అన్వేషించండి

Group1 Notification: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, 563 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తులు

TSPSC: తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 563 పోస్టుల భర్తీకీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది.

TSPSC Group1 Notification: తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 563 పోస్టుల భర్తీకీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గత ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దుచేసిన ప్రభుత్వం తాజాగా గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

'గ్రూప్-1' నోటిఫికేషన్, పోస్టులు, అర్హతలు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

Group1 Notification: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, 563 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తులు

తెలంగాణలో గత ప్రభుత్వం 503 పోస్టులతో జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ (TSPSC) ఫిబ్రవరి 19న రద్దు చేసిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్ కావడంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే పాత ఖాళీలకు అదనంగా 60 పోస్టులను జతచేస్తూ మొత్తం 563 ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

రెండు సార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకూ ఒక్కసారి కూడా గ్రూప్ 1 పోస్టులు భర్తీ కాలేదు. రెండు సార్లు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, భర్తీ ప్రక్రియ మాత్రం సజావుగా సాగలేదు. మొదట 2022 ఏప్రిల్ లో 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కానీ ప్రిలిమ్స్ నిర్వహణ జరిగి, ఫలితాలు సైతం విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారని అంతా అనుకుంటున్న సమయంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందని ఆరోపణలు రావడంతో మొదట ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు చేశారు. దాంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ తొలిసారి రద్దయింది. గతంలో టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకుని, తాజాగా ఆ నోటిఫికేషన్‌ను రద్దుచేసి, కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.

అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించింది. తొలిసారి ఎగ్జామ్ నిర్వహించిన సమయంలో బయోమెట్రిక్ లాంటి విషయాలతో పాటు ఎంతో జాగ్రత్తగా ఎగ్జామ్ నిర్వహించారు. కానీ రెండోసారి నిర్వహించిన ఎగ్జామ్ లలో అవకతవకలు జరిగాయని, నిబంధనలు సరిగ్గా పాటించలేదని గ్రూప్ 1 (Group 1) ప్రిలిమినరీ మరోసారి రద్దు చేసింది టీఎస్‌పీఎస్సీ. విషయం హైకోర్టు వరకు వెళ్లడంతో ఎగ్జామ్ రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. కేసు విచారణలో ఉండగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఉద్యోగ పరీక్షల వయోపరిమితి పెంపు..
ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వయోపరిమితిని 44 సంవత్సరాల నుంచి 46 ఏళ్లకు పెంచింది. అయితే యూనిఫామ్ సర్వీసులకు మాత్రం మినహాయింపునిచ్చింది. వయోపరిమితి నుంచి సడలింపు ఇచ్చింది. ఈ మేరకు నిర్దేశించిన గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గ్రూప్-1 సహా చాలా పోటీ పరీక్షల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తోంది. అయతే ఐతే ప్రశ్నపత్రాల లీకేజీల వల్ల, పరీక్షల నిర్వహణ వాయిదా పడుతోంది. దాంతో వారి వయసు పెరిగిపోతోంది. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో.. వయసు పెరిగినా, అభ్యర్థులు, పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు వీలు కలగనుంది. 

టాప్ హెడ్ లైన్స్

NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Teachers Special TET: తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Embed widget