అన్వేషించండి

Civils Toppers: ఇష్టం పెంచుకుంటే, కష్టమేమీ కాదు - సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో టాపర్ల వాయిస్

Civils Results: ఇష్టంతో చదివితే విజయకేతనం ఎగురేయొచ్చని నిరూపించారు.. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో జాతీయస్థాయిలో టాప్ ర్యాంకులతో సత్తా చాటారు.

UPSC Civils Final Results: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ - 2023 తుది ఫలితాలను (UPSC Main Results) యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తుది ఫలితాల ద్వారా మొత్తం 1,016 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో జనరల్ - 347, ఈడబ్ల్యూఎస్ - 115, ఓబీసీ - 303, ఎస్సీ - 165, ఎస్టీ - 86 మంది అభ్యర్థులు ఉన్నారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను యూపీఎస్సీ ప్రకటించింది. ఆదిత్య శ్రీవాత్సవ ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. అనిమేష్ ప్రధాన్ రెండో ర్యాంకు, దోనూరి అనన్య రెడ్డి మూడో ర్యాంక్ సాధించారు. టాప్‌ 25 ర్యాంకర్లలో 10 మంది మహిళలు కాగా 15 మంది పురుషులు ఉన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి ఈ సారి 50పైగా అభ్యర్థులు సివిల్స్‌కు ఎంపిక కావడం పట్ల సీఎం ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరు బిడ్డ దోనూరి అనన్యరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ సైతం సివిల్స్ విజేతలకు అభినందలను తెలిపారు.

ఉద్యోగం వదిలి.. టాప్ ర్యాంకర్‌గా నిలిచి..
సివిల్స్‌ ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ మొదటి ర్యాంకు సాధించారు. ఆదిత్య శ్రీనివాస్తవ మెయిన్స్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ను తన ఆప్షన్‌గా ఎంచుకున్నారు. ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ (బీటెక్‌), ఎంటెక్‌ పూర్తి చేశారు. ఆయన తండ్రి అజయ్‌ శ్రీవాస్తవ కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)లో అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. చిన్ననాటి నుంచి చదువుల్లో ముందుండే ఆదిత్య ఇంటర్‌లో 95 శాతం మార్కులు సాధించారు. 2019లో ఆయన బెంగళూరులోని గోల్డ్‌మెన్‌ శాక్స్‌లో ఉద్యోగం సాధించారు. 15 నెలలపాటు కార్పొరెట్‌ విధులు నిర్వర్తించి, లక్షల్లో వేతనం అందుకున్న తర్వాత ఆయన సివిల్స్‌పై ఆసక్తితో ఉద్యోగాన్ని వదులుకొని ఇటు వైపు అడుగులు వేశారు. 2022లోనూ ఆయన సివిల్స్‌లో 236వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. చదువు పూర్తయ్యాక ఆర్థిక భద్రత సాధించాలనే ఆలోచనతో కార్పొరేట్‌ ఉద్యోగంలో చేరానని, అయితే డబ్బు మాత్రమే అంతిమ ప్రేరణ కాదని గ్రహించి సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఆదిత్య తన మాక్‌ ఇంటర్వ్యూలో తెలిపారు. అట్టడుగు స్థాయిలో ప్రభావం చూపడానికి, వ్యవస్థకు తనవంతు సహకారాన్ని అందించడానికి ఇది ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.

బాధను దిగమింగి.. ‘సివిల్స్‌’లో రెండో ర్యాంకు..
యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచాడు. అదీ తొలి ప్రయత్నంలోనే. ఒడిశాకు చెందిన 24 ఏళ్ల అనిమేశ్ ప్రధాన్ అనుగుల్ జిల్లాలోని తాల్‌చేర్‌కు చెందిన అనిమేశ్.. కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నారు. అనిమేశ్‌ ప్రధాన్ ఐఐటీ రూర్కెలాలో కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ అభ్యసించారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీస్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. 2022లో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించారు.  సివిల్స్‌ మెయిన్స్‌లో ఆప్షనల్‌గా సోషియాలజీని ఎంచుకున్నారు. రోజుకు 5- 6 గంటల పాటు చదివా. పరీక్ష కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదని తెలిపారు. సివిల్స్ ఫలితం విషయంలో చాలా సంతృప్తిగా ఉందని, కల నెరవేరిందని ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్ చదువుతున్నప్పుడు తొమ్మిదేళ్ల క్రితం తండ్రి మృతి చెందాడు.. సరిగ్గా ఇంటర్వ్యూ సమయంలో.. క్యాన్సర్‌తో పోరాడుతూ ఇటీవలే తల్లి ప్రాణాలు కోల్పోయింది. అంతటి విషాదకర పరిస్థితుల్లోనూ బాధను దిగమింగి.. లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాడు. విజయం సాధించారు. 

సొంత ప్రిపరేషన్‌తో మూడో ర్యాంకు..
యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల్లో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన దోనూరు అన‌న్య రెడ్డి అసాధారణ ప్రతిభతో తొలి ప్రయ‌త్నంలోనే సివిల్స్‌లో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు కైవసం చేసుకుంది. దీంతో ఆమెకు అభినంద‌న‌లు వెలువెత్తుతున్నాయి. . అనన్య తండ్రి సెల్ఫ్ ఎంప్లాయ్ కాగా, తల్లి గృహిణి. అడ్డాకుల మండ‌లం పొన్నక‌ల్ గ్రామానికి చెందిన అనన్య పదోతరగతి వరకు మహబూబ్‌నగర్ గీతం హైస్కూల్‌లో చదివారు. హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తిచేశారు. ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ చదివిన అనన్య.. ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే సొంత ప్రిపరేషన్‌తోనే ఈ ఘనతను సాధించడం విశేషం.  డిగ్రీ చ‌దువుతున్న స‌మ‌యంలోనే సివిల్స్ మీద దృష్టి సారించాను. దీంతో రోజుకు 12 నుంచి 14 గంట‌ల పాటు క‌ష్టప‌డి చ‌దివేది. ఆంథ్రోపాల‌జీ ఆప్షన‌ల్ స‌బ్జెక్ట్‌గా ఎంచుకుని, హైద‌రాబాద్‌లోనే కోచింగ్ తీసుకున్నారు. ఇంటర్వ్యూ తర్వాత సివిల్స్‌కు ఎంపిక అవుతానని భావించినప్పటికీ.. మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదని అనన్య అన్నారు. సామాజిక సేవ చేయాల‌నే త‌ప‌న త‌న‌లో చిన్నప‌ట్నుంచే ఉందని, ఈ క్రమంలోనే సివిల్స్‌పై దృష్టి సారించి సాధించినట్లా ఆమె తెలిపారు. త‌మ కుటుంబంలో సివిల్స్ సాధించిన తొలి అమ్మాయిని నేనే అని సగర్వంగా చెబుతోంది అనన్య. గతేడాది కూడా తెలంగాణ‌కు చెందిన ఉమా హార‌తి మూడో ర్యాంకు సాధించడం విశేషం.

ఐపీఎస్‌ వదిలి.. 16వ ర్యాంక్
గతేడాది సివిల్స్‌లో ఐపీఎస్‌ వచ్చినా చేరకుండా ఈ ఏడాది ఐఏఎస్‌ సాధించానని ఢిల్లీకి చెందిన అయాన్‌ జైన్‌ తెలిపారు. మంగళవారం యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్‌-2023 ఫలితాల్లో ఆల్‌ ఇండియా 16వ ర్యాంక్‌ సాధించిన అయాన్‌ ఫోన్‌లో ‘నమస్తే ప్రతినిధి’తో మాట్లాడారు. ఢిల్లీలోనే విద్యాభ్యాసమంతా పూర్తి చేసినట్టు అయాన్‌ చెప్పారు. ఐఐటీ ఢిల్లీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి మూడో ప్రయత్నంలో ఐఏఎస్‌ సాధించానని తెలిపారు. రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌ వచ్చినప్పటికీ ఐఏఎస్‌ వైపే దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. మ్యాథ్స్‌ ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకొని సివిల్స్‌లో ర్యాంకు పొందానని చెప్పారు. సివిల్స్‌ రాయాలనుకొనే వారు మొదట పరీక్షను విశ్లేషించుకోవాలని, తర్వాత అవగాహన ఏర్పర్చుకుని ప్రిపరేషన్‌ కొనసాగిస్తే విజయం సాధించవచ్చని ఆయన సూచించారు.

సాఫ్ట్‌వేర్‌ మానేసి సివిల్సే లక్ష్యంగా.. 82వ ర్యాంకుతో సత్తా   
సివిల్స్‌కు ఎంపిక కావడమే లక్ష్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదులుకొని మెయిన్స్‌కు ప్రిపేర్‌ అయిన మెరుగు కౌశిక్‌.. తొలి ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో సత్తా చాటారు. సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేసిన ఆయన.. ఢిల్లీలో ఎంబీఏ చేశారు. అందరూ చదివినట్లే చదివానని.. రోజుకు 8–9 గంటలపాటు ప్రిపేర్‌ అయినట్లు చెప్పారు. చదువుకుంటున్న సమయంలోనే సివిల్స్‌కు ప్రిపరేషన్‌ మొదలు పెట్టానని, ఆ తర్వాత ఏడాది పాటు జాబ్‌ చేశానని తెలిపారు. ప్రిలిమ్స్‌ తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి మెయిన్స్‌ రాసినట్లు పేర్కొన్నారు. ఐఏఎస్‌ కావాలనేది తన లక్ష్యం అని చెప్పారు. తనకు 100లోపు ర్యాంకు వస్తుందని మాత్రం అసలు ఊహించలేదన్నారు. తన తండ్రి నిర్మాణ రంగంలో ఉన్నారని, తల్లి గృహిణి అని చెప్పారు.

వ్యవసాయ కూలీ కుమారుడు ఐఏఎస్‌కు.. 231వ ర్యాంక్‌ 
వ్యవసాయ కూలీ కుమారుడు ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం మంచన్‌పల్లికి చెందిన దయ్యాల బాబయ్య, శశికళ దంపతుల కుమారుడు తరుణ్‌ (24) సివిల్స్‌లో 231వ ర్యాంక్‌ సాధించారు. 2017లో తరుణ్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పదో తరగతి పూర్తి చేశారు. రాజేంద్రనగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశారు. 2023లో బీటెక్‌ పూర్తి చేశారు. ఐఏఎస్‌కు ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని, పేదలకు సేవ చేసే అవకాశం వచ్చిందని తరుణ్‌ తెలిపారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తరుణ్‌ ఇంటికి వెళ్లి అభినందించారు. మారుమూల గ్రామానికి చెందిన తరుణ్‌ ఐఏఎస్‌కు ఎంపిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు.

తాత జస్టిస్‌... మనవరాలు సివిల్స్‌ ర్యాంకర్‌.. 649వ ర్యాంకు  
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రామస్వామి మనవరాలు ఐశ్వర్య నీలిశ్యామల సివిల్స్‌లో 649వ ర్యాంకు సాధించారు. బీటెక్‌ పూర్తి చేసిన ఐశ్వర్య ప్రణాళికాబద్ధంగా ప్రిపేరై ర్యాంకు సాధించినట్లు తెలిపారు. తాత జస్టిస్‌ రామస్వామి తనను ఎంతగానో ప్రేరేపించారని, అందుకే ప్రజాసేవ చేయాలనే లక్షంతో సివిల్స్‌ రాశానని అన్నారు. తండ్రి సివిల్‌ సర్వెంట్, తల్లి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యురాలు అని, తన మామ ఐఏఎస్‌ అధికారి అని పేర్కొన్నారు. 

