అన్వేషించండి

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

ఇప్పటికే 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌‌తోపాటు పలు పేపర్ల లీకేజీకి పాల్పడిన వీరు 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్‌ లీకేజీకి కూడా ప్లాన్ చేసినట్లు సిట్‌ విచారణలో వెల్లడైంది.

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, ఢాక్యానాయక్‌, రాజేందర్‌ను మార్చి 26న మూడురోజుల కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీరిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌‌తోపాటు పలు పేపర్ల లీకేజీకి పాల్పడిన వీరు 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్‌ లీకేజీకి కూడా ప్లాన్ చేసినట్లు సిట్‌ విచారణలో వెల్లడైంది. గ్రూప్-1లో 100కు పైగా మార్కులు సాధించిన 121 మంది యువతీ, యువకుల్లో ఇప్పటివరకూ 60 మందిని విచారించారు. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్‌కు సోమవారం సిట్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

ఏఈ ప్రశ్నపత్రంతో సంపాదించాలని ప్లాన్‌..
గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేసి సక్సెస్‌ అయిన ప్రవీణ్‌, రాజశేఖర్‌ ఏఈ ప్రశ్నపత్రం ద్వారా బాగా డబ్బులు సంపాదించాలని స్కెచ్‌ వేశారు. ఏఈ ప్రశ్నపత్రాన్ని రేణుకకు అప్పగించి రూ.10 లక్షలు తీసుకున్నారు. ‘మేము గ్రూప్స్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ప్రిలిమ్స్‌ లీక్‌ చేసి సక్సెస్‌ అయ్యాం. మెయిన్స్‌పై కూడా ఎంతో నమ్మకం ఉంది. ఆ పేపర్‌ను కూడా సంపాదిస్తాం. మాతోపాటు మా వాళ్లు గ్రూప్స్‌ కొడితే ఉన్నత పదవుల్లో ఉంటారు. మెయిన్స్‌ రాయాల్సి ఉన్నదనే విషయం గుర్తించుకో. ఎవరికైనా తెలిస్తే అందరం దొరికిపోతాం. ఉన్న ఉద్యోగాలు ఊడుతాయ్‌..’ అని రేణుకకు జాగ్రత్తలు చెప్పినట్టు తెలిసింది. ఆమె ప్రవీణ్‌, రాజశేఖర్‌కు ఇచ్చిన మాట ప్రకారం నీలేశ్‌, గోపాల్‌కు పేపర్‌ను విక్రయించి, వారిద్దరిని మహబూబ్‌నగర్‌లో పరీక్షకు సిద్ధంచేసి పరీక్ష హాల్‌కు తీసుకొచ్చింది.

డైరీ నుంచే పాస్‌వర్డ్‌ కొట్టేశారు..
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ పోలీసులకు కీలక ఆధారం లభించింది. రెండోసారి పోలీసు కస్టడీలోకి తీసుకొన్న ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, డాక్యానాయక్, రాజేంద్రనాయక్‌ల నుంచి సోమవారం కీలక వివరాలు రాబట్టినట్టు సమాచారం. కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ శంకరలక్ష్మి డైరీ నుంచి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు సేకరించినట్లు తాజాగా నిర్ధారణకు వచ్చారు. ఆమె డైరీ నుంచి పాస్‌వర్డ్ కొట్టేసి గతేడాది అక్టోబరు 1న ఆమె కంప్యూటర్‌లోని ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసినట్టు రాజశేఖర్ రెడ్డి అంగీకరించినట్టు సమాచారం. కొన్ని ప్రశ్నపత్రాలను ప్రవీణ్‌కుమార్ పెన్‌డ్రైవ్‌లోకి మార్చినట్టు వెల్లడించినట్టు తెలుస్తోంది. మరోవైపు, బడంగ్ పేట్‌లోని ప్రవీణ్ కుమార్ నివాసంలో తనిఖీ చేసిన సిట్ పోలీసులు రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

15కు చేరిన అరెస్టులు..
ఏఈ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో మార్చి 27న మరో వ్యక్తిని సిట్‌ అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసినవారి సంఖ్య 15కు చేరింది. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సల్కర్ పేట గ్రామానికి చెందిన తిరుపతయ్య ఉపాధి హామీ పథకం పర్యవేక్షకుడిగా పనిచేస్తున్నాడు. ఒకే మండలం, విభాగంలో పనిచేస్తున్న డాక్యానాయక్‌తో అతనికి పాత పరిచయాలున్నాయి. తన వద్ద ఏఈ ప్రశ్నపత్రం ఉందని తిరుపతయ్యకు డాక్యానాయక్ చెప్పాడు. దీన్ని సొమ్ము చేసుకునేందుకు రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం నేరెళ్లపల్లికి చెందిన రాజేందర్ కుమార్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని రూ.5 లక్షలు తీసుకొని ప్రశ్నపత్రం చేతికిచ్చేందుకు తిరుపతయ్య దళారీగా వ్యవహరించాడని నిర్ధారణ కావటంతో అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా.. బడంగ్‌పేట్‌, మల్లికార్జున కాలనీలో ఉన్న ప్రవీణ్‌కుమార్‌ ఇంట్లో మార్చి 27న సిట్ అధికారులు సోదాలు చేయగా.. రూ.4 లక్షల నగదు లభించింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో వంద మార్కులు దాటిన 121 మందిని సిట్‌ గుర్తించి 60 మందిని విచారించింది.

