Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్, ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు - పిటిషన్లు కొట్టివేత
TGPSC: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల విడుదలకు లైన్ క్లియరైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

TGPSC Group1 Mains: తెలంగాణలో గ్రూప్-1 ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివిధ రకాల అభ్యంతరాలతో అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఫిబ్రవరి 3న విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వ వాదనతో అంగీకరించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్లను కొట్టివేయడంతో.. ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో టీజీపీఎస్సీ త్వరలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేయనుంది.
రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలకు సంబంధించి పలువురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి గ్రూప్-1 నియామకాలు ఇవే కావడం విశేషం.
తెలంగాణలో అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూపు-1 మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మెుత్తం 563 పోస్టులకు 31,403 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. అయితే జీవో 29ను రద్దు చేయాలని, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. రాజకీయ పార్టీలు సైతం వారికి మద్దతు తెలపడంతో ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. హైదరాబాద్ నగరంలో లాఠీ ఛార్జ్ సైతం జరిగింది. పెద్దఎత్తున నిరసన తెలిపిన అభ్యర్థులు ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. పరీక్షలు మెుదలైన రోజే కేసు విచారణకు రావడంతో పరీక్షలు నిలిపివేసేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. దీంతో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. అయితే నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం అభ్యర్థుల పిటిషన్లు కొట్టివేసింది.
ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 2 సంవత్సరాలకు పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో గరిష్ఠవయోపరిమితి 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు చేరింది. అయితే నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తించనున్నాయి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీ్స్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ-బీసీ-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.
వివరాలు..
* గ్రూప్-1 పోస్టులు
ఖాళీల సంఖ్య: 563
క్ర.సం | పోస్టులు | ఖాళీల సంఖ్య |
1. | డిప్యూటీ కలెక్టర్ | 45 |
2. | డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) | 115 |
3. | కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ | 48 |
4. | రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ | 04 |
5. | డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ | 07 |
6. | డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ | 06 |
7. | డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) | 05 |
8. | అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ | 08 |
9. | అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ | 30 |
10. | మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2) | 41 |
11. | డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/ డిస్ట్రిక్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ |
03 |
12. | డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్/ అసిస్టెంట్ డైరెక్టర్ (డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్) |
05 |
13. | డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ | 02 |
14. | డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ | 05 |
15. | అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రటరీ& ట్రెజరర్ గ్రేడ్-2 | 20 |
16. | అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ అసిస్టెంట్ లెక్చరర్ (ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్) | 38 |
17. | అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ | 41 |
18. | మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ | 140 |
మొత్తం ఖాళీలు | 563 |
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