సివిల్స్‌లో ర్యాంకు సాధించిన మాజీ కానిస్టేబుల్‌.. 780వ ర్యాంకు 
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ యువకుడు పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కూరగాయలు అమ్ముతూ పెంచి పెద్ద చేసిన నాయనమ్మ కష్టాన్ని నిత్యం గుర్తు చేసుకుంటూ పుస్తకాలతో కుస్తీ పట్టారు. తొలిసారి కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించి ఇప్పుడు ఏకంగా సివిల్స్‌లో 780వ ర్యాంకు సాధించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్థానమిది. భర్తతోపాటు కుమారుడు, కోడలు మృతి చెందినప్పటికీ రమణమ్మ తన మనవళ్ల చదువు కోసం చెమటోడ్చారు. మనవడు ఉదయ్ కృష్ణారెడ్డిని స్వగ్రామంలోనే స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివించారు. సెలవుల్లో నాయనమ్మకు చేదోడుగా ఉంటూనే నెల్లూరు జిల్లా కావలిలోని ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తిచేశారు. 2012లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించి 2019 వరకు విధులు నిర్వహించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ శిక్షణ పొందేందుకు హైదరాబాద్‌కు వెళ్లారు. మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైనప్పటికీ ఆత్మవిశ్వాసం సడలకుండా నాలుగోసారి ఉత్తమ ర్యాంకు సాధించారు. ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యే అవకాశముంది. ఆయన సోదరుడు కూడా సివిల్స్ ప్రయత్నాల్లో ఉన్నారు.

కాళ్లు కదలకపోయినా, పట్టువిడవని సంకల్పం.. సివిల్స్‌లో 887వ ర్యాంక్‌ 
విధి వంచించినా.. విశ్వాసం ఆమెను నిలబెట్టింది. కాళ్లు కదలకపోయినా.. పట్టువిడవని సంకల్పం తనను ముందుకు నడిపింది. ఊహించని అనారోగ్యం ఇంటికే పరిమితం చేసినా.. చదువును మాత్రం ఏనాడు దూరం చేసుకోలేదు. దూరవిద్య ద్వారా చదువులు పూర్తి చేసి కుటుంబ సభ్యులు, గురువుల సహకారంతో విశాఖపట్టణానికి చెందిన హనిత వేములపాటి సివిల్స్‌లో 887వ ర్యాంక్‌ సాధించి సత్తాచాటారు. తాను ఆత్మవిశ్వాసంతో చదువును కొనసాగించి సివిల్స్‌ ప్రిపేరయ్యానని ఆమె చెప్పారు. దేశంలోనే అత్యున్నత సివిల్స్‌ సర్విసెస్‌కు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 

అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి.. సివిల్స్ 938వ ర్యాంకర్
ఖమ్మం జిల్లాలో సాధారణ కానిస్టేబుల్‌ కూతురు అలేఖ్య. పోలీసు వృత్తిలోనూ నిజాయితీని చాటుకున్న తండ్రిని ఆమె ఆదర్శంగా తీసుకుంది. పాఠశాల విద్య నుంచే సివిల్స్‌ లక్ష్యంగా ఎంచుకుంది. అనుక్షణం తండ్రి ప్రోత్సాహం ఆమెకు కలిసి వచ్చింది. తన కష్టాలే ఆమెను మానసికంగా బలపడేలా చేశాయి. ఐపీఎస్‌ కావాలన్న లక్ష్య సాధనలో ఆమె 938వ ర్యాంకు సాధించింది. నాలుగుసార్లు సివిల్స్‌ విజయానికి దగ్గరగా వెళ్లిన ఆమె ఎన్నడూ నిరుత్సాహ పడలేదు. ఐదోసారి అనుకున్నది సాధించారు. ప్రతీ తల్లీదండ్రీ పిల్లలను ప్రోత్సహించాలని ఆమె చెప్పార. ప్రజా జీవితానికి చేరువగా విధి నిర్వహణ చేయాలని ఆమె కోరుకుంటున్నారు.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Embed widget