News
News
వీడియోలు ఆటలు
X

Constable Exam: ఏప్రిల్ 24 నుంచి కానిస్టేబుల్ పరీక్ష హల్‌టికెట్లు అందుబాటులో, పరీక్ష ఎప్పుడంటే?

సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉదయం 10.00 గంట‌ల‌ నుంచి మధ్యాహ్నం 1.00 వరకు జరగనుంది. ఐటీ అండ్ సీవో పోస్టులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియమాక పరీక్షల ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఇప్పటికే ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ఫైనల్ పరీక్షలు పూర్తికాగా కానిస్టేబుల్ పరీక్షలను ఏప్రిల్ 30న నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లును ఏప్రిల్ 24 ఉదయం 8 గంటలకు వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి  (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెల్లడించింది. ఏప్రిల్ 28 అర్ధరాత్రి 12.00 గంటల లోపు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పోలీస్ కానిస్టేబుల్(సివిల్, ఐటీ అండ్ సీవో) తుది పరీక్షలు ఏప్రిల్ 30న జరగనున్నాయి. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉదయం 10.00 గంట‌ల‌ నుంచి మధ్యాహ్నం 1.00 వరకు జరగనుంది. ఐటీ అండ్ సీవో పోస్టులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

తుది పరీక్షలు ఇలా జరిగాయి.. 

➥ మార్చి 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ (IT&CO) టెక్నికల్ పేపర్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సీటీ ఏఎస్‌ఐ(FPB) టెక్నికల్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు.

➥ మార్చి 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ (PTO) టెక్నికల్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు.

➥ ఏప్రిల్ 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ కానిస్టేబుల్ (డ్రైవర్) డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు టెక్నికల్ పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సీటీ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులకు టెక్నికల్ పేపర్ పరీక్షలు నిర్వహిస్తారు.

➥ ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు అరిథ్‌మెటిక్ & రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు.

➥ ఏప్రిల్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు తెలుగు/ఉర్దూ పరీక్ష నిర్వహిస్తారు.

➥ ఇక చివరగా ఏప్రిల్ 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ కానిస్టేబుల్(సివిల్), ఇతక కానిస్టేబుల్ సమాన పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ కానిస్టేబుల్(IT&CO) పోస్టులకు టెక్నికల్ పరీక్ష్ నిర్వహిస్తారు. 

తెలంగాణలో పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 8 నుంచి జనవరి 5 వరకు ఫిజికల్ ఈవెంట్లు (పీఎంటీ, పీఈటీ) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన ఫలితాలను జనవరి 6న పోలీసు నియామక మండలి విడుదల చేసింది. పోలీసు ఫిజికల్ ఈవెంట్లకు రాష్ట్రవ్యాప్తంగా 2,07,106 మంది అభ్యర్థులు హాజ‌రుకాగా.. 1,11,209 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. 2018-19లో జ‌రిగిన రిక్రూట్‌మెంట్‌తో పోల్చితే, ఇప్పుడు అద‌నంగా 5.18 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయిన‌ట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.

Also Read:

ఏఈఈ అభ్యర్థులకు అలర్ట్, ఆన్‌లైన్‌లో ఏఈఈ(సివిల్) ప‌రీక్ష నిర్వహణ!
తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కీల‌క నిర్ణయం తీసుకుంది. ఏఈఈ(సివిల్) పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో రాత‌ప‌రీక్ష నిర్వహించాల‌ని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. మే 21న ఏఈఈ పోస్టుల‌కు ఓఎంఆర్ ప‌ద్ధతిలో ప‌రీక్షలు నిర్వహిస్తామ‌ని గ‌తంలో టీఎస్‌పీఎస్సీ ప్రక‌టించిన సంగతి తెలిసిందే. అయితే ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్, అగ్రిక‌ల్చర్, మెకానిక‌ల్ పోస్టుల‌తో పాటు సివిల్ పోస్టుల‌కు కూడా ఆన్‌లైన్‌లో రాత‌ప‌రీక్ష నిర్వహించాల‌ని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 21న అధికారికంగా ప్రకటించింది.
పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 23 Apr 2023 11:07 AM (IST) Tags: TSLPRB Police Exam Police Constable Exam TS Police Final Exam TS SI Final Exa TSLPRB Final Exams

సంబంధిత కథనాలు

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

ECIL Recruitment: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 70 ఇంజినీర్‌, ఆఫీసర్‌ పోస్టులు, అర్హతలివే!

ECIL Recruitment: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 70 ఇంజినీర్‌, ఆఫీసర్‌ పోస్టులు, అర్హతలివే!

Canada : కెనడాలో లెక్కలేనన్ని ఉద్యోగాలు - అక్కడి ప్రభుత్వ ఎన్ని ఆఫర్లు ఇస్తుందో తెలుసా ?

Canada : కెనడాలో లెక్కలేనన్ని ఉద్యోగాలు -  అక్కడి ప్రభుత్వ ఎన్ని ఆఫర్లు ఇస్తుందో తెలుసా ?

టాప్ స్టోరీస్

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా