SC Corporation Loans 2025 AP: వ్యాపారం మీది, పెట్టుబడి ప్రభుత్వానిది, ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలకు బంపర్ ఆఫర్
AP SC Corporation Loans 2025 :వ్యాపారం చేయాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. చేతిలో డబ్బు లేక వెనక్కి వెళ్లిపోతుంటారు. అలాంటి వారిని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.

SC Corporation Loans 2025 Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ప్రతి ఇంటికి వ్యాపారవేత్తలను సిద్ధం చేస్తానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వం ఆ దిశగా చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఆ హామీలో భాగంగా ప్రభుత్వం కొత్తగా ఓ స్కీమ్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఔత్సాహికులు సొంతగా వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా పది మందికి పని కల్పించేందుకు వీలు అవుతుంది.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కార్పొరేషన్ ద్వారా ఔత్సాహికులకు లోన్ ఇచ్చే స్కీమ్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో లోన్ తీసుకున్న వారంతా వ్యవసాయం, దాని అనుబంధ సంస్థలు, రవాణా, పరిశ్రమలు, సేవల రంగం, వ్యాపార రంగాల్లో నిలదొక్కుకునేలా ప్రయత్నాలు చేయవచ్చు. ఉపాధి పొందడమే కాకుండా తోటి వారికి కూడా పని కల్పించే అద్భుతమైన అవకాశానని ప్రభుత్వం కల్పిస్తోంది.
ప్రస్తుతానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మే పదో తేదీ వరకు అప్లై చేసుకోవడానికి గడువు ఇచ్చింది. ఇలా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొని 32 రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇందులో కొన్నింటికి మినిమం అర్హత పెట్టారు. మరికొన్నింటికి అసలు ఎలాంటి విద్యార్హత లేకుండానే అప్పులు ఇవ్వబోతున్నారు.
| వ్యాపారం పేరు | విద్యార్హత | |
| 1 ISB Sector | పూలబొకేల తయారీ | విద్యార్హత అవసరం లేదు |
| 2 | వర్మీకంపోస్టింగ్, సేంద్రియ ఎరువు | విద్యార్హత అవసరం లేదు |
| 3 | వెబ్‌సైట్ డెవలప్‌మెంట్& ఐటీ సేవలు | కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధిత రంగంలో ITI, డిప్లొమా లేదా దానికి సరిపడ అర్హత ఉండాలి |
| 4 | LED బల్బ్, విద్యుత్ పొదుపు పరికరాల అసెంబ్లింగ్ | ఐటీఐ, డిప్లొమా, లేదా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత ఐటీ రంగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. |
| 5 | ప్లంబింగ్ & ఎలక్ట్రీషియన్ సేవలు | ప్లంబింగ్, ఎలక్ట్రికల్ లేదా సంబంధిత విభాగంలో ITI/డిప్లొమా అర్హత ఉండాలి |
| 6 | వాటర్ బాటిల్ రీఫిల్ & ప్యూరిఫికేషన్ కియోస్క్ | కనీసం టెన్త్ క్లాస్ చదివి ఉండాలి. |
| 7 | వ్యర్థాల రీసైక్లింగ్ & అప్‌సైక్లింగ్ వ్యాపారం | విద్యార్హత అవసరం లేదు |
| 8 | మొబైల్ రిపేరింగ్ & ఎలక్ట్రానిక్ సర్వీసెస్ | ఐటిఐ/డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్/మెకానికల్ |
| 9 | సబ్బు, డిటర్జెంట్ & తయారీ | విద్యార్హత అవసరం లేదు |
| 10 | చేపల పెంపకం (ఆక్వాకల్చర్) | విద్యార్హత అవసరం లేదు |
| 11 | అడ్వేంచర్ టూరిజం (ట్రెక్కింగ్ & క్యాంపింగ్) | డిగ్రీ అర్హత ఉండాలి. |
| 12 | మొబైల్ కార్ వాష్ & సర్వీస్ | ఐటీఐ/డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్/మెకానికల్ |
| 13 | బేకరీ & మిఠాయి యూనిట్ | విద్యార్హత అవసరం లేదు |
| 14 | ఇటుక బట్టీ & ఫ్లై యాష్ ఇటుక ఉత్పత్తి | విద్యార్హత అవసరం లేదు |
| 15 | సెరికల్చర్ (పట్టు ఉత్పత్తి) | విద్యార్హత అవసరం లేదు |
| 16 | నీటి శుద్దీకరణ & RO ప్లాంట్ ఏర్పాటు | ఐటీఐ/డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్/మెకానికల్ లేదా సంబంధిత |
| 17 | వెల్డింగ్ & ఫ్యాబ్రికేషన్ యూనిట్ | ఐటీఐ/డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్/మెకానికల్ లేదా సంబంధిత |
| 18 | జూట్ బ్యాగ్ & పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీ | విద్యార్హత అవసరం లేదు |
| 19 | సోలార్ ఎనర్జీ ఉత్పత్తుల అమ్మకాలు & ఇన్‌స్టాలేషన్ | ఐటీఐ/డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్/మెకానికల్ లేదా సంబంధిత అర్హత ఉండాలి |
