అన్వేషించండి

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

Telangana TET Results 2022: ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా నిర్వహించిన టీఎస్ టెట్ 2022 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.

TS TET Results 2022 Online Direct Link: తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET Results 2022) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. టెట్ 2022 నిర్వహణకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా షెడ్యూల్ ప్రకారమే టెట్ నిర్వహించింది. రైల్వే రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ (RRB) అదే రోజున ఉందని పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు కోరినా విద్యాశాఖ మాత్రం నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ క్రమంలో జూన్ 12న టెట్ నిర్వహించారు. నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. తెలంగాణ టెట్ 2022 ఫలితాలు జూన్ 27న విడుదల కావాల్సి ఉంది. కానీ టెట్ ఫలితాలు జూలై 1కి వాయిదా వేశారు. టీచర్ పోస్టుల కోసం ఎదరుచూస్తున్న అభ్యర్థులు టెట్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెట్ రాసిన అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://tstet.cgg.gov.in/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

టీఎస్ టెట్ 2022 ఫలితాలు (TS TET Results 2022)
టెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 12న టెట్ ఎగ్జామ్ నిర్వహించారు. జూన్ 27న ఫలితాల విడుదలతో పాటు టెట్ ఫైనల్ ఆన్సర్ కీ ని విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించారు. జూలై 1కి టెట్ ఫలితాలు వాయిదా వేయగా.. నేడు అధికారిక వెబ్‌సైట్ https://tstet.cgg.gov.in/ లో టెట్ అభ్యర్థులు తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. పేపర్-1కు సంబంధించి మొత్తం 7,930 అభ్యంతరాలు రాగా.. పేపర్ 2కు సంబంధించి మొత్తం 4,663 అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. టెట్ పూర్తయిన తర్వాత తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ జరగనుంది. ఆదివారం రాత్రి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. టెట్ ఫైనల్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://tstetnew.cgg.gov.in/TSTETWEB2022/pages/finalKey.jsp

టెట్ 2022లో మార్పులు..
ఈ ఏడాది టెట్‌లో జరిగిన మార్పుల కారణంగా పేపర్‌ 1, పేపర్‌ 2 కలిపి మొత్తం 3,79,101 మంది అభ్యర్ధులు టెట్ 2022కు దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌ పరీక్ష జూన్‌ 12 న మొత్తం 33 జిల్లాల్లో జరగనుంది. జూన్ 27న ఫలితాలు విడుదల చేయనున్నట్లు షెడ్యూల్‌లో ప్రకటించారు. కాగా, పేపర్‌-1, పేపర్-2 రెండు పరీక్షలు ఒకటే రోజు జరగనున్నాయి. పేపర్‌ -1 ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటలకు, పేపర్‌-2 పరీక్ష మధ్యాహ్నం 2:30 నిముషాల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ భర్తీకి ప్రకటన చేయగా.. టీచర్ పోస్టులున్నాయి. సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13,086 పోస్టులు, 6,500 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2000, ల్యాంగ్వేజ్ పండిట్ పోస్టులు 600 వరకు ఉన్నాయి. వీటి భర్తి నేపథ్యంలో టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. గతంలో డిప్లొమా అభ్యర్థులు టెట్ పేపర్ 1 రాసేవారు. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం ఉండేది.  కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులు (B.ed Candidates) కూడా టెట్ పేపర్ 1 రాసే అవకాశం కల్పించారు. 



మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget