TSPSC Group1 Exam Pattern: 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షా విధానం ఖరారు! పేపర్లు, మార్కుల వివరాలు ఇలా!
టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో మెయిన్స్ పరీక్షా విధానం వివరాలను పొందుపరిచింది. మెయిన్స్ పేపర్ విధానం, సెక్షన్ల వివరాలు, ప్రశ్నల ఛాయిస్ తదితర వివరాలకోసం వెబ్‌సైట్ చూడాలని ఉద్యోగార్థులకు సూచించింది.
గ్రూప్-1 ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణలో తొలి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా విధానం ఖరారైంది. నిపుణుల కమిటీ సూచన మేరకు పరీక్షా విధానానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 18న ఆమోదం తెలిపింది. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో మెయిన్స్ పరీక్షా విధానం వివరాలను పొందుపరిచింది. మెయిన్స్ పేపర్ విధానం, సెక్షన్ల వివరాలు, ప్రశ్నల ఛాయిస్ తదితర వివరాలకోసం టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని ఉద్యోగార్థులకు సూచించింది.
పరీక్ష విధానం ఇలా..
➥ 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షల్లో 6 ప్రధాన సబ్జెక్టులతో పాటు జనరల్ ఇంగ్లిష్ క్వాలిఫైయింగ్ పరీక్ష ఉంటుంది. ఈ క్వాలిఫైయింగ్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే మిగతా 6 పేపర్లను మాత్రమే పరిగణలోకి తీసుకొని పేపర్ల మూల్యాంకనం చేస్తారు.
➥ క్వాలిఫయింగ్ టెస్టు 150 మార్కులకు ఉంటుంది. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. ఇది కేవలం క్వాలిఫయింగ్ టెస్టు మాత్రమే. ఈ మార్కులను మెయిన్స్ పరీక్షల్లో (6 పేపర్లు) సాధించిన మొత్తం మార్కులలో మాత్రం కలపరు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
➥ మెయిన్స్ పరీక్షల్లో నిర్వహించే మొత్తం 6 పేపర్లలో.. ప్రతి పేపర్‌కు 150 మార్కుల చొప్పున 900 మార్కులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 3 గంటల సమయం.
➥ మెయిన్స్ ఎగ్జామ్ పూర్తిచేసిన అభ్యర్థులకు గతంలో ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. దానికి 100 మార్కులు కేటాయించేవారు. దీంతో మొత్తం కలిపి 1000 మార్కులకు గ్రూప్-1 పరీక్ష నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఇంటర్వూలు ఎత్తేశారు. దీంతో 900 మార్కులకే గ్రూప్ -1 మెయిన్స్ నిర్వహించనున్నారు.
➥ ఉద్యోగానికి అభ్యర్థుల ఎంపికలో కేవలం ఈ ఆరు పేపర్లలో సాధించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ప్రిలిమ్స్, క్వాలిఫయింగ్ ఇంగ్లిష్ పరీక్షలలో సాధించిన మార్కులను ప్రధాన పరీక్షలకు కలపరు.
పేపర్లు ఇవే..
★ పేపర్-1: జనరల్ ఎస్సే
★ పేపర్-2: హిస్టరీ, కల్చర్ జాగ్రఫీ
★ పేపర్-3: ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్ & గవర్నెన్స్
★ పేపర్-4: ఎకానమీ డెవలప్‌మెంట్
★ పేపర్-5: సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్.
★ పేపర్-6: తెలంగాణ మూవ్‌మెంట్, స్టేట్ ఫార్మేషన్
జనరల్ ఇంగ్లిష్ (అర్హత పరీక్ష):
➥ Spotting Errors – Spelling; Punctuation
➥ Fill in the blanks – Prepositions; Conjunctions; Verb tenses
➥ Re-writing sentences – Active and Passive voice;
➥ Direct & Reported Speech; Usage of Vocabulary
➥ Jumbled sentences
➥ Comprehension
➥ Precis Writing
➥ Expansion
➥ Letter Writing
మార్కుల కేటాయింపు ఇలా...
➨పేపర్-1 (జనరల్ ఎస్సే): ఈ పేపర్‌లో మూడు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌కు 50 మార్కుల చొప్పున మూడు సెక్షన్లకు 150 మార్కులు కేటాయించారు. ఒక్కో సెక్షన్‌లో మూడు ప్రశ్నలు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో ఒక ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. ఇది వెయ్యిపదాల్లో వ్యాసం రాయాలి.
➨పేపర్-2 (చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ)
➨ పేపర్-3 (భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన)
➨పేపర్-4 (ఎకానమీ, డెవలప్‌మెంట్)
పేపర్-2, పేపర్-3, పేపర్-4 లలో ప్రశ్నపత్రం ఒకే విధంగా ఉంటుంది. ఈ మూడు పేపర్లలోనూ మూడేసి సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో 5 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులుంటాయి. ప్రశ్నకు సమాధానం 200 పదాల్లో ఇవ్వాలి. ఒక్కోప్రశ్నకు పది మార్కులు ఉంటాయి. అయితే ఒక్కో సెక్షన్‌లో అయిదు ప్రశ్నల్లో తొలిరెండు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా ఇవ్వాలి. మూడు, నాలుగు, అయిదు ప్రశ్నల్లో ఛాయిస్ ఆప్షన్ ఉంటుంది.
➨పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్): ఈ పేపరులోనూ మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి రెండు సెక్షన్లలో అయిదు ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఈ సెక్షన్లలో మొదటి రెండు ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మిగతా మూడు ప్రశ్నలకు ఛాయిస్ ఉంటుంది. ప్రశ్నలకు సమాధానం 200 పదాల్లో ఉండాలి. ఇక మూడో సెక్షన్‌లో మొత్తం 30 ప్రశ్నలుంటాయి. వీటిలో 25 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 50 మార్కులు ఉంటాయి.
➨ పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు): ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో అయిదు ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం 200 పదాల్లో ఇవ్వాలి. ఒక్కోప్రశ్నకు పది మార్కులు చొప్పున మొత్తం 15 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించింది. అయితే ఒక్కో సెక్షన్‌లోని అయిదు ప్రశ్నల్లో తొలిరెండు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరి ఇవ్వాలి. ఇందులో ఛాయిస్ ఉండదు. మూడు, నాలుగు, అయిదు ప్రశ్నల్లో ఛాయిస్ ఆప్షన్ ఉంటుంది.
* జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్ష: ఇందులో 15 ప్రశ్నలు ఉంటాయి.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పేపర్లు, సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..
Group-1 Mains Paper Pattern:
Also Read:
➥ తెలంగాణ 'గ్రూప్-3' నోటిఫికేషన్ వచ్చేసింది, 1365 ఖాళీల భర్తీకి 24 నుంచి దరఖాస్తులు!
➥ తెలంగాణలో 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల పూర్తి వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!
➥ 8039 పోస్టులకే 'గ్రూప్-4' నోటిఫికేషన్ - అర్హతలు, దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!