SAI Recruitment: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పెర్ఫామెన్స్ అనలిస్ట్ ఖాళీలు,వివరాలు ఇలా!
దేశవ్యాప్తంగా ఉన్న సాయ్ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన పెర్ఫామెన్స్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు. మొత్తం 93 పెర్ఫామెన్స్ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
న్యూదిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) దేశవ్యాప్తంగా ఉన్న సాయ్ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన పెర్ఫామెన్స్ అనలిస్ట్(ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంథ్&కండిషనింగ్ ఎక్స్పర్ట్, ఫిజియాలజిస్ట్, సైకాలజిస్ట్, బయోమెకానిక్స్, న్యూట్రీషనిస్ట్, ఆంత్రోపోమెట్రిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు. మొత్తం 93 పెర్ఫామెన్స్ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబధిత సబ్జెక్టులలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్ధులు అర్హులు. అభ్యర్ధులను పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.సరైన అర్హత, ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
✦పెర్ఫామెన్స్అనలిస్ట్
మొత్తం ఖాళీల సంఖ్య: 93
విభాగాల వారీగ ఖాళీలు:
* ఫిజియోథెరపిస్ట్: 20
* స్ట్రెంథ్&కండిషనింగ్ ఎక్స్పర్ట్: 20
* ఫిజియాలజిస్ట్: 10
* సైకాలజిస్ట్: 10
* బయోమెకానిక్స్: 10
* న్యూట్రీషనిస్ట్: 10
* ఆంత్రోపోమెట్రిస్ట్: 13
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ(ఫిజియోథెరపీ/ స్పోర్ట్స్ ఎక్సర్సైజ్ సైన్స్/ స్పోర్ట్స్ సైన్స్/ స్పోర్ట్స్ కోచింగ్ ఎక్సర్సైజ్ సైన్స్/ ఫిజికల్ ఎడ్యుకేషన్/ మెడికల్/ హ్యూమన్/ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ/ లైఫ్ సైన్స్/ బయోలాజికల్ సైన్సెస్/ సైకాలజీ/ బయోమెకానిక్స్/ ఫుడ్ సైన్స్/ ఫుడ్ సైన్స్/ న్యూట్రిషన్/ ఆంత్రోపాలజీ) ఉత్తీర్ణత.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.60,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అదనపు విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 12.9.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.09.2022.
Also Read :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5008 క్లర్క్ ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నుంచి మరో ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా క్లరికల్ కేడర్ కింద 5,008 జూనియర్ అసోసియేట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 225 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 7 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు సెప్టెంబరు 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, అర్హత, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 714 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు, అర్హతలివే!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(ఎస్‌సీఓ) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, అర్హత, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఈవో పోస్టుల దరఖాస్తు ప్రక్రియ షురూ, మహిళలు మాత్రమే అర్హులు!
తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో 181 విస్తరణాధికారుల (సూపర్‌వైజర్) గ్రేడ్-1 ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబరు 8న ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. సరైన అర్హతలు ఉన్న మహిళా అభ్యర్థులు సెప్టెంబరు 29న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక లింక్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు మొదటగా తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ నెంబరు, పుట్టిన తేది వివరాలు నమోదుచేసి మొబైల్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నిర్దారించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...