అన్వేషించండి

TGPSC TPBO Results: టౌన్‌‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ ఫలితాలు విడుదల - ఎంతమంది ఎంపికయ్యారంటే?

TPBO Results: తెలంగాణలో టీపీబీవో పోస్టుల ఫలితాలను టీజీపీఎస్‌సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. మొత్తం 171 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

TPBO Results: తెలంగాణ మున్సిపల్‌ శాఖలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను టీజీపీఎస్సీ(TGPSC) జనవరి 8న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను అందుబాటులో ఉంచింది. మొత్తం 171 మంది అభ్యర్థులతో జాబితాను టీజీపీఎస్సీ రూపొందించింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను జోన్లవారీగా హాల్‌టికెట్ నెంబర్లతో కమిషన్ ప్రకటించింది. రాష్ట్రంలో 'టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ (టీపీబీవో) పరీక్ష జులై 8న నిర్వహించిన సంగతి తెలిసిందే.  ఈ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీని టీఎస్‌ఎస్‌సీ జులై 12న విడుదల చేసింది. ప్రాథమిక కీపై జులై 13 నుంచి జులై 15న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించింది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 21, 24; డిసెంబర్‌ 5, 6, 7, 23 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించింది. తాజాగా ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది.

టీపీబీవో ఫలితాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి గతేడాది సెప్టెంబరు 7న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. మొదట జనవరిలోనే రాతపరీక్ష నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. కుదరకపోవడంతో మార్చి 12న నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పరీక్ష మరోసారి వాయిదాపడింది. దీంతో జులై 8న పరీక్ష టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.32,810 - రూ.96,890 జీతంగా ఇస్తారు.

TGPSC TPBO Results: టౌన్‌‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ ఫలితాలు విడుదల - ఎంతమంది ఎంపికయ్యారంటే?

తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ 
తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్ధులకు గుడ్ న్యూస్. మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ  ప్రకటించింది. దాంతో పాటు మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పింది. అధికారులు ఇచ్చిన ఖాళీల వివరాలను తనిఖీ చేసి  నోటిఫికేషన్ జారీపై ఏప్రిల్ లో కసరత్తు చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. దాంతో పాటు త్వరలోనే గ్రూప్ - 1,2,3 ఫలితాలు కూడా విడుదల చేస్తామని చెప్పింది.

ఏప్రిల్ తర్వాతే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాల ఆధారంగా నోటీఫికేషన్స్ (Notifications)ను జారీ చేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేషం తెలిపారు. మార్చి 31, 2025లోపు పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్స్ ఫలితాలిస్తామని.. ఏప్రిల్ 2025 తర్వాతే నోటిఫికేషన్స్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ లో భర్తీపై స్టడీ చేసి.. మే 1 నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. అంతకంటే ముందు ఖాళీల భర్తీపై ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. ఆ తర్వాత వెంటనే పరీక్షలు నిర్వహించి.. ఏ పరీక్ష ఫలితాలు పూర్తయితే వాటిని వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పారు. గతంలో మాదిరిగా ఫలితాలు, భర్తీ విషయంలో ఆలస్యం జరగదన్నారు. నోటిఫికేషన్స్ ఇచ్చిన 6 నుంచి 8 నెలల్లో ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
APPSC Group 2 Jobs: 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
TGPSC AEE ఎగ్జామ్ వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
TGPSC AEE ఎగ్జామ్ వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget