By: ABP Desam | Updated at : 18 Mar 2022 03:00 PM (IST)
తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లు
Telangana Government Jobs 2022: తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత నిరుద్యోగులు తమకు ఇకనైనా జాబ్ నోటిఫికేషన్లు వస్తాయని సంతోషించారు. కానీ అందుకు అనూహ్యంగా సీఎం కేసీఆర్ ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. పైగా రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగడం, ప్రతిపక్షాల విమర్శలతో ఇటీవల ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. మొత్తం 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం నోటిఫై చేయగా, అందులో 11 వేల కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు.
నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు !
మొత్తం 80,039 ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, నిరుద్యోగులు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. అంతకు ముందురోజైతే తాను అసెంబ్లీలో ప్రకటన చేస్తానని మరి నిరుద్యోగులను టీవీ చూడాలని సూచించారు. ఊహించినట్లుగానే భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా రావడం లేదు. మరోవైపు స్థానికత అంశంపై స్పష్టత లేదని, ఇటీవల వచ్చిన కోర్టులో ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా తేలిపోయింది. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఉగాది నుంచి శుభవార్త వినే అవకాశం ఉందని సమాచారం. ఇంకా ఆలస్యం చేస్తే నిరుద్యోగులలో ప్రభుత్వంపై నమ్మకం పోయే అవకాశాలున్నాయి.
తొలి విడతగా 30 వేలకు పైగా పోస్టులు..
మొత్తం 80 వేల ఉద్యోగాలకుగానూ దశలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తొలి విడతగా కొన్ని శాఖల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన దాదాపు 30 నుంచి 40 వేల పోస్టుల నియామక ప్రక్రియ ఉగాది నుంచి మొదలుపెట్టాలని సర్కార్ యోచిస్తోంది. పోస్టుల భర్తీపై ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. ఉగాది నుంచి విడతల వారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రానున్నాయి. మార్చి 17 నాటికి 10 ప్రభుత్వ శాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. ఇందులో కీలక శాఖలైన హోం, రెవెన్యూ, వ్యవసాయ, వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు ఉన్నాయి. హోం శాఖ - 18,334, హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ - 12,755, విద్యాశాఖలో 13,086, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 1,455 పోస్టులు భర్తీ చేయనున్నారు.
శాఖలు - పోస్టుల సంఖ్య
హోం శాఖ - 18,334
సెకండరీ ఎడ్యుకేషన్ - 13,086
హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ - 12,755
హయ్యర్ ఎడ్యుకేషన్ - 7,878
బీసీల సంక్షేమం - 4,311
రెవెన్యూ శాఖ - 3,560
ఎస్సీ వెల్ఫేర్ - 2,879
నీటిపారుదల శాఖ - 2,692
ఎస్టీ వెల్ఫేర్ - 2,399
మైనారిటీ వెల్ఫేర్ - 1,825
ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ - 1,598
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455
లేబర్, ఎంప్లాయిమెంట్ - 1,221
ఆర్థిక శాఖ- 1,146
మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ - 895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ - 859
అగ్రికల్చర్, కో-ఆపరేషన్ - 801
రవాణా, రోడ్లు, భవనాలు - 563
న్యాయశాఖ - 386
పశుపోషణ, మత్స్య శాఖ - 353
జనరల్ అడ్మినిస్ట్రేషన్ - 343
ఇండస్ట్రీస్, కామర్స్ - 233
యూత్, టూరిజం, కల్చర్ - 184
ప్లానింగ్ - 136
ఫుడ్, సివిల్ సప్లయిస్ - 106
లెజిస్లేచర్ - 25
ఎనర్జీ - 16
రాష్ట్రంలో మొత్తం పోస్టులు - 80,039
Telangana Police Jobs: పోలీసు ఉద్యోగాలకు ఇంకా అప్లై చేయలేదా? ఇవాళే లాస్ట్ డేట్!
Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్న్యూస్
Bombay Chutney: పూరీతో బొంబాయి చట్నీ అదిరిపోతుంది, పదినిమిషాల్లో చేసేయచ్చు
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు