అన్వేషించండి

UPSC CMS 2025: యూపీఎస్సీ సీఎంఎస్-2025 నోటిఫికేషన్ విడుదల, వివిధ విభాగాల్లో 705 పోస్టుల భర్తీ

కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2025 నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు మార్చి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2025 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 705 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలకు కలిగి ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు మార్చి 11 సాయంత్రం 6 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. యూపీఎస్సీ సీఎంఎస్ పరీక్ష జులై 20న దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో నిర్వహించనున్నారు.

వివరాలు..

* యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2025

ఖాళీల సంఖ్య: 705 పోస్టులు 

కేటగిరీ-I..

మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్: 226 పోస్టులు

విభాగం: జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సబ్-క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీస్

కేటగిరీ-II..

1) అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్: 450 పోస్టులు

విభాగం: రైల్వే.

2) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 09 పోస్టు 

విభాగం: న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్.

3) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (గ్రేడ్-2): 20

విభాగం: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.

విద్యార్హత: అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 01.08.2025 నాటికి అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలకు మించకూడదు. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సబ్-క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీస్ పోస్టులకు 35 సంవత్సరాలకు మించకూడదు

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రుసుం రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

పరీక్ష విధానం..

✪ పార్ట్-1లో భాగంగా మొత్తం 500 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరకు 250 మార్కులు. ఒక్కో పేపరులో 120 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.

✪ పేపర్-1లో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ గురించి, పేపర్-2లో సర్జరీ, గైనకాలజీ & అబ్‌స్ట్రేట్రిక్స్, ప్రివెంటివ్ & సోషల్ మెడిసిన్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

✪ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల చొప్పున కోత విధిస్తారు.

✪ పార్ట్-1లో భాగంగా 100 మార్కులకు పర్సనాలిటీ పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్షా కేంద్రాలు: అగర్తలా, అహ్మదాబాద్, ఐజ్వాల్, బరేలీ, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, డెహ్రాడూన్, ఢిల్లీ, ధార్వాడ్, డిస్‌పూర్, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, ఇంఫాల్, ఇటానగర్, జైపూర్, జమ్ము, జోర్హాట్, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, మధురై, ముంబయి, నాగ్‌పూర్, పనాజీ (గోవా), పాట్నా, పోర్ట్ బ్లెయిర్, ప్రయాగ్రాజ్, (అలహాబాద్) రాయ్పూర్, రాంచీ, సంబల్పూర్, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం, తిరుపతి, ఉదయపూర్, విశాఖపట్నం.  

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.03.2025. 

➥ సీఎంఎస్ పరీక్ష తేది: 20.07.2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
APPSC Group 2 Jobs: 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Revanth Reddy Love Story: ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
Bigg Boss Season 10 Today November 20th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డైరెక్ట్ 13వ వారంలోకి కెప్టెన్ అమన్ మసూద్! ముకేశ్‌ చేష్టలకు ఫాలోవర్స్ అసహనం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డైరెక్ట్ 13వ వారంలోకి కెప్టెన్ అమన్ మసూద్! ముకేశ్‌ చేష్టలకు ఫాలోవర్స్ అసహనం!
Embed widget