TS Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, సమాచార శాఖలో 88 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ మేరకు ఆ శాఖలో 88 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల భర్తీకీ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1384ను విడుదల చేసింది. ఆయా పోస్టులను పొరుగు సేవల పద్దతిలో నియమించాలని నిర్ణయించింది. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది.
తెలంగాణలోని 33 జిల్లాలకు గాను ప్రతి జిల్లాకు ఒక సహాయ పౌర సంబంధాల అధికారి, ఇద్దరు పబ్లిసిటీ అసిస్టెంట్లను నియమించాలని నిర్ణయించినట్లు ఆర్థికశాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. వీటితోపాటు హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో ఒక పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సమాచార పౌర సంబంధాల శాఖలో పోస్టులు భర్తీ చేయడం ఇదే తొలిసారి.
ALSO READ:
తెలంగాణ జెన్‌కోలో 60 కెమిస్ట్ పోస్టులు, ఎంపికైతే నెలకు రూ.1.31 లక్ష వరకు జీతం
తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(TSGENCO)లో కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(TSGENCO)లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 339 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 94 పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 245 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్', దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లు/కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు బెంగళూరు, ఘజియాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్‌ద్వారా, నవీ ముంబయిలో విధిగా పనిచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..