అన్వేషించండి

SBI Clerk Result: ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ఎస్‍బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ 2022 ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 3న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.

ఎస్‍బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ 2022 ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 3న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేది వివరాలు నమోదుచేసి ఫలితాలు పొందవచ్చు. నవంబరు 12న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 15న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

SBI Clerk Prelims ఫలితాలు చూసుకోండిలా..

➥ అభ్యర్థులు ముందుగా బ్రౌజర్‌లో ఎస్‍బీఐ.కో.ఇన్ (sbi.co.in) వెబ్‍సైట్‍కు వెళ్లాలి.

అనంతరం వెబ్‍సైట్ హోమ్ పేజీలో కెరీర్స్ (Careers) ట్యాబ్‍పై క్లిక్ చేయాలి.

➥ అక్కడ ఎస్‍బీఐ క్లర్క్ ప్రిలిమినరీ రిజల్ట్స్ 2022 అనే లింక్ కనిపిస్తుంది.

ఆ లింక్‍పై క్లిక్ చేసి.. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్/ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.

➥  లాగిన్ వివరాలు ఎంటర్ చేశాక.. రిజల్ట్స్ స్క్రీన్‍పై కనిపిస్తాయి.

భవిష్యత్తు అవసరాల కోసం ఆ రిజల్ట్స్ ను డౌన్‍లోడ్ చేసుకొని.. ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో 5,008 ఖాళీల భర్తీ కోసం గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 12న క్లరికల్ క్యాడర్‌లోని జూనియర్ అసొసియేట్ (కస్టమర్ సపోర్ట్& సేల్స్) పోస్టుల కోసం ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. తాజాగా పరీక్ష ఫలితాలను ఎస్‍బీఐ వెల్లడించింది. 

పరీక్ష విధానం: 

I. ప్రిలిమినరీ పరీక్ష:  
మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్  లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులకు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులకు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట. పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రధాన పరీక్షకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. 
SBI Clerk Result: ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
II. మెయిన్ ఎగ్జామ్:
మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష ఉంటుంది. మొత్తం 190  ప్రశ్నలు ఉంటాయి. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్  50 ప్రశ్నలు-50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు; క్వాంటిటేటివ్  అప్టిట్యూడ్  50 ప్రశ్నలు-50 మార్కులు; రీజనింగ్  ఎబిలిటీ అండ్ కంప్యూటర్  అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు.

SBI Clerk Result: ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:  అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగరం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్.  

SBI Clerks 2022 నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

Also Read: 

సీఆర్‌పీఎఫ్‌లో 1458 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఈ అర్హతలుండాలి!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టులు, 1315 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉన్న యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భ ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 4న ప్రారంభమై 25న ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

వరంగల్‌ 'నిట్'లో 100 టీచింగ్ ఫ్యాకల్టీలు, పోస్టుల వివరాలు ఇలా! అర్హతలివే!
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 27న ప్రారంభంకాగా.. జనవరి 25 వరకు కొనసాగనుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget