అన్వేషించండి

Court Jobs: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్, కోర్టుల్లో 4600 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం!

తెలంగాణలోని వివిధ న్యాయస్థానాల్లో 4600కు పైగా సిబ్బంది నియామకం కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు డిసెంబరు 12న జరిగిన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

తెలంగాణ ఉద్యోగాల నోటిఫికేషన్లు వరుసగా వెలువడుతున్నాయి. మరో వైపు కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి ఆమోదాలు లభిస్తున్నాయి. తాజాగా, మరో 4600కుపై ఉద్యోగాలకు రాష్ట కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి సోమవారం (డిసెంబరు 12) జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో న్యాయస్థానాల్లో సిబ్బంది నియామకాల కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు తాజాగా అనుమతి లభించినట్లయింది. ఈ నియామకాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది.

తెలంగాణలోని వివిధ న్యాయస్థానాల్లో 4600కు పైగా సిబ్బంది నియామకం కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు డిసెంబరు 12న జరిగిన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే తెలంగాణ పోలీసు, బీసీ సంక్షేమ, రోడ్లు భవనాల శాఖల్లో కలిపి మొత్తం 7,029 కొత్త నియామకాలకు రాష్ట్ర క్యాబినెట్‌ అనుమతి తెల్పిన విషయం తెలిసిందే. డిసెంబరు 12న మరో 4,200ల పోస్టులకు అనుమతి లభించడంతో.. రానున్న రోజుల్లో మొత్తం 11 వేలకు పైగా ఉద్యోగాలను నియామక ప్రక్రియ ప్రారంభంకానుంది.

డిసెంబరు 10న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించిన పోస్టులు:

3,966 పోలీసు ఉద్యోగాలు..
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని మంత్రివ‌ర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను కేబినెట్‌ ఆదేశించింది.

బీసీ గురుకులాల్లో 2,591 పోస్టులు.. 
తెలంగాణ మంత్రివ‌ర్గం మ‌హాత్మా జ్యోతి బాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థ‌ల‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బీసీ గురుకులాల్లోని ప‌లు విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి ఆమోదం తెలిపింది. మొత్తం 2,591 నూత‌న ఉద్యోగాల నియామ‌కాల‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన 4 జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాలలల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విభాగాల్లో, అవసరమైన మేరకు ఈ నూతన నియామకాలను చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది.

ఆర్ & బీ విభాగంలో 472 పోస్టులు..
రోడ్లు భవనాల శాఖలో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బీ శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది. ఇందులో… కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్ పోస్టులు, 12 సూపరిండెంట్ ఇంజనీర్ పోస్టులు, 13 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, 102 డీఈఈ పోస్టులు, 163 అసిస్టెంట్ ఈఈ పోస్టులు, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి. 

Also Read: 

1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా!
తెలంగాణలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు మల్టీ జోన్-1 పరిధిలో 724 పోస్టులు, మల్టీ జోన్-2 పరిధిలో 668 పోస్టులు ఉన్నాయి. డిసెంబరు 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్  విడుదల చేసింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో పోస్టుల వివరాలు అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచీలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
AP TET Results 2024: అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
Crime News: శృంగారం అయిపోగానే తల కత్తిరించి తీసుకుపోయింది -  ఇది దృశ్యం కాదు అదృశ్యం !
శృంగారం అయిపోగానే తల కత్తిరించి తీసుకుపోయింది - ఇది దృశ్యం కాదు అదృశ్యం !
Prabhas: బాలీవుడ్ హీరో నో చెబితే ప్రభాస్ 'ఎస్' అన్నారా? ఆ నెగిటివ్ షెడ్ రోల్ చేస్తారా? 
బాలీవుడ్ హీరో నో చెబితే ప్రభాస్ 'ఎస్' అన్నారా? ఆ నెగిటివ్ షెడ్ రోల్ చేస్తారా? 
Kiran Abbavaram: చెన్నైలో తెలుగు షోలకు స్క్రీన్లు ఇవ్వట్లేదు... తమిళ ఇండస్ట్రీ వైఖరిపై కిరణ్‌ అబ్బవరం ఆవేదన
చెన్నైలో తెలుగు షోలకు స్క్రీన్లు ఇవ్వట్లేదు... తమిళ ఇండస్ట్రీ వైఖరిపై కిరణ్‌ అబ్బవరం ఆవేదన
Embed widget