అన్వేషించండి

TSPSC: నేడు ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పరీక్ష 'కీ' విడుదల, రెస్పాన్స్ షీట్లూ వచ్చేస్తున్నాయి!

ఆన్సర్ కీలతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ లేదా టీఎస్పీఎస్సీ ఐడీ ద్వారా రెస్పాన్స్ షీట్స్ ద్వారా తమ మార్కులను తెలుసుకోవచ్చు.

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నవంబర్ 7న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ కంప్యూటర్ బేస్ట్ విధానంలో నిర్వహించారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ నవంబర్ 15 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్సర్ కీలతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ లేదా.. టీఎస్పీఎస్సీ ఐడీ ద్వారా లాగిన్ అయి.. రెస్పాన్స్ షీట్స్ ద్వారా తమ మార్కులను తెలుసుకోవచ్చు.

కీపై అభ్యంతరాలకు అవకాశం..

ఈ కీలో ఏమైనా అభ్యంతరాలుంటే టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లోనే నవంబర్ 16 నుంచి ప్రత్యేక లింక్ ద్వారా తెలపవచ్చు. ఈ లింక్ ద్వారా మీరు అభ్యంతరం చేయవలసిన ప్రశ్నలకు తగిన ఆధారాలను పీడీఎఫ్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 20 వరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే అబ్జెక్షన్లను ఎట్టిపరిస్థితుల్లో పరిగణనలోకి తీసుకునేదిలేదని స్పష్టం చేశారు. అభ్యంతరాలను మెయిల్స్ ద్వారా గానీ.. ఫోన్ ద్వారా గానీ వ్యక్తం చేయకూడదని తెలిపారు. 

తెలంగాణలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ అండ్ పుడ్(హెల్త్) అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జులై 29 నుంచి ఆగస్టు 26 వరకు దరఖాస్తులు స్వీకరిచింది. అక్టోబరు 31న రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 7న పరీక్ష నిర్వహించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్మాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరిగింది. 

పరీక్షకు 64 శాతం హాజరు..

రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాల్లోని 56 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. పరీక్ష కోసం మొత్తం 16,381 మంది దరఖాస్తు చేసుకోగా.. 14,830 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో కేవలం 9,535 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక 47 మంది అభ్యర్థులు పేపర్-1 మాత్రమే రాశారు. వీరిని అనర్హులుగా ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది.

TSPSC: నేడు ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పరీక్ష 'కీ' విడుదల, రెస్పాన్స్ షీట్లూ వచ్చేస్తున్నాయి!

Also Read:

రేపే 'గ్రూప్-1' ఫైనల్ ఆన్సర్ 'కీ', ఎన్నిమార్కులు కలుస్తున్నాయంటే?
తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్‌ ఆన్సర్‌ కీ నవంబర్‌ 15 విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పరీక్షకు సంబంధించి ప్రైమరీ ఆన్సర్‌ ‘కీ’ అక్టోబరు 29న విడుదలైన విషయం తెలిసిందే. ప్రాథమిక కీపై అక్టోబరు 30 నుంచి నవంబరు 4 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఇక ప్రిలిమినరీ కీపై మొత్తం 10 ప్రశ్నలకు పైగా అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది. దీనిలో ఒక్కప్రశ్నకు మాత్రం ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ ప్రశ్నను డిలీట్ చేస్తే.. అందరికీ ఒక మార్కు కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలిన ప్రశ్నల్లో రెండు నుంచి మూడు ప్రశ్నల వరకు రెండు జవాబులు ఉన్నట్లు తెలిసింది. మొత్తంగా 2 నుంచి 3 ప్రశ్నలకు ఫైనల్ కీలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా.. ప్రింటింగ్ మిస్టేక్ తో మరో మార్కు కూడా కలవనున్నట్లు సమాచారం. 
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.. 

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
UP Women Commission: మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
More Drink Less Kick : ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
Embed widget