అన్వేషించండి

SSC Delhi Police Final key: ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఫైనల్ ఆన్సర్ 'కీ' విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిసెంబరు 6న విడుదల చేసింది.

Delhi Police Constable Answer Key 2023: ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(Constable Executive) పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ(Answer Key)ని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చూసుకోవచ్చు. డిసెంబరు 6న విడుదల చేసిన ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. 

ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెప్టెంబరు 1న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 7547 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 3 వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం రాతపరీక్ష నిర్వహించింది.

ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ నియామక పరీక్ష ఫైనల్ కీ కోసం క్లిక్‌ చేయండి..

ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూలు విడుదల..
ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి సంబంధించిన ఫిజికల్ ఈవెంట్ల (PET, PMT) షెడ్యూలు విడుదలైంది. ఈ మేరకు అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్‌ జనవరి 7న ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జనవరి 13 నుంచి 20వ తేదీ వరకు ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్(పీఎంటీ)లను నిర్వహించనున్నారు. ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు త్వరలోనే అందుబాటులో రానున్నాయి. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(Constable Executive Results) నియామక పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) డిసెంబరు 31న విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 85,867 మంది అభ్యర్థులు తదుపరి నిర్వహించే ఫిజికల్ ఈవెంట్లు (PE, MT), ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికయ్యారు. ఇందులో 55,989 మంది పురుషులు; 29,878 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. పరీక్షలో అర్హత మార్కులను యూఆర్-35 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్-30 మార్కులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు - 25 మార్కులుగా నిర్ణయించారు. 

మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌/ కరెంట్‌ అఫైర్స్‌-50 ప్రశ్నలు-50 మార్కులు, రీజనింగ్‌ 25 ప్రశ్నలు-25 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ-15 ప్రశ్నలు-15 మార్కులు, కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, ఎంఎస్‌ వర్డ్‌, కమ్యూనికేషన్‌, ఇంటర్‌నెట్‌, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వెబ్‌ బ్రౌజింగ్‌ తదితర అంశాల నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు పే లెవల్-3 (రూ.21,700-రూ.69,100) ప్రకారం జీత భత్యాలు ఉంటాయి.

పోస్టుల వివరాలు..

* కానిస్టేబుల్ పోస్టులు

1) కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- పురుషులు: 5,056 పోస్టులు 

పోస్టుల కేటాయింపు: జనరల్- 3053, ఈడబ్ల్యూఎస్‌- 542, ఓబీసీ- 287, ఎస్సీ- 872, ఎస్టీ- 302.

2)  కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- మహిళలు: 2,491 పోస్టులు 

పోస్టుల కేటాయింపు: జనరల్- 1502, ఈడబ్ల్యూఎస్‌- 268, ఓబీసీ- 142, ఎస్సీ- 429, ఎస్టీ- 150.

Notification

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget