Viral: తలుపుకు గులాబీ రంగు వేయడమే పాపమైంది, లక్షల ఫైన్ కట్టాల్సి వచ్చింది
తలుపుకు నచ్చిన రంగు వేసుకోవచ్చు ఎవరైనా, కానీ అలా తనకు నచ్చిన రంగు వేయడమే పాపమైంది ఆ మహిళకు.
తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఇల్లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అలా వచ్చిన ఇంటిని మరింత అందంగా మార్చుకునేందుకు కిటికీలకు, తలుపులకు రంగులు వేయించింది ఓ మహిళ. అదే ఆమె చేసిన తప్పయింది. ఏకంగా 19 లక్షల రూపాయల జరిమానా కట్టాల్సి వచ్చింది. ఆమె పేరు మిరాండా డిక్సన్. ఎడిన్‌బర్గ్ లో ఆమెకు ఒక పాత ఇల్లు ఉంది. ఆ ఇల్లు ప్రధాన ద్వారానికి లేత గులాబీ రంగు వేయించింది. అయితే ఆ ఇల్లు ఎడిన్‌బర్గ్ న్యూ టౌన్‌కు చెందిన వరల్డ్ హెరిటేజ్ పరిరక్షణ ప్రాంతంలో ఉంది. అందువల్ల, ఆ ప్రాంతంలోని ఇళ్లలకు ఎలాంటి మార్పులు చేయాలన్నా వాటికి నియమాలు నిబంధనలు ఉన్నాయి. ఎడిన్‌బర్గ్‌లోని పాత, కొత్త పట్టణాలు 1995లో యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను పొందాయి. అందుకే ప్రజలు నచ్చినట్టు మార్పులు చేయడానికి లేవు.
మిరాండా తన తలుపుకు గులాబీరంగును వేయగానే ఎవరో ఎడిన్‌బర్గ్ సిటీ కౌన్సిల్ కలుగజేసుకుంది. ఆ తలుపుకు వేసిన రంగు "చారిత్రక స్వభావానికి అనుగుణంగా లేదని" తెలిపింది.అంతే కాదు ఆ రంగు వేసినందుకు ఫైన్ కూడా వేశారు. అక్షరాలా 20 వేల పౌండ్లు. అంటే మన రూపాయల్లో 19 లక్షల రూపాయలు. ఇంత ఫైన్ వేయడాన్ని చాలా దుష్టపూరితమని చెబుతున్నారు మిరాండా.
View this post on Instagram
ఆమె సోషల్ మీడియాలో జరిగిన విషయం గురించి తన బాధన చెప్పుకున్నారు చుట్టుపక్కల తలుపుల ఫోటోలను తీసి పోస్టు చేశారు. ఆ ఫోటోల్లో చాలా ఇళ్ల తలుపులు ప్రకాశవంతమైన రంగులతో ఉన్నాయి. అవి ఆ రంగుల్లో ఉండగా లేని సమస్య, తన ఇంటి తలుపుతోనే ఎందుకు వస్తోందిని అడిగుతోంది మిరాండా.
View this post on Instagram
ఆమె తన డోర్ రంగు మార్చకుండా కౌన్సిల్‌తో పోరాడుతోంది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులు కూడా ఆమెకు అందాయి. రంగు మార్చమని సూచించడంలో తప్పులేదు కానీ ఇంత మొత్తంలో ఫైన్ వేయడం మాత్రం అక్కడ అందరినీ ఆశ్చర్యపరిచింది.