అన్వేషించండి

SSC Delhi Police: పోలీస్ కానిస్టేబుల్ రాతరీక్ష ఫలితాలు విడుదల, తర్వాతి దశకు 85,867 మంది ఎంపిక

SSC: ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ నియామక పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిసెంబరు 31న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.

Delhi Police Constable Results: ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(Constable Executive Results) నియామక పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) డిసెంబరు 31న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. మొత్తం 85,867 మంది అభ్యర్థులు తదుపరి నిర్వహించే ఫిజికల్ ఈవెంట్లు (PE, MT), ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికయ్యారు. ఇందులో 55,989 మంది పురుషులు; 29,878 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ పరీక్షకు సంబంధించి ఫలితాలను తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది.

మొత్తం రెండు జాబితాల్లో ఫలితాలను ప్రకటించింది. జాబితా-1లో రాతపరీక్షలో అర్హత సాధించిన పురుష అభ్యర్థుల వివరాలు, జాబితా-2లో రాతపరీక్షలో అర్హత సాధించిన మహిళా అభ్యర్థుల వివరాలను పొందుపరిచింది. పరీక్షలో అర్హత మార్కులను యూఆర్-35 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్-30 మార్కులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు - 25 మార్కులుగా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 3 వరకు పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 

ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)-(పురుషులు) ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)-(మహిళలు) ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి సెప్టెంబరు 1న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 7547 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న పురుష, మహిళా అభ్యర్థులు సెప్టెంబరు 1 నుంచి సెప్టెంబరు 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు నవంబరు 14 నుంచి డిసెంబరు 3 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించినవారికి ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించి తుది ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.21,700-రూ.69,100 (పే లెవల్-3) కింద జీతభత్యాలు చెల్లిస్తారు.

పోస్టుల వివరాలు..

1) కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- పురుషులు: 5,056 పోస్టులు 

పోస్టుల కేటాయింపు: జనరల్- 3053, ఈడబ్ల్యూఎస్‌- 542, ఓబీసీ- 287, ఎస్సీ- 872, ఎస్టీ- 302.

2)  కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- మహిళలు: 2,491 పోస్టులు 

పోస్టుల కేటాయింపు: జనరల్- 1502, ఈడబ్ల్యూఎస్‌- 268, ఓబీసీ- 142, ఎస్సీ- 429, ఎస్టీ- 150

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు వ్యాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌(ఎల్‌ఎంవీ) కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలలి. అభ్యర్థులు 02.07.1998 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, స్పోర్ట్స్ పర్సన్స్‌కు 5 సంవత్సరాలు, స్పోర్ట్స్ పర్సన్స్‌(ఎస్సీ, ఎస్టీ)లకు 10 సంవత్సరాలు, ఢిల్లీ పోలీసు డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు- 40 నుంచి 45 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఎక్స్-సర్వీస్‌మెన్, ఇతర అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోసడలింపు వర్తిస్తుంది.   

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌/ కరెంట్‌ అఫైర్స్‌-50 ప్రశ్నలు-50 మార్కులు, రీజనింగ్‌ 25 ప్రశ్నలు-25 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ-15 ప్రశ్నలు-15 మార్కులు, కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, ఎంఎస్‌ వర్డ్‌, కమ్యూనికేషన్‌, ఇంటర్‌నెట్‌, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వెబ్‌ బ్రౌజింగ్‌ తదితర అంశాల నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

జీతభత్యాలు: రూ.21,700 - రూ.69,100.

నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Embed widget