| 20 | సోలార్ ప్యానెల్ అసెంబ్లింగ్ & ఇన్‌స్టాలేషన్ | ఐటీఐ/డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్/మెకానికల్ లేదా సంబంధిత అర్హత ఉండాలి |
| 21 | కొబ్బరి పీచు ఉత్పత్తుల తయారీ | విద్యార్హత అవసరం లేదు |
| 22 | ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ స్టూడియో | కనీసం పదో తరగతి చదివి ఉండాలి. |
| 23 | ఆయుర్వేద క్లినిక్ & హెర్బల్ మెడిసిన్ స్టోర్ | BAMS డిగ్రీ లేదా లైసెన్స్ పొందిన ఆయుర్వేద వైద్యుడు |
| 24 | జనరిక్ మెడికల్ షాప్ | డి.ఫార్మ్ లేదా బి.ఫార్మ్ (రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్) |
| 25 | బ్యూటీ పార్లర్ | బ్యూటీషియన్ కోర్సులో కనీసం 10వ తరగతి/సర్టిఫికేషన్లు |
| 26 | మెడికల్ ల్యాబ్ | మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ (DMLT / BMLT / MLT) |
| 27 | EV బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ | ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో ITI/డిప్లొమా, లేదా EV నిర్వహణ, బ్యాటరీ నిర్వహణ లేదా విద్యుత్ భద్రతలో సర్టిఫికేషన్ ఉండాలి. |
| 28 ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ | ప్యాసింజర్ ఆటో (3 వీలర్-(ఇ-ఆటో)) | లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్ |
| 29 | ప్యాసింజర్ ఆటో (4 వీలర్) | కమర్షియల్ లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్ |
| 30 | ప్యాసింజర్ కార్లు (4 వీలర్) | ట్రాన్స్‌పోర్ట్/కమర్షియల్ LMV డ్రైవింగ్ లైసెన్స్ |
| 31 | గూడ్స్ ట్రక్ లైట్ మోటార్ వెహికల్ (LMV) | కమర్షియల్ ఎండార్స్‌మెంట్‌తో డ్రైవింగ్ లైసెన్స్, లేదా కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ (CDL) |
| 32(వ్యవసాయ రంగం) | వ్యవసాయ ప్రయోజనాల కోసం డ్రోన్‌లు (గ్రూప్ యాక్టివిటీ) | DGCA-ఆమోదిత సంస్థ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా డ్రోన్ టెక్నాలజీలో ITI/డిప్లొమా లేదా డ్రోన్ ఆపరేషన్‌లో సంబంధిత నైపుణ్య ధృవపత్రాలు |
ఈ స్కీమ్ పొందాలంటే అర్హతలు ఏంటీ?
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చే లోన్ పొందాలంటే లబ్ధిదారుడు ఏదైనా SC కమ్యూనిటీకి చెందినవారై ఉండాలి. కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. ఏపీకి చెందిన వ్యక్తులే ఈ స్కీమ్‌కు అర్హులు. లబ్ధిదారుడి వయస్సు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. లబ్ధిదారుడు దారిద్య్రరేఖకు దిగువన (BPL) వర్గంలో ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
మొదటి లబ్ధిదారుడు https://apobmms.apcfss.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రాథమిక వివరాలు నమోదు చేయాలి. అనంతరం యూజర్ ఐడి & పాస్‌వర్డ్ వస్తుంది. యూజర్ ఐడి అంటే రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నంబర్. పాస్‌వర్డ్ అంటే ఆ నెంబర్‌కు వచ్చే OTP దీని ఆధారంగా లాగిన్ అవ్వాలి. అనంతరం రెండో దశలో లబ్ధిదారుడు తన దరఖాస్తు పూర్తి చేయడానికి అడ్రెస్, కులం, విద్యార్హతలు, పథకం వివరాలు పూర్తి చేసి స్కీమ్‌లోకి లాగిన్ అవ్వాలి. అప్లై చేసిన తర్వాత దరఖాస్తుదారుడు అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.
ఎవరికి ఎంత రాయితీ ఇస్తారు?
ఎస్సీ కార్పొరేషన్ మూడు విభాగాల్లో రుణాలు ఇస్తుంది. మొదటి విభాగంలో ఉన్న వారికి రూ.3 లక్షలలోపు పెట్టుబడి వ్యయం యూనిట్లు అందజేస్తారు. రెండో విభాగంలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలలోపు వారికి పెట్టుబడి సాయం అందజేస్తారు. మూడో జాబితాలో రూ. పది లక్షలపైన ఆర్థిక సాయం చేస్తారు.
మొదటి కేటగిరిలో లబ్ధిదారులకు ప్రభుత్వం 60 శాతం సాయం చేస్తుంది. బ్యాంకులు 35 శాతం రుణం ఇస్తాయి. ఐదు శాతం లబ్ధిదారులు వాటా పెట్టుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా ఈ కేటగిరిలో లక్ష రూపాయల వరకు సబ్సిడీ పొందవచ్చును.
రెండో కేటగరిలో ప్రభుత్వం నుంచి 40 శాతం సాయం అందనుంది. బ్యాంకులు 55 శాతం వరకు రుణాలు ఇస్తాయి. మిగిలిన ఐదు శాతం లబ్ధిదారులు పెట్టుబడి పెట్టుకోవాలి. ఈ కేటగిరిలో ఇచ్చే రాయితీలు ఇతర ఫెసిలిటీసే మూడో కేటగిరికి కూడా వర్తిస్తాయి.





















