అన్వేషించండి

TSPSC: గ్రూప్‌-4 అభ్యర్థులకు అలర్ట్, సవరించిన ఖాళీల జాబితా వెల్లడి - జిల్లాలవారీగా కేటాయింపులివే!

TSPSC: మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నేపథ్యంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల ప్రకటన (నెం.19/2022)కు సవరణ ఖాళీల జాబితా (Revised Breakup)ను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది

TSPSC Group4 Details: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 పరీక్ష జూలై 2023 లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో.. మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నేపథ్యంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల ప్రకటన (నోటిఫికేషన్ నెం.19/2022)కు సవరణ ఖాళీల జాబితా (Revised Breakup)ను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-4 భర్తీలో రోస్టర్ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త రోస్టర్ విధానం, మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాలను అందుబాటులో ఉంచారు. గతంలో విధించిన రోస్టర్ విధానాన్ని ఉపసంహరించారు. జిల్లాలవారీగా కేటాయించిన ఉద్యోగ వివరాల జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు ఖాళీల వివరాల జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.

సవరించిన ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి..

TSPSC: గ్రూప్‌-4 అభ్యర్థులకు అలర్ట్, సవరించిన ఖాళీల జాబితా వెల్లడి - జిల్లాలవారీగా కేటాయింపులివే!

తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు (TSPSC Group 4 Results) ఫిబ్రవరి 9న విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెల్లడించింది. మొత్తం 7,26,837 మంది అభ్యర్థులతో  మెరిట్ జాబితాను టీఎస్‌పీస్సీ విడుదల చేసింది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెల్లడించనుంది. 

తెలంగాణలోమొత్తం 8,180 ఉద్యోగాల భర్తీకి జులై 1న రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష కోసం  రాష్ట్రవ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్‌-1కు 7,62,872 మంది, పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్ష నిర్వహించారు. 

గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 2న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రాథమికంగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అయితే డిసెంబరు 30న విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్‌లో మాత్రం 8039 పోస్టులనే భర్తీ చేయనున్నట్లు తెలిపింది. తర్వాత ఈ పోస్టులకు అదనంగా 141 పోస్టులను జతచేయండంతో.. మొత్తం పోస్టులు సంఖ్య 8,180 కి చేరినట్లయింది. 

తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 28న విడుదల చేసింది. ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 4 అవకాశం కల్పించింది. అనంతరం అక్టోబరు 6న ఫైనల్ కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేయగా.. పలు మార్పులు చోటుచేసుకున్నాయి.

గ్రూప్-4 పోస్టుల వివరాలు... 

మొత్తం ఖాళీల సంఖ్య: 8,180 పోస్టులు

1) జూనియర్ అకౌంటెంట్: 429 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు: ఆర్థికశాఖ - 191, మున్సిపల్ శాఖ - 238.

2) జూనియర్ అసిస్టెంట్: 5730 పోస్టులు 

విభాగాలవారీగా ఖాళీలు:

వ్యవసాయశాఖ-44 బీసీ సంక్షేమశాఖ-448 పౌరసరఫరాల శాఖ-72 అటవీశాఖ-23
వైద్యారోగ్యశాఖ-338 ఉన్నత విద్యాశాఖ-743 హోంశాఖ-133 నీటిపారుదల శాఖ-51
మైనార్టీ సంక్షేమశాఖ-191 పురపాలక శాఖ-601 పంచాయతీరాజ్-37 రెవెన్యూశాఖ-2,096
సెకండరీ విద్యాశాఖ-97 రవాణాశాఖ-20 గిరిజన సంక్షేమ శాఖ-221 మహిళా, శిశు సంక్షేమం-77
ఆర్థికశాఖ-46 కార్మికశాఖ-128 ఎస్సీ అభివృద్ధి శాఖ-474 యువజన సర్వీసులు-13

3) జూనియర్ ఆడిటర్: 18 పోస్టులు

విభాగం: డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్

4) వార్డ్ ఆఫీసర్: 1862 పోస్టులు

విభాగం: కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Australia Vs India 1st Test Scorecard: పెర్త్‌ టెస్టులో టీమిండియా బోల్తా - 150 పరుగులకే ఆలౌట్‌- టాప్ స్కోరర్‌గా నితీశ్‌
పెర్త్‌ టెస్టులో టీమిండియా బోల్తా - 150 పరుగులకే ఆలౌట్‌- టాప్ స్కోరర్‌గా నితీశ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Australia Vs India 1st Test Scorecard: పెర్త్‌ టెస్టులో టీమిండియా బోల్తా - 150 పరుగులకే ఆలౌట్‌- టాప్ స్కోరర్‌గా నితీశ్‌
పెర్త్‌ టెస్టులో టీమిండియా బోల్తా - 150 పరుగులకే ఆలౌట్‌- టాప్ స్కోరర్‌గా నితీశ్‌
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Zomato: జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
Adani Stocks: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్- పది మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్- పది మంది మావోయిస్టులు మృతి
Embed widget