News
News
X

Diabetic Foot: డయాబెటిక్ ఫూట్‌తో నరకం - ముందుగా గుర్తించేందుకు ప్రత్యేక యాప్!

డయాబెటిక్ న్యూరోపతికి చికిత్స లేదు. కానీ దీన్ని అదుపులో ఉంచవచ్చు, పోస్ట్ పోన్ చెయ్యవచ్చు.

FOLLOW US: 
Share:

రోజుల్లో అత్యంత ఎక్కువగా కనిపిస్తున్న లైఫ్ స్టయిల్ సమస్య డయాబెటిస్. వయసుతో నిమిత్తం లేకుండా చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. షుగర్ అదుపులో లేకపోతే నాడులు, రక్తనాళాలు దెబ్బతింటాయి. ఇది డయాబెటిస్ పేషెంట్లలో దీర్ఘకాలంలో ఏర్పడే దుష్ప్రభావాలుగా చెప్పుకోవచ్చు. పాదాలు తిమ్మిరిగా ఉండడం, టింగ్లింగ్ ఫీలింగ్, స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలు నాడులు దెబ్బతిన్నపుడు కలుగుతాయి. దీనిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఇది క్రమేనా డయాబెటిక్ ఫూట్‌కు దారితీస్తుంది. 

డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలు

  • డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలు రాత్రిపూట ఎక్కువగా కనిపిస్తాయి. తరచుగా తీవ్రమవుతుంటాయి.
  • తిమ్మిరి లేదా నొప్పిగా అనిపించవచ్చు.
  • పాదాలు దురద పెడుతున్నట్లు ఉంటుంది.
  • ఒక్కోసారి పాదాల్లో మంటలు ఉంటాయి.
  • పాదాల్లో గుచ్చుకుంటున్నటువంటి నొప్పి కూడా ఉండొచ్చు.
  • పాదాలు విపరీతమైన సున్నితంగా తయారవుతాయి, కనీసం బెడ్ షీట్ బరువు కూడా భరించలేరు.

డయాబెటిక్ ఫూట్ తిరిగి మామూలవుతుందా?

డయాబెటిక్ న్యూరోపతికి చికిత్స లేదు. కానీ దీన్ని అదుపులో ఉంచవచ్చు, పోస్ట్ పోన్ చెయ్యవచ్చు. నాడీ వ్యవస్థలో కలిగే నొప్పి తీవ్రతను తగ్గించేందుకు మందులు వాడొచ్చు. అంత తీవ్రంగా లేని నరాల నొప్పికి ఎపిటమైనోఫిన్ లేదా ఇబుప్రొఫెన్ వంటి ఒవర్ ది కౌంటర్ మందులు కూడా తీసుకోవచ్చు.

పాదాల్లో రక్తనాళాలు, నాడులు దెబ్బతినడం వల్ల డయాబెటిక్స్ లో పాదాల ఆకృతిలో కూడా తేడా రావచ్చు. చార్కోట్ పాదం ఏర్పడవచ్చు. చార్కోట్ పాదంలో పాదాలు ఎర్రగా కందిపోవడం, కొద్దిగా వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత నెమ్మదిగా కాలివేళ్లలోని ఎముకల తీరులో మార్పు రావచ్చు.

పాదాలే ఎందుకు?

డయాబెటిస్ అదుపులో లేకపోవడం వల్ల రక్తంలో చేరిన గ్లూకోజ్ రక్తనాళాలను పాడు చేస్తుంది. పాదాలలోని రక్తనాళాలు ఎక్కువ ప్రభావానికిలోనవుతాయి. ఇందుకు కాళ్లకు రక్తాన్ని అందించే రక్తనాళాల చాలా పొడవైనవి. అందుకే ఎక్కువగా పాదాల్లో.. ముఖ్యంగా కాలి వేళ్ల చివరన ఈ లక్షణాలు కనిపిస్తాయి. 

డయాబెటిస్ ఫూట్‌పై అవగాహన కోసం ప్రత్యేక యాప్

చాలామందికి ఈ విషయాలపై అవగాహన తక్కువ. అందుకే చెన్నైలోని ఎం.వి.హాస్పిటల్ ఫర్ డయాబెటిస్, ప్రొ. ఎం.విశ్వనాథన్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ రాయపురం వాళ్లు డయాబెటీస్ అండ్ డయాబెటిక్ ఫూట్ గురించిన అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ పేరు MV DIABET. ఇది ప్లేస్టోర్ లో అందుబాటులో ఉంది. ఈ యాప్ గురించి చీఫ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ విజయ్ విశ్వనాథన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ యాప్ వాట్సాప్ నెంబర్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. దీని ద్వారా హాస్పిటల్ కు చెందిన ఒక మల్టీ డిసిప్లెనరీ టీమ్ అందుబాటులో ఉంటుంది. వీరు డయాబెటిస్, డయాబెటిక్ ఫూట్ గురించి ఎలాంటి అనుమానాలనైనా సరే నివృత్తి చేస్తారు’’ అని వివరించారు.

కొంత మంది డయాబెటిక్ పేషెంట్లలో కొన్ని నాడులు దెబ్బతింటాయి. దీనిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. అదే కాకుండా అదుపులో లేని డయాబెటిస్ వల్ల చిన్న చిన్న రక్తనాళలు దెబ్బతింటాయి. ఇవి ముఖ్యంగా పాదాలు, కాళ్లకు చెందిన నాడులకు రక్తాన్ని అందించేవి. అందువల్ల పేషెంట్ల పాదాల్లో స్పర్శ కొద్దిగా తగ్గుతుంది. కనుక నొప్పి ఎక్కువ తెలియదు. చిన్నచిన్న గాయాలు గుర్తించలేరు. ఈ గాయాలు ఇన్ఫెక్షన్ కు గురైతే ప్రమాదకర స్థితి ఏర్పడవచ్చు.

Also read: టాటూ వేయించుకోవాలనుకుంటున్నారా? ఈ భాగాల్లో మాత్రం వద్దు

Published at : 17 Feb 2023 06:20 AM (IST) Tags: Diabetes diabetic foot diabetic neuropathy

సంబంధిత కథనాలు

Healthy Fats: హెల్తీగా ఉండాలంటే ఈ మూడు కొవ్వులున్న ఆహారాలు తీసుకోవాల్సిందే

Healthy Fats: హెల్తీగా ఉండాలంటే ఈ మూడు కొవ్వులున్న ఆహారాలు తీసుకోవాల్సిందే

Egg Freezing: తల్లి కావడానికి ప్రియాంక చోప్రా పాటించిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్ధతి గురించి మీకు తెలుసా?

Egg Freezing: తల్లి కావడానికి ప్రియాంక చోప్రా పాటించిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్ధతి గురించి మీకు తెలుసా?

ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్‌- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ

ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్‌- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ

Heart Health: మీ గుండెని కాపాడుకోవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే

Heart Health: మీ గుండెని కాపాడుకోవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే

Summer Drinks: వేసవి తాపాన్ని తగ్గించి మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే

Summer Drinks: వేసవి తాపాన్ని తగ్గించి మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి