అన్వేషించండి

TSPSC Group 2 Exam: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్ష మళ్లీ వాయిదా? కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే పరీక్షలు!

Group2 Exam: తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష మళ్లీ వాయిదాపడేలా కనిపిస్తోంది. కొత్త బోర్డు ఏర్పాటు తర్వాతే పరీక్షలు నిర్వహించాలని, పరీక్షలను రీషెడ్యూలు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

TSPSC Group2 Exam: తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష మళ్లీ వాయిదాపడేలా కనిపిస్తోంది. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ తొలుత భావించింది. అయితే నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. నవంబరు 3 నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టడంతో 2024 జనవరి 6, 7 తేదీలకు పరీక్షలు రీషెడ్యూల్ అయ్యాయి. అయితే, టీఎస్‌పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో.. కొత్త బోర్డు ఏర్పాటు తర్వాతే పరీక్షలు నిర్వహించాలని, వచ్చే నెలలో జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూలు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు రీషెడ్యూల్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తదుపరి ఖాళీ తేదీలు, పరీక్ష కేంద్రాల అందుబాటు తదితర వివరాల మేరకు కమిషన్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది.

గ్రూప్-2లో 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది.  ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి  ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ షెడ్యూలు విడుదల చేసింది. అయితే గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది. 

గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

గ్రూప్-2 పోస్టుల వివరాలు...

మొత్తం ఖాళీల సంఖ్య: 783

1) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్. 

2) అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59 పోస్టులు

విభాగం: కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ డిపార్ట్‌మెంట్.

3) నాయబ్ తహసిల్దార్: 98 పోస్టులు

విభాగం: ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.

4) సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14 పోస్టులు

విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్.

5) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63 పోస్టులు

విభాగం: కంట్రోల్ ఆఫ్ కమిషనర్- కోఆపరేషన్ & రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్.

6) అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09 పోస్టులు

విభాగం: కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్.

7) మండల్ పంచాయత్ ఆఫీసర్: 126 పోస్టులు

విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.

8) ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97 పోస్టులు

విభాగం: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్.

9) అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38 పోస్టులు

 విభాగం: హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్.

10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165 పోస్టులు

 విభాగం: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.

11) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15 పోస్టులు

 విభాగం: లెజిస్లేటివ్ సెక్రటేరియట్.

12) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25 పోస్టులు

 విభాగం: ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్.

13) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07 పోస్టులు

 విభాగం: లా డిపార్ట్‌మెంట్.

14) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు

 విభాగం: తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్. 

15) డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11 పోస్టులు

 విభాగం: జువైనల్ కరెక్షనల్ సర్వీసెస్ & వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్‌మెంట్. 

16) అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

 విభాగం: బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 

17) అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09 పోస్టులు

 విభాగం: ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 

18) అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

 విభాగం: ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్. 

గ్రూప్-2 నోటిఫికేషన్, పరీక్ష స్వరూపం కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget