
VCBL BANK PO: విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్‌లో పీవో పోస్టులు, వివరాలు ఇలా!
ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నవంబరు 14 నుంచి డిసెంబరు 14 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది. దీనిద్వారా మొత్తం 30 పీవో/ డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నవంబరు 14 నుంచి డిసెంబరు 14 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు విడతల రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు...
* ప్రొబేషనరీ ఆఫీసర్లు/ డిప్యూటీ మేనేజర్
ఖాళీల సంఖ్య: 30 పోస్టులు
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.10.2022 నాటికి 20-32 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్)/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ..37,000/చెల్లిస్తారు.
పరీక్ష విధానం:
* ప్రిలిమినరీ పరీక్ష - మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జనరల్ ఇంగ్లిష్ నుంచి 30 ప్రశ్నలు-30 మార్కులు, డేటా అనాలసిస్ నుంచి 35 ప్రశ్నలు-35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ-కంప్యూటర్ ఆప్టిట్యూడ్-జనరల్ బ్యాంకింగ్ నుంచి 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. ఒక్కో విభాగానికి 30 నిమిషాల సమయం కేటాయిస్తారు.
* మెయిన్ పరీక్ష - మెయిన్ పరీక్షను రెండు పార్టులుగా నిర్వహిస్తారు. మొదటి పార్ట్ ఆన్‌లైన్ పరీక్ష, రెండో పార్ట్ డిస్క్రిప్టివ్ పరీక్ష. మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఇంగ్లిష్ నుంచి 35 ప్రశ్నలు-40 మార్కులు, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 30 ప్రశ్నలు-50 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ-కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్/ ఎకనమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి నాలుగోవంతు మార్కులు కోత విధిస్తారు.
* ఇక మెయిన్ పరీక్షలో భాగంగా నిర్వహించే డిస్క్రిప్టివ్ పేపర్‌లో 3 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వీటిలో ఒకటి లెటర్ రైటింగ్, ఎస్సే, ప్రెసిస్ రైటింగ్.
* మెయిన్ పరీక్షలో అర్హత సాధించినవారికి 50 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తదనంతరం తుది ఎంపిక ఫలితాలను ప్రకటిస్తారు.
పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి.
ముఖ్యమైన తేదీలు...
⇸ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.11.2022. (10 AM)
⇸ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 14.12.2022. (4 PM)
⇸ ఆన్‌లైన్ పరీక్ష తేది: జనవరి/ ఫిబ్రవరి, 2023.
Also Read:
BANK Jobs: రెప్కో బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అర్హతలివే!
చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న 'రెప్కో' బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హతతోపాటు స్థానిక భాషపై అవగాహన ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి నవంబరు 5న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 25 వరకు కొనసాగనుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
పంజాబ్ సింధ్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, విభాగాలవారీగా ఖాళీలివే!
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి నవంబరు 5న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హతతోపాటు తగినంత అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నవంబరు 20 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ హౌసింగ్ బ్యాంకులో ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్, రెగ్యులర్ విధానంలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్‌హెచ్‌బీలో ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. నవంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

