Aliv Laddoo: మహిళలూ ఈ లడ్డూ రోజుకోకటి తిన్నారంటే మీ సమస్యలన్నీ దూరం
మహిళలు ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య రక్తహీనత, క్రమరహిత పీరియడ్స్. వీటి నుంచి బయట పడేందుకు ఈ చిన్న లడ్డూ తినేయండి చాలు.
గుండెని కాపాడటంతో ఆలివ్ ఆయిల్ ఎంతో మేలు చేస్తుంది. ఈ నూనె మాత్రమే కాదు ఆలివ్ విత్తనాలు తీసుకున్న అనేక ప్రయోజనాలు పొందుతారు. వీటిని గార్డెన్ క్రెస్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించే చిన్న చిన్న విత్తనాలు. బ్రౌన్ కలర్ లో కనిపించే ఈ సీడ్స్ ని హలీమ్ విత్తనాలని కూడా పిలుస్తారు. ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి, జీవక్రియ, రక్తహీనత, క్రమరహిత పీరియడ్స్, జుట్టు రాలడం, చర్మం చిట్లడం, ఇన్సులిన్ అసమతుల్యత వంటి ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడే పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి.
మహిళలు ఆలివ్ విత్తనాలు ఎందుకు తినాలి?
ఆలివ్ గింజల్లో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. గ్రెలిన్ అని పిలిచే ఆకలి హార్మోన్లను అణచివేసేందుకు సహాయపడతాయి. సంతృప్తిని కలిగిస్తాయి. ఈ విత్తనఆలౌ తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీవక్రియ, మలబద్ధకం సమస్యకి చికిత్సలో సహాయపడతాయి. ఆలివ్ విత్తనాలు తీసుకుంటే మహిళల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే ఇందులో గెలాక్టాగోగ్ అనే సమ్మేళనం ఉంది. ఇది పాలిచ్చే మహిళల్లో తల్లి పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఐరన్, ఫోలేట్ ఉండటం వల్ల ఐరన్ లోపం, రక్తహీనత చికిత్సకి సహాయపడుతుంది. శరీరానికి కావాల్సిన ఇనుము స్థాయిలను ఆలివ్ ఆయిల్ తీరుస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
ఆలివ్ లడ్డూలు
మహిళలు ప్రతిరోజు ఒక ఆలివ్ విత్తనాలతో చేసిన లడ్డూ తింటే మంచిది. రక్తహీనత సమస్య నుంచి బయట పడొచ్చు. ఈ లడ్డుని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
ఆలివ్ విత్తనాలు- ఒక కప్పు
తురిమిన కొబ్బరి- అరకప్పు
యాలకుల పొడి- అర టీ స్పూన్
బెల్లం పొడి- పావు టీ స్పూన్
బాదం రేకులు- జీడిపప్పు- అర కప్పు
తయారీ విధానం
ఆలివ్ విత్తనాలు నీటిలో బాగా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో నానబెట్టిన ఆలివ్ గింజలు, బెల్లం, కొబ్బరి వేసి బాగా కలపాలి. మీడియం మంట మీద వాటిని ఉడికించుకోవాలి. అందులో తరిగి పెట్టుకన్న జీడిపప్పు, బాదం వేసుకుని కలుపుకోవాలి. చల్లారిన తర్వాత లడ్డూలు మాదిరిగా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. అంతే చాలా సింపుల్ టేస్టీ గా ఉండే ఆలివ్ విత్తనాల లడ్డూలు రెడీ అయిపోయినట్టే. వీటిని ఒక గాలి చొరబడని కంటైనర్ లో పెట్టుకుని ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవచ్చు.
ఈ లడ్డూలు తినడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. వెంట్రుకలకు కావలసిన పోషణ అందిస్తుంది. పీరియడ్స్ సరిగా రాని మహిళలు వీటిని తింటే ఆ సమస్య నుంచి బయట పడతారు. ఇందులో అయోడిన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దరి చేరకుండా కాపాడుతుంది. క్యాన్సర్ కణాలని పోరాడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: వేసవిలో ఏయే మిల్లెట్స్ మంచివో తెలుసా? చిరుధాన్యాలు తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి