అన్వేషించండి

RBI Admit Card: ఆర్‌బీఐ అసిస్టెంట్ ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్‌కార్డులు విడుదల, పరీక్ష వివరాలు ఇలా

RBI Admit Card: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు నవంబరు 7న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.

RBI Assistant Admit Card 2023: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు నవంబరు 7న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబరు, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్‌కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డులేనిదే పరీక్షకు అనుమతించరు. అభ్యర్థులు అడ్మిట్‌కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తర్వాతి దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి చివరగా.. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.

నవంబరు 19 వరకు అడ్మిట్‌కార్డులు అందుబాటులో ఉంటాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 18, 19 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించే అభ్యర్థులకు డిసెంబరు 31న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. 

RBI Assistant Preliminary Exam Admit Card 

పరీక్ష విధానం:

ప్రిలిమినరీ పరీక్ష..

➥ మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో సాగే పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (30 ప్రశ్నలు- 30 మార్కులు), న్యూమరికల్‌ ఎబిలిటీ (35 ప్రశ్నలు- 35 మార్కులు), రీజనింగ్‌ ఎబిలిటీ (35 ప్రశ్నలు- 35 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. అయితే పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంటముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. 

మెయిన్ పరీక్ష..

➥ మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్‌ (40 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (40 ప్రశ్నలు- 40 మార్కులు), న్యూమరికల్‌ ఎబిలిటీ (40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌ (40 ప్రశ్నలు- 40 మార్కులు), కంప్యూటర్‌ నాలెడ్జ్‌ (40 ప్రశ్నలు- 40 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 135 నిమిషాలు. మెయిన్స్‌ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ) రాయాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు

దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు మొదటివారంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 13న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబర్‌ 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.20,700 నుంచి రూ.55700 జీతంగా ఇస్తారు.

పోస్టుల వివరాలు..

 అసిస్టెంట్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 450

శాఖల వారీగా ఖాళీలు..

➥ అహ్మదాబాద్: 13

➥ బెంగళూరు: 58

➥ భోపాల్: 12

➥ భువనేశ్వర్: 19

➥ చండీగఢ్: 21

➥ చెన్నై: 01

➥ గువాహటి: 26

➥ హైదరాబాద్: 14

➥ జైపుర్: 5

➥ జమ్మూ: 18

➥ కాన్పుర్ & లక్నో: 55

➥ కోల్‌కతా: 22

➥ ముంబయి: 101

➥ నాగ్‌పుర్: 19

➥ న్యూఢిల్లీ: 28

➥ పట్నా: 01

➥ తిరువనంతపురం & కొచ్చి: 16

నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Embed widget