RBI Jobs: ఆర్‌బీఐలో కన్సల్టెంట్స్, సబ్జెక్ట్ స్పెషలిస్ట్, అనలిస్ట్ పోస్టులు - వివరాలు ఇలా!
ఈ పోస్టుల భర్తీకి జూన్ 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జులై 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రిలిమినరీ స్క్రీనింగ్/ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు చేపడతారు.
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన లేటరల్ రిక్రూట్‌మెంట్ విధానంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా పలు విభాగాల్లో కన్సల్టెంట్స్, సబ్జెక్ట్ స్పెషలిస్ట్స్, ఎనలిస్ట్ భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జులై 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రిలిమినరీ స్క్రీనింగ్/ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు చేపడతారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 65
* ఆర్‌బీఐ పోస్టులు: 61
1. డేటా సైంటిస్ట్: 03
2. డేటా ఇంజినీర్: 01
3. ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్: 10
4. ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 08
5. ఐటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్: 06
6. నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్: 03
7. ఎకనామిస్ట్ (మాక్రో-ఎకనామిక్ మోడలింగ్): 01
8. డేటా అనలిస్ట్ (అప్లైడ్ మ్యాథమెటిక్స్): 01
9. డేటా అనలిస్ట్ (అప్లైడ్ ఎకనామెట్రిక్స్): 02
10. డేటా అనలిస్ట్ (టీఏబీఎం/ హెచ్‌ఏఎన్‌కే మోడల్స్): 02
11. అనలిస్ట్ (క్రెడిట్ రిస్క్): 01
12. అనలిస్ట్ (మార్కెట్ రిస్క్): 01
13. అనలిస్ట్ (లిక్విడిటీ రిస్క్): 01
14. సీనియర్ అనలిస్ట్ (క్రెడిట్ రిస్క్): 01
15. సీనియర్ అనలిస్ట్ (మార్కెట్ రిస్క్): 01
16. సీనియర్ అనలిస్ట్ (లిక్విడిటీ రిస్క్): 01
17. అనలిస్ట్ (స్ట్రెస్ టెస్టింగ్): 02
18. అనలిస్ట్ (ఫోరెక్స్ & ట్రేడ్): 03
19. ఐటీ-సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్: 08
20. కన్సల్టెంట్-అకౌంటింగ్: 03
21. ఐటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్: 03
* డీఐసీజీసీ పోస్టులు: 04
1. కన్సల్టెంట్-అకౌంటింగ్: 01
2. బిజినెస్ అనలిస్ట్: 01
3. లీగల్ కన్సల్టెంట్: 01
4. ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 01
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, పీజీపీఎం/ పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగాల్లో కనీసం 4 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. సీనియర్ లెవల్ పోస్టులకు కనీసం 7 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: పోస్టులవారీగా వయోపరిమితి నిర్ణయించారు. కొన్ని పోస్టులకు 25-35, కొన్ని పోస్టులకు 27-36, కొన్ని పోస్టులకు 26-40, కొన్ని పోస్టులకు 23-35, మరికొన్ని పోస్టులకు 30-40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధన ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఫీజుకు 18% జీఎస్‌టీ అదనం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్/ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.06.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.07.2023.
ALSO READ:
తెలంగాణ కేజీబీవీల్లో 1,241 ఉద్యోగాలు, దరఖాస్తులు ఎప్పుడంటే?
తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్‌ఎఎస్)లో ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లో మొత్తం 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జూన్ 16న ప్రకటన జారీ చేసింది. కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్పెషల్ ఆఫీసర్, సీఆర్‌టీల ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని ప్రభుత్వం పేర్కొంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 43 ఐటీ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జులై 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..