(Source: ECI/ABP News/ABP Majha)
TSPSC HWO Recruitment: 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఈ పోస్టుల భర్తీకి జనవరి 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 27న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.డిగ్రీతోపాటు బీఈడీ/డీఈడీ అర్హత ఉన్నవారు అర్హులు.
తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్) ఖాళీల భర్తీకి డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీతోపాటు బీఈడీ/డీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 27న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 581
➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్ -1): 05 పోస్టులు
విభాగం: ట్రైబల్ వెల్ఫేర్.
➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్ -2): 106 పోస్టులు
విభాగం: ట్రైబల్ వెల్ఫేర్.
➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 మహిళలు: 70
విభాగం: ఎస్సీ డెవలప్‌మెంట్.
➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవలప్‌మెంట్): 228
విభాగం: ఎస్సీ డెవలప్‌మెంట్.
➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 (): 140
విభాగం: బీసీ వెల్ఫేర్.
➥ వార్డెన్ (గ్రేడ్ -1): 05
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్.
➥ మ్యాట్రన్ (గ్రేడ్ -1): 03
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్.
➥ వార్డెన్ (గ్రేడ్-2): 03
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్.
➥ మ్యాట్రన్ (గ్రేడ్-2): 02
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్.
➥ లేడి సూపరింటెండెంట్: 19
విభాగం: చిల్డ్రన్ హోం ఇన్ వుమెన్ డెవపల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.
అర్హత: డిగ్రీతోపాటు బీఈడీ/డీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: రూ.280. ఇందులో రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.80 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (ఎడ్యుకేషన్/డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్-విజువల్, హియరింగ్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, తెలుగులో ఉంటాయి.
జీతభత్యాలు..
➨ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(గ్రేడ్-1) పోస్టులకు రూ.38,890 – రూ.1,12,510 ఇస్తారు.
➨ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(గ్రేడ్-2) పోస్టులకు రూ.35,720 – రూ.1,04,430 ఇస్తారు.
➨ వార్డెన్, మ్యాట్రన్ (గ్రేడ్-1) పోస్టులకు రూ.38,890 – రూ.1,12,510 ఇస్తారు.
➨ వార్డెన్, మ్యాట్రన్(గ్రేడ్-2), లేడీ సూపరింటెండెంట్ పోస్టులకు రూ.35,720 – రూ.1,04,430 ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.01.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.01.2023.
➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 27.01.2023.
Also Read:
'గ్రూప్-4' ఉద్యోగార్థులకు అలర్ట్, దరఖాస్తు ప్రక్రియ వాయిదా - అప్లికేషన్ కొత్త తేదీలివే!
రాష్ట్రంలోని మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 23 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల వారంపాటు వాయిదావేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. తాజా ప్రకటన మేరకు డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు జనవరి 19 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టుల భర్తీకి ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో ఖాళీల భర్తీకీ డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ&బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హార్టికల్చర్ విభాగంలో ఖాళీల భర్తీకీ డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...