APGS Employees: గ్రామ 'సచివాలయ' ఉద్యోగులకు గుడ్ న్యూస్, ప్రొబేషన్ ఖరారు చేసిన ప్రభుత్వం!
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 నోటిఫికేషన్‌లో ఎంపికైన సిబ్బందికి పొబ్రేషన్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఏప్రిల్ 17న జీవో జారీ చేసింది.
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 నోటిఫికేషన్‌లో ఎంపికైన సిబ్బందికి పొబ్రేషన్ ఇస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం (ఏప్రిల్ 17) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతోపాటు, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రొబేషన్ వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మే 1 నుంచి వారికి కొత్త పే స్కేళ్లు వర్తిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది.
ప్రొబేషన్ ద్వారా సచివాలయ ఉద్యోగాలకు భద్రత ఏర్పడినట్టయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే సచివాలయ సిబ్బంది నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. సచివాలయ సిబ్బందిని క్రమబద్ధీకరించేందుకు వీలు కల్పించే ప్రొబేషన్ డిక్లరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆమోదం తెలిపింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల కేటగిరీ ఉద్యోగులు పని చేస్తుండగా, ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్–5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల పే–స్కేలును రూ.23,120 – 74,770గా నిర్ధారించారు. వీరి వేతనం డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకుని రూ.29,598 ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల పే–స్కేలును రూ. 22,460– 72,810గా నిర్ధారించారు. అంటే, ఆ కేటగిరి ఉద్యోగుల డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకొని రూ.28,753 ఉంటుంది.
నిబంధనల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తి, డిపారెంట్ టెస్టు ఉత్తీర్ణత, ఎటువంటి నేర చరిత్ర లేదన్న పోలీసు రిపోర్టులకు అనుగుణంగా జిల్లాల కలెక్టర్లు ప్రొబేషన్ ఖరారుకు అర్హులైన ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేశారు. ఇందుకు అనుగుణంగా 19 రకాల కేటగిరి ఉద్యోగులకు సంబంధించి ఆయా జిల్లాల్లో కేటగిరీ వారిగా అర్హుల పేర్లతో కూడిన జాబితాలతో వేర్వేరుగా ప్రోసీడింగ్స్ జారీ చేశారు.
Also Read:
గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జేఎల్ పోస్టులు 1924, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 34, లైబ్రేరియన్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..