అన్వేషించండి

Kitchen Hacks : పప్పు ఉడికించేప్పుడు కుక్కర్ నుంచి నురుగు వస్తుందా? ఈ టిప్స్​తో చెక్ పెట్టేయండి

Pressure Cooker Foam : కుక్కర్ విజిల్ వేయగానే నురుగు బయటకు వస్తుందా? పప్పు, అన్నం వండేప్పుడు కుక్కర్ నుంచి నురుగు రాకుండా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయింపోండి.

Prevent Foaming in a Pressure Cooker : ప్రెజర్ కుక్కర్‌లో వంట చేస్తే సమయం ఆదా అవుతుంది. బిజీగా ఉండే రోజుల్లో ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా.. పదే పదే వంటకాన్ని చూడాల్సిన అవసరం కూడా లేకుండా చేస్తుంది. కానీ పప్పు, బీన్స్ లేదా బియ్యం ఉడికించేటప్పుడు.. కుక్కర్ విజిల్ వేసిన వెంటనే నురగ బయటకు వస్తుంది. ఈ పదార్ధాలలో ఉండే స్టార్చ్ కారణంగా ఇది జరుగుతుంది. దీని కారణంగా అవి ఉడికేప్పుడు నురుగు ఏర్పడుతుంది. దీనివల్ల అది మూత లేదా విజిల్ నుంచి బయటకు రావడం ప్రారంభిస్తుంది. ఇది స్టౌవ్, వంటగదిని మురికి చేస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

నురుగు ఎందుకు వస్తుందంటే..

వాస్తవానికి ఇది ఈ ఆహార పదార్థాలలో ఉన్న స్టార్చ్ కారణంగా జరుగుతుంది. ఉడికేటప్పుడు స్టార్చ్ నీటితో కలిసి నురుగును ఏర్పరుస్తుంది. ఇది ఆవిరి ఒత్తిడితో బయటకు రావడం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా పప్పు పెట్టినప్పుడు దాని నుంచి నురుగు, నీరు గ్యాస్‌ పడిపోతుంది. దీనివల్ల వంట చేయడం సులభమే అయినా క్లీనింగ్ ఎక్స్​ట్రా పనిగా మారుతుంది. ఈ సమస్య గురించి మీరు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన, ఇంటి చిట్కాలను ఫాలో అవుతూ.. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

కుక్కర్ నుంచి నురుగు రాకుండా ఎలా ఆపాలంటే

పప్పు, బీన్స్ లేదా బియ్యం ఉడికించేటప్పుడు నురుగు బయటకు రావడం సర్వసాధారణం. దీన్ని నివారించడానికి.. కొన్ని చిట్కాలు ఫాలో అవ్వవచ్చు.

  • నూనె లేదా నెయ్యి వేయాలి

కుక్కర్‌లో పప్పు లేదా ఇతర పదార్థాలను వేసిన తర్వాత ఒక స్పూన్ నూనె లేదా నెయ్యి కలపాలని గుర్తుంచుకోండి. ఇది నురుగు ఏర్పడే ప్రక్రియను విచ్ఛిన్నం చేస్తుంది. దీనివల్ల నురుగు బయటకు రాదు. అలాగే కుక్కర్‌ను ఎప్పుడూ అవసరమైన దానికంటే ఎక్కువ నీటితో నింపకూడదని గుర్తుంచుకోండి. ముఖ్యంగా పప్పు లేదా బీన్స్ ఉడికించేటప్పుడు.. కుక్కర్‌ను సగానికి మించి నింపవద్దు. దీనివల్ల ఉడికేప్పుడు పదార్థాలు వ్యాప్తి చెందడానికి తగినంత స్థలం ఉంటుంది.

  • స్టీల్ స్పూన్ ట్రిక్

నూనె లేదా నెయ్యి వేయకూడదనుకుంటే.. మరొక సులభమైన ట్రిక్ కూడా ఉంది. ఈ పద్ధతిని ఫుడ్ బ్లాగర్, కంటెంట్ క్రియేటర్ నీతికా నిగ్గా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుక్కర్‌ను మూసే ముందు.. ఒక శుభ్రమైన స్టీల్ స్పూన్‌ను లోపల ఉంచాలని ఆమె చెప్పారు. ఈ స్పూన్ మరిగేటప్పుడు ఏర్పడే బుడగలను విచ్ఛిన్నం చేస్తుంది. దీనివల్ల నురుగు నియంత్రణలో ఉంటుంది. విజిల్ లేదా మూత నుంచి నురుగు బయటకు రాకుండా ఉంటుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Neetika Ligga | Food, Lifestyle and Travel 🧿 (@food.naama)

ఈ సులభమైన మార్గాలను అనుసరించడం ద్వారా మీరు దాదాపు 90 శాతం వరకు నురుగు వచ్చే సమస్యను నివారించవచ్చు. ఇది వంటగదిని శుభ్రంగా ఉంచడమే కాకుండా.. వంటను మరింత సులభతరం చేస్తుంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget