VSSC Recruitment: విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో జేఆర్‌ఎఫ్ పోస్టులు
జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్) పోస్టులునెలకు రూ.31,000 జీతంఆగస్టు 8 దరఖాస్తుకు చివరితేది
ఇస్రో పరిధిలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్, తిరువనంతపురం జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీతోపాటు నెట్, గేట్, జెస్ట్ లాంటి ఏదేని ఒక అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
వివరాలు...
* జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్) పోస్టులు
మొత్తం ఖాళీలు: 17
అర్హత: 65 శాతం మార్కులు లేదా 6.84 సీజీపీఏ/సీపీఐ గ్రేడింగ్ స్కోరుతో ఎంఎస్సీ డిగ్రీ ఫిజిక్స్/అప్లైడ్ ఫిజిక్స్/ ఇంజినీరింగ్ ఫిజిక్స్/స్పేస్ ఫిజిక్స్/అట్మాస్పెరిక్ సైన్స్/మెటియోరాలజీ/ప్లానెటరీ సైన్సెస్ ఉత్తీర్ణులై ఉండాలి.
(లేదా)
* 60 శాతం మార్కులు లేదా 6.5 సీజీపీఏ/సీపీఐ గ్రేడింగ్ స్కోరుతో ఎంఈ/ఎంఎస్/ఎంటెక్ (అట్మాస్పెరిక్ సైన్స్/స్పేస్ సైన్స్/ప్లానెటరీ సైన్స్/అప్లైడ్ ఫిజిక్స్/ఇంజినీరింగ్ ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
* సీఎస్ఐఆర్-యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, నెట్-లెక్చరర్‌షిప్ (లేదా) గేట్ (లేదా) జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్) అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 08.08.2022 నాటికి 28 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు అలాగే వికలాంగులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం:
* ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు. ప్రాథమిక దశలో అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూలకు ఎంపికచేస్తారు.
* తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్‌లోనే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపిస్తారు.
* ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత తుది ఎంపిక ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
* ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంటుంది. వీటితోపాటు అభ్యర్థి ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లయితే ఉద్యోగ అనుభవానికి సంబంధించిన సర్టిఫికేట్, వయసుకు సంబంధించిన సర్టిఫికేట్ సమర్పించాలి.
* అలాగే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ, పబ్లిక్ సెక్టర్, సంబంధిత విభాగాల్లో పనిచేస్తున్న అభ్యర్థులు సంబంధిత సంస్థ నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC)’ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విధిగా దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు ఫెలోషిప్ అందుబాటులో ఉంటుంది. తర్వాత ప్రతిభ ఆధారంగా తర్వాత 5 సంవత్సరాలపాటు కొనసాగిస్తారు. ప్రతిఏడాది అభ్యర్థుల ప్రతిభ మూల్యాంకనం ఉంటుంది. దాని ఆధారంగానే కొనసాగింపు ఆధారపడి ఉంటుంది. జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కింద నెలకు రూ.31,000, రెండేళ్ల తర్వాత సీనియర్ రిసెర్చ్‌ఫెలో హోదాలో నెలకు రూ.35,000 అందజేస్తారు. వీటితోపాటు ఇతర భత్యాలు కూడా అందుతాయి.
ముఖ్యమైన తేదీలు...
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.07.2022.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 08.08.2022.