News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

DSC Notification: 6,500 పోస్టులకు రెండ్రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన

తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మొత్తంగా 6,500కు పైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఖాళీల్లో పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూళ్లలో 1,523 పోస్టులు ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆగస్టు 24 మంత్రి సబిత మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. 

డీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ..
ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ చేయనున్నట్లు మంత్రి సబితా తెలిపారు. దీనికి సంబంధించి రెండ్రోజుల్లోనే నోటిఫికేషన్‌, విధివిధానాలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రెండ్రోజుల్లోనే జిల్లా కలెక్టర్లు డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తారన్నారు. విద్యారంగంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. 

గురుకులాల్లో గర్వపడే ఫలితాలు..
గురుకులాల్లో మనందరం గర్వపడేలా సత్ఫలితాలు వస్తున్నాయని మంత్రి సబిత అన్నారు. కొన్ని గురుకులాలను డిగ్రీ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేశామని తెలిపారు. గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 5,310 టీచర్‌ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించామని చెప్పారు. అన్ని స్థాయిల విద్యాసంస్థల్లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ స్థాయిల్లో 3,140 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. మిగిలిన ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు.

ALSO READ:

ఈసీఐఎల్‌లో 163 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు- ఈ అర్హతలుండాలి
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌), కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా నెలకొన్న ఈసీఐఎల్‌ కేంద్రాల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు.  సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

నార్తర్న్ రైల్వేలో 93 సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 28 లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయించారు.అకడమిక్ మెరిట్, అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 24 Aug 2023 02:31 PM (IST) Tags: Teacher Jobs In Telangana ts dsc 2023 Telangana DSc Notification TS DSC 2023 Recruitment TRT 2023 Exam

ఇవి కూడా చూడండి

Army School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

Army School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

ICG Recruitment: ఇండియన్ కోస్ట్ గార్డు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

ICG Recruitment: ఇండియన్ కోస్ట్ గార్డు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

IFFCO Notification: ఇఫ్‌కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు

IFFCO Notification: ఇఫ్‌కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు

JL Exam Key: జేఎల్‌ రాత పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

JL Exam Key: జేఎల్‌ రాత పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు

APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు

టాప్ స్టోరీస్

Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్

Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్

Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్

Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్

వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!

వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు