Palakura Pappu Recipe : నోరూరించే పాలకూర పప్పు రెసిపీ.. కుక్కర్లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
Tasty Palak Dal Recipe : పాలకూర పప్పు రుచిని ఆస్వాదించాలంటే దానిని కచ్చితంగా వెల్లుల్లితో తాలింపు వేయాల్సిందే. మరి దీనిని ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకుని తినవచ్చో తెలుసుకుందాం.

Andhra Style Spinach Dal Recipe : తెలుగు రాష్ట్రాల్లో పప్పు, అన్నం కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా పాలకూరతో చేసే పప్పు (Palakura Pappu Recipe) రుచితో పాటు పోషకాలు కూడా అందిస్తుంది. కాస్త పులుపు, కారం, వెల్లుల్లి తాలింపు కలిపి పాలకూర పప్పు చేస్తే రుచి అదిరిపోతుంది. మరి ఈ టేస్టీ పాలకూర పప్పును ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో.. టేస్టీగా రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
కందిపప్పు - 1 కప్పు
పాలకూర - 2 కట్టలు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 7
టమాటా - 1
చింతపండు - చిన్న నిమ్మకాయంత
పసుపు - పావు టీస్పూన్
కారం - అర టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నీరు - అవసరమైనంత
Also Read : ఈజీగా, టేస్టీగా రెడీ చేసుకోగలిగే పాలకూర వడలు.. రెసిపీ ఇదే
తాలింపు కోసం
నూనె - 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ఎండుమిర్చి - 2
వెల్లుల్లి రెబ్బలు - 5 నుంచి 6
మినపప్పు - అర టీస్పూన్
కరివేపాకు - కొద్దిగా
ఇంగువ - చిటికెడు
Also Read : టేస్టీ, హెల్తీ పాలకూర మోమోస్ రెసిపీ.. మైదా లేకుండా ఇంట్లో చేసేయండిలా
పాలకూర పప్పు తయారీ విధానం
ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి.. చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. కందిపప్పును కూడా రెండు, మూడు సార్లు నీటితో కడిగి నానబెట్టుకోవాలి. కందిపప్పు వండుకునే ముందు నానబెట్టుకుంటే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు. కాబట్టి ముందుగానే కందిపప్పు నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో కందిపప్పు, తరిగిన పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, పసుపు వేసి తగినంత నీరు పోయాలి.
కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెజర్ పూర్తిగా తగ్గిన తర్వాత కుక్కర్ తెరిచి పప్పును గరిటెతో బాగా మెదపాలి. అవసరమైతే కొద్దిగా వేడి నీరు పోసి పప్పును మీకు నచ్చిన చిక్కదనానికి తీసుకురావచ్చు. చింతపండును కొద్దిగా నీటిలో నానబెట్టి.. దాని రసం తీసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని పప్పులో వేసి, ఉప్పు, కారం కలపాలి. పప్పును మరో 5 నిమిషాలు మరిగించాలి. ఈ సమయంలో పులుపు, కారం ఉప్పును మీ రుచికి తగ్గట్లు అడ్జెస్ట్ చేసుకోవాలి.
Also Read : పప్పు ఉడికించేప్పుడు కుక్కర్ నుంచి నురుగు వస్తుందా? ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి
వెల్లుల్లి తాలింపుతోనే అసలైన రుచి
పప్పుకోసం తాలింపు వేయాలంటే.. చిన్న పాన్ తీసుకుని నూనె వేయాలి. దానిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి వెల్లుల్లి లేత బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ తాలింపును వేడి వేడి పాలకూర పప్పుపై పోసి బాగా కలపాలి. అంతే.. సువాసనతో కూడిన పాలకూర పప్పు రెడీ.
వేడి వేడి అన్నంలో పాలకూర పప్పు, కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే రుచి మరింత పెరుగుతుంది. అప్పడం, ఆవకాయ లేదా వడియాలతో తింటే భోజనం మరింత రుచిగా మారుతుంది. దీనిని రెగ్యులర్‌గా చేసుకుని తింటే శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు అందడమే కాకుండా.. కందిపప్పు నుంచి ప్రోటీన్ కూడా లభిస్తుంది. కాబట్టి హెల్తీ డైట్లో దీనిని భాగం చేసుకోవచ్చు.
Also Read : వెల్లుల్లి ఫ్లేవర్ లవర్స్‌కు స్పెషల్.. స్పైసీ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