పేపర్‌ లీకేజీ ఘటనపై సిట్‌ అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు జరుగుతోంది. రెండోసారి కస్టడీలోకి తీసుకున్న నిందితుల విచారణ మంగళవారం (మార్చి 28) ముగియనుంది. లీకైన ప్రశ్నపత్రంతో గ్రూప్‌-1 పరీక్ష రాసి, అరెస్టయిన సురేశ్‌, రమేశ్‌, షమీమ్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ సిట్‌ న్యాయస్థానాన్ని కోరింది. దీనిపై మంగళవారం తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. ఏఈ ప్రశ్నపత్రం లీకేజీలో అరెస్టయి న ప్రశాంత్‌, రాజేందర్‌, తిరుపతయ్యనూ కస్టడీలోకి తీసుకోనున్నారు. నిందితులు, పరీక్ష రాసిన వారికి ఉన్న సంబంధాలను గుర్తించడానికి కాంటాక్టులు మ్యాపింగ్‌చేస్తూ ఆయా లింక్‌లను వెలుగులోకి తెస్తున్నారు.

Also Read:

వాట్సాప్ ద్వారానే 'గ్రూప్-1' ప్రశ్నపత్రాలు చేరవేశారు! కమిషన్ కార్యాలయం నుంచే మొత్తం వ్యవహారం!
టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష పేపర్లు వాట్సాప్ ద్వారానే చేతులు మారినట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో నిందితులు పకడ్బందీగా ప్రశ్నపత్రాలను పంచుకొని లాభపడే ప్రయత్నం చేశారని అధికారులు గుర్తించారు. టీఎస్‌పీఎస్సీ కమిషన్ కార్యాలయం కేంద్రంగానే మొత్తం వ్యవహారం కొనసాగించినట్లు అంచనాకు వచ్చారు. ఈ కేసులో తాజాగా అరెస్టయిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, నలగొప్పుల సురేశ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ దామెర రమేష్ కుమార్ రిమాండ్ రిపోర్టులో ఈమేరకు పలు అంశాలను అధికారులు ప్రస్తావించారు. మార్చి 22న దర్యాప్తు అధికారులు, ఈ ముగ్గురి నివాసాల్లో తనిఖీలు నిర్వహించి ఒక ల్యాప్‌టాప్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారికి వాట్సాప్ ద్వారానే ప్రశ్నపత్రాలు చేరినట్టు మొబైల్ ఫోన్ల విశ్లేషణ ద్వారా నిర్ధారణకు వచ్చారు. ఇక ఈ కేసులో ఏ-12 రమేష్ కుమార్ ఇంట్లో లభించిన ల్యాప్‌టాప్ నుంచి కీలక సమాచారం సేకరించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 

దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రోజుకోమలుపు తిరుగుతోంది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు.. కొత్త పాత్రధారులు పుట్లుకొస్తున్నారు. ఇప్పుడు ఏకంగా గ్రూప్-1 పేపర్ దేశం దాటినట్లుగా దర్యాప్తు అధికారులు ​గుర్తించారు. పేపర్‌‌ లీకేజీలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌‌‌‌రెడ్డి.. న్యూజిలాండ్​లో ఉంటున్న అతడి బావ ప్రశాంత్‌‌రెడ్డికి వాట్సాప్‌‌లో పేపర్​షేర్‌‌‌‌ చేసినట్లు విచారణలో తేల్చింది. దీంతో అతడికి నోటీసులు జారీ చేసింది. ప్రశాంత్‌‌రెడ్డి పరీక్ష రాసి తిరిగి న్యూజిలాండ్‌‌ వెళ్లిపోవడంతో వాట్సాప్‌‌, మెయిల్‌‌ ద్వారా సమాచారం అందించింది. ఐతే సిట్ నోటీసులకు ప్రశాంత్‌‌ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది. దీంతో లుకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటీసులు ఇష్యూ చేసేందుకు సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు చర్యలు ప్రారంభించారు
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Police Warning: సంధ్య థియేటర్ ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
Vajpayee 100th Birth Anniversary: రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Yanam Jesus statue: యానాంలో మౌంట్ ఆఫ్ మెర్సీ జీస‌స్ స్టాట్యూను చూశారా..?
యానాంలో మౌంట్ ఆఫ్ మెర్సీ జీస‌స్ స్టాట్యూను చూశారా..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP DesamPV Sindhu Wedding Photos | పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోలు | ABP DesamAllu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP DesamICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Police Warning: సంధ్య థియేటర్ ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
Vajpayee 100th Birth Anniversary: రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Yanam Jesus statue: యానాంలో మౌంట్ ఆఫ్ మెర్సీ జీస‌స్ స్టాట్యూను చూశారా..?
యానాంలో మౌంట్ ఆఫ్ మెర్సీ జీస‌స్ స్టాట్యూను చూశారా..?
Ind Vs Aus Test Series: జట్టును ప్రకటించిన ఆసీస్, జట్టులో రెండు మార్పులు.. ఫిట్ గా మారి వచ్చిన స్టార్ బ్యాటర్
జట్టును ప్రకటించిన ఆసీస్, జట్టులో రెండు మార్పులు.. ఫిట్ గా మారి వచ్చిన స్టార్ బ్యాటర్
Pranitha Subhash: సెకెండ్ బేబీ ఫొటోస్ షేర్ చేసిన ప్రణీత.. ఇద్దరు పిల్లల తల్లి ఇంత హాట్ గా!
సెకెండ్ బేబీ ఫొటోస్ షేర్ చేసిన ప్రణీత.. ఇద్దరు పిల్లల తల్లి ఇంత హాట్ గా!
SIM Swap Scam: వ్యాపారి నుంచి రూ.7.5 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు - సిమ్ స్వాప్ స్కామ్ నుంచి జాగ్రత్త గురూ
వ్యాపారి నుంచి రూ.7.5 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు - సిమ్ స్వాప్ స్కామ్ నుంచి జాగ్రత్త గురూ
CM Chandrababu: దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి,  ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి, ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
Embed widget