(Source: Poll of Polls)
TS WDSC: తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలో కమ్యూనిటీ ఎడ్యుకేటర్ ఖాళీలు
హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ తాత్కాలిక ప్రాతిపదికన జిల్లాల వారీగా కమ్యూనిటీ ఎడ్యుకేటర్ కమ్ మాస్టర్ వాలంటీర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
TS WDSC Recruitment: హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ తాత్కాలిక ప్రాతిపదికన జిల్లాల వారీగా కమ్యూనిటీ ఎడ్యుకేటర్ కమ్ మాస్టర్ వాలంటీర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 66 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (సైకాలజీ/ సోషల్ వర్క్/ పబ్లిక్ హెల్త్, సైకియాట్రీ) ఉత్తీర్ణత, పీజీడీసీఏ సర్టిఫికేట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్‌లో పోటిఫికేషన్ వెల్లడైన తేదీ నుంచి 7 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు సంప్రదించాల్సిన నెంబరు 040-24559048.
వివరాలు..
*కమ్యూనిటీ ఎడ్యుకేటర్ కమ్ మాస్టర్ వాలంటీర్
ఖాళీల సంఖ్య: 66 పోస్టులు
జిల్లాల వారీగా వాలంటీర్ల వివరాలు..
ఆదిలాబాద్- 2
భద్రాద్రి కొత్తగూడెం-2
హనుమకొండ-1
హైదరాబాద్- 8
జగిత్యాల-1
జనగాం- 1
జయశంకర్ భూపాలపల్లి- 1
జోగులాంబ గద్వాల- 1
కామారెడ్డి-1
కరీంనగర్-2
ఖమ్మం-3
కొమురం భీమ్ ఆసిఫాబాద్- 1
మహబూబాబాద్-1
మహబూబ్ నగర్- 3
మంచిర్యాల్-1
మెదక్- 3
మేడ్చల్ మల్కాజిగిరి-5
ములుగు -1
నాగర్ కర్నూల్- 1
నారాయణపేట్-1
నల్గొండ- 3
నిర్మల్-2
నిజామాబాద్-2
పెద్దపల్లి-1
రాజన్న సిరిసిల్ల-1
రంగారెడ్డి-5
సంగారెడ్డి-2
సిద్దిపేట-1
సూర్యాపేట- 2
వికారాబాద్- 3
వనపర్తి -1
వరంగల్-2
యాదాద్రి భువనగిరి-1
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (సైకాలజీ/ సోషల్ వర్క్/ పబ్లిక్ హెల్త్, సైకియాట్రీ) ఉత్తీర్ణత, పీజీడీసీఏ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. డ్రగ్ డిమాండ్ రిడక్షన్ అండ్ సంబంధిత ఫీల్డ్‌లో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
భత్యం: నెలకు రూ.10,000.
నోటిఫికేషన్ తేది: 21.02.2024.
ఇతర వివరాలకు: 040-24559048.
దరఖాస్తుకు చివరి తేదీ: నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి ఏడు రోజుల్లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ALSO READ:
ఇండియన్ నేవీలో 254 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు, ఎంపికైతే రూ.56 వేల ప్రారంభ జీతం
Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్‌లలో 254 ఖాళీలను భర్తీచేనున్నారు. విభాగాలవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 24న ప్రారంభంకాగా, మార్చి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని 'ఇండియన్ నేవీ అకాడమీ'లో 2025, జనవరిలో ప్రారంభమయ్యే కోర్సు(ST-25)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎస్ఎల్టీ బేసిక్ పే కింద రూ.56,100 ఇస్తారు. దీంతోపాటు ఇతర అలవెన్సులూ ఉంటాయి. NCC (C సర్టిఫికేట్) అభ్యర్థులకు ఎంపికలో 5 శాతం రిలాక్సేషన్ వర్తిస్తుంది. నేవీలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..