Rozgar Mela: మరో 71 వేల మందికి ఉద్యోగ నియామకపత్రాలు, నేడు అందించనున్న ప్రధాని మోదీ
నియామక పత్రాలను ఎన్నికల నియమావళి అమలులో ఉన్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ నహా మిగిలిన రాష్ట్రాల్లోని 45 ప్రాంతాల్లో అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన మరో 71 వేల మందికి మంగళవారం (నవంబరు 22) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందించనున్నారు. అక్టోబరు 22న 75వేల మందికి నియామకపత్రాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 10.30 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన దేశవ్యాప్తంగా కొత్తగా ఉద్యోగాలు పొందిన వారిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. నియామక పత్రాలను ఎన్నికల నియమావళి అమలులో ఉన్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ నహా మిగిలిన రాష్ట్రాల్లోని 45 ప్రాంతాల్లో అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
దేశవ్యాప్తంగా 10లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇటీవల హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అక్టోబరు 22న తొలివిడత 'రోజ్ గార్ మేళా' డ్రైవ్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాల కోసం ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 75 వేల మంది అభ్యర్థులు అపాయింట్ మెంట్ లెటర్స్ ఇచ్చారు. ఎంపికైన అభ్యర్థులు భారత ప్రభుత్వంలోని 38 మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాల్లో విధుల్లో చేరారు.
As a part of Rozgar Mela, PM @narendramodi will distribute about 71,000 appointment letters to newly inducted recruits at 10:30 AM today. PM will also launch Karmayogi Prarambh module - an online orientation course for new appointees.https://t.co/TSDh3bs9Hr
— PMO India (@PMOIndia) November 22, 2022
via NaMo App pic.twitter.com/BBf0f3bMJV
ఉద్యోగ భర్తీపై నాలుగు నెలల క్రితమే సమీక్ష..
దేశవ్యాప్తంగా 10లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇటీవల హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇదే అంశంపై జూన్‌లోనే ప్రధాని నరేంద్ర మోడీ అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలలో మానవ వనరులను సమీక్షించారు. కొన్ని నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్లాన్‌తో ముందుకు కదులుతున్నారు. దీనితో పాటు వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం మిషన్ పద్ధతిలో పనిచేయాలని ఆదేశించారు.
గతేడాది, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా, మార్చి 1, 2020 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖలలో 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈ సంఖ్య దాదాపు 10 లక్షలకు చేరి ఉంటుందని భావిస్తున్నారు. వారిని రిక్రూట్ చేయడానికి పీఎం మోదీ ఈ చొరవ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో మొత్తం 40 లక్షల 4 వేల పోస్టులు ఉన్నాయని, వాటిలో దాదాపు 31 లక్షల 32 వేల మంది ఉద్యోగులను నియమించుకున్నారని జితేంద్ర సింగ్ చెప్పారు. అంటే 8.72 లక్షల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.