అన్వేషించండి

Telangana: ఇందిరా పార్క్​ వద్ద నిరుద్యోగ యువత ధర్నా, ప్రధాన డిమాండ్లు ఇవే

Hyderabad News: హైదరాబాద్‌లో నిరసన గళాలు వినిపించేందుకు వేదికైన ఇందిరా పార్క్‌ ధర్నాచౌక్‌ మళ్లీ ధర్నాలతో మార్మోగుతుంది. సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగ యువత జూన్ 20న మహాధర్నా చేపట్టింది.

Maha Darna at Indira Park: తెలంగాణలోని నిరుద్యోగ యువత మళ్లీ ధ‌ర్నాల బాట పట్టారు. గత ప్రభుత్వ హయాంలో గళం వినిపించిన నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు ఇందిరా పార్కు వ‌ద్ద జూన్ 20న మహాధర్నా చేప‌ట్టారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్‌ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేయాలని, గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల సంఖ్యను పెంచాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ధ‌ర్నాకు ప‌లు పార్టీల‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు మ‌ద్దతు ప్రకటించారు. గ్రూప్‌-2లో 2 వేల పోస్టులు, గ్రూప్ -3లో 3 వేల పోస్టుల‌కు పెంచాల‌ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-2, 3 రాత‌ప‌రీక్ష‌ల‌ను డిసెంబ‌ర్ వ‌ర‌కు వాయిదా వేయాల‌న్నారు. దీంతో పాటు మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ జారీ చేయాల‌ని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. నిరుద్యోగ సంఘాల జేఏసీ, అశోక్‌ ఆధ్వర్యంలో ఈ మహాధర్నా నిర్వహిస్తున్నారు.

మాట తప్పిన కాంగ్రెస్ అంటూ మండిపాటు..
తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించి, వారి డిమాండ్లను నెర‌వేరుస్తామ‌ని రాహుల్ గాంధీ హామీ ఇచ్చార‌ని ఈ సందర్భంగా నిరుద్యోగులు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు నిరుద్యోగుల‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జీవో 46ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జీవో 46 బాధితులకు న్యా యం చేస్తామని కాంగ్రెస్‌ మాటిచ్చిందని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశంపై ము ఖం చాటేశారని విమర్శించారు. జీవో రద్దు కోసం నిరుద్యోగులు కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

ఎమ్మెల్సీలు అయ్యాక హ్యాండిచ్చారు.. 
ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన బ‌ల్మూర్ వెంక‌ట్, చింత‌పండు న‌వీన్ కుమార్ ఎన్నిక‌ల స‌మ‌యంలో నిరుద్యోగుల‌కు ఎన్నో హామీలిచ్చారని ధర్నాలో పాల్గొన్న నిరుద్యోగులు గుర్తుచేశారు. ఎమ్మెల్సీలు అయ్యాక నిరుద్యోగుల బాధ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోయారు. నిరుద్యోగ స‌మ‌స్యల‌పై వారిద్దరూ స్పందించ‌డం లేద‌ని, కాంగ్రెస్ ప్రభుత్వానికి వంత పాడుతున్నార‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ హ‌యాంలో జారీ చేసిన 30 వేల ఉద్యోగాల‌కు రేవంత్ నియామ‌క ప‌త్రాలిచ్చి తానే భ‌ర్తీ చేసిన‌ట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఏడు నెల‌లు అవుతున్నా, ఇప్పటి వ‌ర‌కు ఒక్క కొత్త నోటిఫికేష‌న్ రాలేద‌న్నారు.

మద్దతు ప్రకటించిన ఆర్‌ఎస్‌పీ..
నిరుద్యోగ సమస్యల పరిషారానికి గురువారం (జూన్ 20) నిరుద్యోగ సంఘాల జేఏసీ, అశోక్‌ చేయబోతున్న మహాధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. తెలంగాణలో గ్రూప్‌-2, 3 పోస్టులను పెంచాలన్నారు. అదేవిధంగా జీవో 46 బాధిత అభ్యర్థులకు ప్రభుత్వం సత్వరమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులు ప్రిపేర్‌ కావడం కోసం మరికొంత సమయం ఇవ్వాలి. టెట్‌ సోర్లను నార్మలైజ్‌ చేశాకే డీఎస్సీ నిర్వహించాలన్నారు. ఏఈఈల నియామకం జరపాలని కోరారు. ప్రభుత్వం వెంటనే జాబ్‌ క్యాలెండర్‌ విడదుల చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని కోరారు. గురుకుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్‌ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Andhra Pradesh: జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి,  మంత్రుల హాట్ కామెంట్స్
జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి, మంత్రుల హాట్ కామెంట్స్
Hassan Nasrallah Killed: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
HYDRA: మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Andhra Pradesh: జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి,  మంత్రుల హాట్ కామెంట్స్
జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి, మంత్రుల హాట్ కామెంట్స్
Hassan Nasrallah Killed: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
HYDRA: మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
JaganLatest Tweets: నా ప్రెస్ మీట్ మీరందరూ వినండి- సీఎంలు, పార్టీ అధినేతలకు జగన్ ట్వీట్
నా ప్రెస్ మీట్ మీరందరూ వినండి- సీఎంలు, పార్టీ అధినేతలకు జగన్ ట్వీట్
Ponguleti ED Raids : కుమారుడి లగ్జరీ వాచీల మోజే కొంప ముంచిందా ? ఈడీ సోదాల వెనుక జరిగింది ఇదే
కుమారుడి లగ్జరీ వాచీల మోజే కొంప ముంచిందా ? ఈడీ సోదాల వెనుక జరిగింది ఇదే
Hyderabad: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
Urvashi Rautela: బాలయ్య అలాంటి వారు కాదు... నటసింహంపై హాట్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలయ్య అలాంటి వారు కాదు... నటసింహంపై హాట్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Embed widget