అన్వేషించండి

TSLPRB: పోలీసు ఉద్యోగార్థులకు అలర్ట్, దళారుల మాటలు నమ్మొద్దు, సమాచారమిచ్చినవారికి 3 లక్షల నజరానా!

రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) సంచలన నిర్ణయం తీసుకొంది. ఉద్యోగానికి ఎంపికయ్యేలా  చూస్తామంటూ మభ్యపెట్టే దళారుల సమాచారమందించిన వారికి 3 లక్షల వరకు నజరానా ప్రకటించింది.

తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) సంచలన నిర్ణయం తీసుకొంది. ఉద్యోగానికి ఎంపికయ్యేలా  చూస్తామంటూ మభ్యపెట్టే దళారుల సమాచారమందించిన వారికి నజరానా ప్రకటించింది. ఇచ్చిన సమాచారం ఆధారంగా గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు ఇవ్వనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా దళారులను నమ్మితే చిక్కుల్లో పడతారని హెచ్చరించింది. అలా ప్రయత్నించినట్లు నిరూపితమైన అభ్యర్థులపైనా వేటు తప్పదని హెచ్చరించింది. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు అర్హత లేకుండా పోతుందని వెల్లడించింది. నియామక ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని, మెరిట్ ఆధారంగానే తుదిజాబితా వెల్లడవుతుందని స్పష్టం చేసింది. అందువల్ల అభ్యర్థులు ఎలాంటి వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ప్రకటించింది.

పోలీసు తుది రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయినట్లు మండలి స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాల్లో గత నెల 14-26 మధ్య చేపట్టిన ఈ ప్రక్రియలో 1,08,940 మంది అభ్యర్థులకు గాను 97,175 (89.2శాతం) మంది హాజరైనట్లు ప్రకటించింది. ఉద్యోగాలకు ఎంపికయ్యేలా చేస్తామని మభ్యపెట్టే దళారులను కనిపెట్టేందుకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టాస్క్ బృందాలను రంగంలోకి దింపినట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. దళారుల గురించి తెలిస్తే 93937 11110 లేదా 93910 05006 కు సమాచారం అందించాలని, సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. 

వయోపరిమితి విధింపు అసాధ్యం..
టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నియామక ప్రక్రియలో ముందస్తుగానే ధ్రువీకరణ పత్రాల్ని పరిశీలించడం సాధ్యం కాదని మండలి స్పష్టం చేసింది. మొత్తం 12.9 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. తొలిదశలోనే వాటిని పరిశీలించడం అసాధ్యమని పేర్కొంది. ఈ కారణంగానే తుది రాతపరీక్షకు ఎంపికైన తర్వాతే ధ్రువీకరణపత్రాల్ని పరిశీలించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొంది. అందుకే వయసు విషయంలో నోటిఫికేషన్‌లో పొందుపరిచిన తేదీల ప్రకారం అర్హులైతేనే దరఖాస్తు చేసుకోవాలని అప్పుడే స్పష్టంగా పేర్కొన్నట్లు గుర్తు చేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు.. త్రివిధ దళాల ఉద్యోగులు.. హోంగార్డులు.. వితంతువులు.. ఎన్‌సీసీ శిక్షకులు.. జనగణన విభాగంలో తాత్కాలిక ఉద్యోగులు.. ఇలా ఒక్కో కేటగిరీలో పనిచేస్తున్న వారికి వయసులో ప్రత్యేకంగా సడలింపులు ఉండటంతోపాటు ఒక్కో పోస్టుకు పలు కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తులు చేసినట్లు పేర్కొంది. ఆ కారణంగానే టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్ సాఫ్ట్‌వేర్‌లో వయసుకు పరిమితి విధించలేదని స్పష్టం చేసింది. ఇలాంటి సంక్షిష్టతల దృష్ట్యా వయోపరిమితిలో తాము అర్హులమే..? అని సరిపోల్చుకొన్న తర్వాతే దరఖాస్తు చేయాలని పదేపదే ప్రకటించినట్లు గుర్తు చేసింది. ఈ దశలో వయసు విషయంలో ఎలాంటి గందరగోళాన్ని సృష్టించొద్దని పేర్కొంది.

నమ్మి మోసపోవద్దు..
మోసాలపై జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థులను కోరారు. ఏ నియామక ప్రక్రియలోనైనా చివరిదశలో సహజంగానే దళారులు మోసగించే ప్రయత్నాలు చేస్తారని మండలి పేర్కొంది. దళారులు ఎలా మోసం చేస్తారనే వివరాలను వెల్లడించింది.

➥ ఉద్యోగానికి ఎంపిక చేసేందుకు ముందస్తుగానే బ్యాంకు ఉమ్మడిఖాతా తెరిపించి డబ్బు వేయిస్తారు. లేదంటే మధ్యవర్తి వద్ద పెట్టిస్తారు. ఒకవేళ అభ్యర్థి గనక మెరిట్ ప్రాతిపదికన ఎంపికైతే అది తమ చలవేనని చెప్పి డిపాజిట్ చేసిన డబ్బును లాగేసుకుంటారు.

➥ రాజకీయప్రముఖులతో లేదా పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు నటిస్తారు. అభ్యర్థిని సచివాలయానికి లేదా ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకెళ్తారు. అభ్యర్థిని బయటే కూర్చుండబెట్టి.. మాట్లాడి వస్తామని లోపలికెళ్తారు. బయటికి వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చేలా మాట్లాడినట్లు నమ్మకం కలిగిస్తారు.

➥ అభ్యర్థిని నమ్మించేందుకు ఫోర్జరీ చేసిన ధ్రువీకరణ పత్రాలను తయారుచేస్తారు. నకిలీ ఈ-మెయిల్/వెబ్‌సైట్ పోస్ట్/వీడియోలను సృష్టిస్తారు.

ALSO READ:

రెప్కో మైక్రో ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో 140 ఖాళీలు, అర్హతలివే!
చెన్నైలోని నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలోని 'రెప్కో మైక్రో ఫైనాన్స్‌ లిమిటెడ్‌' వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 140 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అడ్మిన్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జులై 19లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

'టెన్త్' అర్హతతో 1558 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది!
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 30న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 1558 మ‌ల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవిల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 30 ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Realme V60 Pro: రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మురళి కృష్ణుడి అలంకారంలో  శ్రీప‌ద్మావ‌తి అమ్మవారునర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియోఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులిISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Realme V60 Pro: రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget