడా లొంగవు. వాటికోసం మరింత శక్తివంతమైన ఖరీదైన మందులు వాడాల్సి వస్తుంది. అవన్నీ కూడా శరీరానికి హాని కలిగిస్తాయి. ప్రస్తుతం ఐసీయూలో చేరుతున్న ప్రతి పది మంది రోగుల్లో నలుగురికి ఈ యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ ఉన్నట్టు గుర్తించారు వైద్యులు.

శక్తివంతమైన యాంటీ బయోటిక్ మందులను ఎక్కువ కాలం వాడితే కాలేయం, కిడ్నీ వంటి అవయవాలు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే వైద్యులకు సూచన మేరకే యాంటీబయోటిక్స్ వాడాలి. కానీ తెలుసు కదా అని నచ్చినట్టు యాంటీ బయోటిక్స్ మందులను మింగడం మంచి పద్ధతి కాదు. 

Also read: పిల్లలకు చదివింది గుర్తుండాలంటే వారి జ్ఞాపకశక్తిని పెంచే ఈ ఆహారాలు ఇవ్వండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rangareddy Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి వివరాలు.. ఒకేచోట పోస్టుమార్టం
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి వివరాలు.. ఒకేచోట పోస్టుమార్టం
Andhra Pradesh Loans: రుణఊబిలో ఆంధ్రప్రదేశ్ - ఏడాది అప్పుల టార్గెట్ పూర్తి - ఇక ముందు గడిచేదెలా?
రుణఊబిలో ఆంధ్రప్రదేశ్ - ఏడాది అప్పుల టార్గెట్ పూర్తి - ఇక ముందు గడిచేదెలా?
Ola కు గోవా రవాణా శాఖ షాక్‌ - సర్వీస్‌ సమస్యలతో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లకు అమ్మకాలు నిలిపివేత
Ola ఎలక్ట్రిక్‌కు ఝలక్‌ - స్కూటర్‌ అమ్మకాలు నిలిపివేత
Jogi Ramesh Remand: నకిలీ మద్యం కేసు- ఈ 13 వరకు మాజీ మంత్రి జోగి రమేష్‌కు రిమాండ్
నకిలీ మద్యం కేసు- ఈ 13 వరకు మాజీ మంత్రి జోగి రమేష్‌కు రిమాండ్
Advertisement

వీడియోలు

India ODI World Cup Winning Captain | ఇండియాను ప్రపంచ విజేతలుగా నిలిపిన కెప్టెన్లు
Women's ODI World Cup 2025 Winner India | టీమిండియా గెలుపులో వాళ్లిద్దరే హీరోలు | ABP Desam
World Cup 2025 Winner India | విశ్వవిజేత భారత్.. ప్రపంచకప్ విజేతగా టీమిండియా మహిళా టీమ్ | ABP Desam
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటోడ్రైవర్లుకు అన్యాయం జరుగుతోందా.. వాస్తవాలేంటి..!?
బాదుడే బాదుడు.. అమ్మాయిలూ మీరు సూపర్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangareddy Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి వివరాలు.. ఒకేచోట పోస్టుమార్టం
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి వివరాలు.. ఒకేచోట పోస్టుమార్టం
Andhra Pradesh Loans: రుణఊబిలో ఆంధ్రప్రదేశ్ - ఏడాది అప్పుల టార్గెట్ పూర్తి - ఇక ముందు గడిచేదెలా?
రుణఊబిలో ఆంధ్రప్రదేశ్ - ఏడాది అప్పుల టార్గెట్ పూర్తి - ఇక ముందు గడిచేదెలా?
Ola కు గోవా రవాణా శాఖ షాక్‌ - సర్వీస్‌ సమస్యలతో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లకు అమ్మకాలు నిలిపివేత
Ola ఎలక్ట్రిక్‌కు ఝలక్‌ - స్కూటర్‌ అమ్మకాలు నిలిపివేత
Jogi Ramesh Remand: నకిలీ మద్యం కేసు- ఈ 13 వరకు మాజీ మంత్రి జోగి రమేష్‌కు రిమాండ్
నకిలీ మద్యం కేసు- ఈ 13 వరకు మాజీ మంత్రి జోగి రమేష్‌కు రిమాండ్
Ramyakrishnan : వామ్మో... రమ్యకృష్ణను ఇలా ఎప్పుడైనా చూశారా? - RGV సినిమానా మజాకా!
వామ్మో... రమ్యకృష్ణను ఇలా ఎప్పుడైనా చూశారా? - RGV సినిమానా మజాకా!
Most sixes in single World Cup: సిక్సర్ల క్వీన్ రిచా ఘోష్.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ రికార్డును బద్దలు కొట్టి, వరల్డ్ నెంబర్ 1గా
సిక్సర్ల క్వీన్ రిచా ఘోష్.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ రికార్డును బద్దలు కొట్టి, వరల్డ్ నెంబర్ 1గా
Womens World Cup Winner: దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
KTR on Hydra Demolitions: ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
Embed widget