అన్వేషించండి

NDA And NA(1)- 2024 Results: యూపీఎస్సీ ఎన్టీఏ, ఎన్‌ఏ (1) - 2024 పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

UPSC: నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ రాతపరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 9న విడుదలచేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.

UPSC NDA Results 2024: (UPSC NDA & NA (1) - 2024): నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ రాతపరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 9న విడుదలచేసింది. ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్డీఏ రాతపరీక్షకు హాజరైన అభ్యర్ధులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో అభ్యర్థుల రూల్‌ నెంబర్ల ఆధారంగా ఈ ఫలితాలను విడుదల చేసింది.  పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నియామక ప్రక్రియలో తర్వాత దశలో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ పూర్తయిన 15 రోజుల తర్వాత తుది ఎంపిక ఫలితాలను విడుదల చేస్తారు. రాతపరీక్షలో షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులందరూ NDA (1)-2024 ఫలితాలు ప్రకటించిన రెండు వారాలలోపు ఇంటర్వ్యూ రౌండ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ ఆర్మీ రిక్రూటింగ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను సంబంధిత సర్వీస్ సెలక్షన్ బోర్డులకు సమర్పించాల్సి ఉంటుంది. వయసు ధృవీకరణ సర్టిఫికేట్ (ఏజ్‌ ప్రూఫ్‌), విద్యా అర్హత సర్టిఫికెట్లను సమర్పించాలి. 

UPSC NDA 2024 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..

➥ ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చెయ్యాలి.- https://www.upsc.gov.in 

➥ హోమ్‌పేజ్‌లో కనిపించే రాత పరీక్ష ఫలితాలపై క్లిక్ చెయ్యాలి. కొత్త పేజ్‌ ఓపెన్‌ అవుతుంది.

➥ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ -I 2024 ఫలితాలకు సంబంధించిన లింక్‌పై క్లిక్ చెయ్యాలి.

➥ ఎన్డీఏ-1 2024 ఫలితాలు పీడీఎఫ్‌ రూపంలో కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

➥ మీ పేరును చెక్‌ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్/ రోల్ నంబర్‌తో చెక్ చేసుకోవాలి.

➥ తర్వాత ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

NDA & NA (1)- 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) & నేవల్ అకాడమీ (NA) ఎగ్జామినేషన్ (I)- 2024 నోటిఫికేషన్ గతేడాది డిసెంబరు 20న విడుదలైన సంగతి తెలిసిందే.ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రథమార్దానికి 2024, ఏప్రిల్ 21న రాతపరీక్ష నిర్వహించారు. శిక్షణ‌తోపాటు త్రివిధ ద‌ళాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది మంచి అవకాశం. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు డిసెంబరు 20 నుంచి, జనవరి 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా త్రివిధ దళాల్లో 2025, జనవరి 2 నుంచి నుంచి ప్రారంభమయ్యే 153వ కోర్సులో, ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) 115వ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు శిక్షణ అనంతరం ఉద్యోగాల్లో నియమిస్తారు. 

సందేహాలుంటే సంప్రదించవచ్చు..
➥అభ్యర్థులకు ధ్రవపత్రాల పరిశీలన, విద్యార్హతలు తదితర విషయాల్లో ఏమైనా సందేహాలుంటే  011-23385271/011- 23381125/011-23098543 ఫోన్  నెంబర్లలో ఉదయం 10.00 గంటల నుంచి  సాయంత్రం 5.00 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించవచ్చు. 

➥ అలాగే ఇంటర్వ్యూకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 011-26175473, 011-23010097 నెంబర్లు లేదా joinindianarmy.nic.in for Army, Emai: officer-navy@nic.in ద్వారా సంప్రదించవచ్చు. 

➥ అదేవిధంగా నేవీ/నేవల్ అకాడమీకి సంబంధించిన సమస్యలపై  011-010231 Extn.7645/7646/7610 ఫోన్ నెంబర్లు లేదా joinindiannavy.gov.in  లేదా www.careerindianairforce.cdac.in ద్వారా సంప్రదించవచ్చు.

ఇంటర్వ్యూ విధానం..
రాతపరీక్షలో ఎంపికైనవారికి ఇంటర్వ్యూ/ఎస్‌ఎస్‌బీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 900 మార్కులు కేటాయించారు. రాతపరీక్షలో అర్హత సాధించినవారికి ఇంటెలిజెన్స్ & పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్ర్కిప్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్ తదితర టాస్కులు నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.

శిక్షణ: తుది అర్హత సాధించిన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పుణెలో చదువు, శిక్షణ పొందుతారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్‌లోని ఇండియ‌న్ మిలిటరీ అకాడమీకి; నేవల్ క్యాడెట్లను ఎజిమల‌లోని ఇండియ‌న్ నేవ‌ల్ అకాడమీకి; ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభం అవుతుంది.

NDA & NA (1) - 2024 నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Vidudala OTT: డిసెంబర్ 20న విజయ్ సేతుపతి ‘విడుదల 2’... ఓటీటీలో ఫ్రీగా ప్రీక్వెల్ చూసేయండి - ఎందులోనో తెలుసా?
డిసెంబర్ 20న విజయ్ సేతుపతి ‘విడుదల 2’... ఓటీటీలో ఫ్రీగా ప్రీక్వెల్ చూసేయండి - ఎందులోనో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Embed widget