(Source: ECI/ABP News/ABP Majha)
UPSC APP: ఒక్క క్లిక్‌తో పూర్తి సమాచారం! అందుబాటులోకి యూపీఎస్సీ మొబైల్ యాప్!
గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా అప్లికేషన్ ఫారాలను నింపడానికి ఈ యాప్ ఉపయోగపడదు.. కానీ, ఆండ్రాయిడ్ యాప్ లింకు ద్వారా అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఉద్యోగార్థుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సరికొత్త మార్గాల్లో పయనిస్తుంది. ఇటీవలే అభ్యర్థుల సౌకార్యర్థం వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మొబైల్ అప్లికేషన్‌ను కూడా వినియోగంలోకి తెచ్చింది. సెప్టెంబరు 29న ఈ యాప్‌ను ప్రారంభించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. పరీక్షలు, నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులు ఒక్క క్లిక్‌తో సులభంగా తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. మొబైల్ ద్వారా అప్లికేషన్ ఫారాలను నింపడానికి ఈ యాప్ ఉపయోగపడదు.. కానీ, ఆండ్రాయిడ్ యాప్ లింకు ద్వారా అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకొనే సౌలభ్యం ఉంటుంది.
Link: https://play.google.com/store/apps/details?id=com.upsc.upsc
ఇప్పటికే ఓటీఆర్ అందుబాటులోకి...
యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే, అభ్యర్థులు ఇకపై ప్రతిసారి తమ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల సౌకర్యార్థం వన్‌టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) విధానాన్ని యూపీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటీఆర్ వేదికపై ఒకసారి వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలు రిజస్ట్రేషన్ చేసుకుంటే చాలు. వేర్వేరు పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఓటీఆర్ నంబర్ తెలియజేస్తే సరిపోతుంది. వారి వివరాలన్నీ దరఖాస్తు పత్రంలో ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల అభ్యర్థులకు సమయం ఆదా కావడంతోపాటు దరఖాస్తుల ప్రక్రియ మరింత సులభతరంగా మారుతుంది. దరఖాస్తుల్లో పొరపాట్లకు అవకాశం ఉండదు ఓటీఆర్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థుల సమాచారం యూపీఎస్సీ సర్వర్లలో భద్రంగా ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు పత్రంలో ఈ ఓటీఆర్ నంబర్ నమోదు చేస్తే 70 శాతం దరఖాస్తును పూర్తిచేసినట్లే. యూపీఎస్సీ నిర్వహించే అన్నిపరీక్షలకు ఓటీఆర్ ఉపయోగపడుతుంది. https://www.upsc.gov.in/ లేదా https://upsconline.nic.in/ వెబ్‌సైట్ల ద్వారా ఎప్పుడైనా సరే ఓటీఆర్‌లో అభ్యర్థులు వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
UPSC Notification: 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2023' నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టులెన్నో తెలుసా?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 11లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష, జూన్ 24, 25 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
UPSC: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..