Bank Jobs: పంజాబ్ సింధ్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, విభాగాలవారీగా ఖాళీలివే!
సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హతతోపాటు తగినంత అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నవంబరు 20 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోచ్చు.
ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి నవంబరు 5న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హతతోపాటు తగినంత అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నవంబరు 20 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ ఆఫీసర్ ఆర్కిటెక్ట్, ఫస్ట్ సేఫ్టీ ఆఫీసర్స్, ఫారెక్స్ ఆఫీసర్స్, ఫారెక్స్ డీలర్ మార్కెటింగ్ ఆఫీసర్స్, రిలేషన్‌షిప్ మేనేజర్స్, డాటాఎంట్రీ అనాలిసిస్, ట్రెజరీ డీలర్స్ వంటి పోస్టులను భర్తీచేస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులు నేటినుంచి ప్రారంభమయ్యాయి.
వివరాలు..
* మొత్తం పోస్టులు: 50
1) మార్కెటింగ్ ఆఫీసర్: 25
2) ఫారెక్స్ ఆఫీసర్: 13
3) ఫారెక్స్ ఆఫీసర్: 03
4) టెక్నికల్ ఆఫీసర్ ఆర్కిటెక్ట్: 02
5) ఫారెక్స్ డీలర్: 02
6) డేటా అనలిస్ట్: 02
7) ట్రెజరీ డీలర్: 02
8) ఫస్ట్ సేఫ్టీ ఆఫీసర్: 01
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. పోస్టులను అనుసరించి ఆయా విభాగాల్లో కనీసం 3 - 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 25- 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది. 1984 అల్లర్లలో బాధిత కుటుంబాలకు చెందినవారికి 5 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: టెక్నికల్ ఆఫీసర్ ఆర్కిటెక్ట్, ఫస్ట్ సేఫ్టీ ఆఫీసర్, ఫారెక్స్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు రాతపరీక్ష, ఫారెక్స్ డీలర్, డాటాఎంట్రీ అనలిస్ట్, ట్రెజరీ డీలర్ పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.1003, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.177
ముఖ్యమైన తేదీలు..
➨ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.11.2022.
➨ ఆన్‌లైన్ దరఖాస్తుకు, దరఖాస్తుల సవరణకు చివరితేది: 20.11.2022.
➨ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 05.12.2022.
➨ ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు తేదీలు: 05.11.2022 - 20.11.2022.
:: Also Read ::
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వెల్లడి, 710 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రారంభం!
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XII) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండుదశల రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 1 నుంచి నవంబరు 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ హౌసింగ్ బ్యాంకులో ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్, రెగ్యులర్ విధానంలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్‌హెచ్‌బీలో ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. నవంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..