News
News
వీడియోలు ఆటలు
X

విదేశాల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం, 29న ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ - డోంట్ మిస్!

టామ్‌కామ్ ఆధ్వర్యంలో యూఏఈలో పలు కేటగిరీల ఉద్యోగాలకు, మలేసియాలో టెక్నికల్‌ సూపరింటెండెంట్‌ ఉద్యోగాలకు ఏప్రిల్ 29న ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు టామ్‌కామ్‌ తెలిపింది.

FOLLOW US: 
Share:

తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌) ఆధ్వర్యంలో యూఏఈలో పలు కేటగిరీల ఉద్యోగాలకు, మలేసియాలో టెక్నికల్‌ సూపరింటెండెంట్‌ ఉద్యోగాలకు ఏప్రిల్ 29న ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు టామ్‌కామ్‌ తెలిపింది. నాన్‌ హెల్త్‌ కేటగిరీలోని ఈ ఉద్యోగాలకు విజయనగర్‌ కాలనీలోని మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌లోని టామ్‌కామ్‌ కార్యాలయంలో డ్రైవ్‌ కొనసాగనుంది. 

యూఏఈలో బ్లాస్టర్‌ పెయింటర్‌, క్లీనర్‌, జనరల్‌ హెల్పర్‌, ఫోర్‌మెన్‌, బ్లాస్టింగ్‌ పెయింటింగ్‌, ఫోర్‌మెన్‌ ప్లాటర్‌, ఎఫ్‌సీఏడబ్ల్యూ వెల్డర్‌, జీటీఏడబ్ల్యూ వెల్డర్‌, ఐటీవీ డ్రైవర్‌, మిషినిస్ట్‌, సీఎస్‌సీ, పైప్‌ ఫిట్టర్‌, ప్లాటర్‌ ఫ్యాబ్రికేటర్‌, స్కాఫోల్డర్స్‌ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు తగిన అనుభవంతో పాటు రెండేళ్లపాటు చెల్లుబాటయ్యేలా పాస్‌పోర్టు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నియామక ఏజెన్సీ భోజనం, వసతి, టికెట్లు అందిస్తుంది. అర్హులైన అభ్యర్థులు టామ్‌కామ్‌ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (TOMCOM) అనేది తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీస్‌ శాఖ పరిధిలో రిజస్టరైన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ. తెలంగాణలోని స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ కార్మికులకు ఈ సంస్థ విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. ఈ మేరకు గల్ఫ్‌ దేశాలతోనే కాకుండా ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగరీ, జపాన్‌, పోలాండ్‌, రోమేనియా, యూకేలతో TOMCOM భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.

Website

Also Read:

హైదరాబాద్‌ ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో 141 యంగ్ ఫెలో పోస్టులు- అర్హతలివే!
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయితీ రాజ్(ఎన్‌ఐఆర్‌డీపీఆర్) ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 141 పోస్టులను భర్తీ చేయనున్నారు. పీజీతో పాటు సోషల్‌ సైన్సెస్‌‌లో పీజీ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగాఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. మే 5లోపు అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

షార్‌ శ్రీహరికోటలో 94 టెక్నీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు- అర్హతలివే!
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ వివిధ కేటగిరీ/ విభాగాల్లో టెక్నీషియన్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్/డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 94 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ/ ఎన్‌టీసీ/ ఎన్‌ఏసీ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. సరైన అర్హతలున్నవారు మే 9 నుంచి జూన్ 9 మధ్య ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 28 Apr 2023 06:07 PM (IST) Tags: TOMCOM Enrollment drive ITI campus TOMCOM overseas jobs drive

సంబంధిత కథనాలు

LIC ADO Result 2023: ఎల్ఐసీ ఏడీవో మెయిన్స్ ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

LIC ADO Result 2023: ఎల్ఐసీ ఏడీవో మెయిన్స్ ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

UPSC Civils Exam: వెబ్‌సైట్‌లో యూపీఎస్సీ సివిల్స్‌-2023 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం!

UPSC Civils Exam: వెబ్‌సైట్‌లో యూపీఎస్సీ సివిల్స్‌-2023 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం!

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

టాప్ స్టోరీస్

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

Delhi Murder Case: మాట్లాడటం లేదనే ఢిల్లీలో బాలిక హత్య- నేరాన్ని అంగీకరించిన సాహిల్

Delhi Murder Case: మాట్లాడటం లేదనే ఢిల్లీలో బాలిక హత్య- నేరాన్ని అంగీకరించిన సాహిల్

Prabhas Vs Bollywood Heroes : ప్రభాస్ కంటే శ్రీ రాముని పాత్రకు ఆ హిందీ హీరోలు బెటరా?

Prabhas Vs Bollywood Heroes : ప్రభాస్ కంటే శ్రీ రాముని పాత్రకు ఆ హిందీ హీరోలు బెటరా?