Railway Jobs: రైల్వే శాఖలో 2.74 లక్షల పోస్టులు ఖాళీ! ఒక్క సేఫ్టీ విభాగంలోనే 1.7 లక్షల ఉద్యోగాలు!
రైల్వేశాఖలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 2.74 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండగా.. వీటిలో ఒక్క సేఫ్టీ కేటగిరీలోనే 1.7లక్షల ఖాళీలు ఉన్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది.
రైల్వేశాఖలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 2.74 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండగా.. వీటిలో ఒక్క సేఫ్టీ కేటగిరీలోనే 1.7లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు రైల్వే శాఖ తాజాగా వెల్లడించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ రైల్వేల్లో ఖాళీలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది.
రైల్వేశాఖలో గ్రూప్-సీ కేటగిరీ (లెవెల్-1 లేదా ఎంట్రీ లెవెల్ స్టాఫ్)లోనే 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది. వీటిలో ఒక్క భద్రతకు సంబంధించిన కేటగిరీలోనే 1,77,924 ఖాళీలు ఉన్నట్టు పేర్కొంది. ఈ ఏడాది జూన్ 1 నాటికి సేఫ్టీ కేటగిరీలో 9,82,037 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. 8,04,113 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు సమాధానంలో పేర్కొంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, త్వరితగతిన పదోన్నతులు కల్పించడం, శిక్షణ తర్వాత కోర్ ఉద్యోగాలకు నాన్-కోర్ సిబ్బందిని తరలించడం వంటి చర్యల ద్వారా సమస్యను పరిష్కరిస్తున్నట్టు రైల్వేశాఖ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు.
రైల్వేశాఖలో మొత్తంగా 3.12లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ 2022 డిసెంబర్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ ఏడాది అక్టోబర్ నాటికి 1.52లక్షల ఖాళీలను భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 1.38లక్షల అభ్యర్థులకు నియామక పత్రాలు అందించామని.. వీరిలో 90వేల మంది చేరినట్టు తెలిపారు. వీటిలో 90శాతం పోస్టులు సేఫ్టీ కేటగిరీకి చెందినవేనన్నారు.
ALSO READ:
ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 239 టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ(టీఎస్‌ఈఎస్) 2023-24 విద్యా సంత్సరానికి రాష్ట్రంలోని 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బోధనతో పాటు రెసిడెన్షియల్ పాఠశాల విధులకు హాజరుకావడం తప్పనిసరి. షేరింగ్ ప్రాతిపదికన బోర్డింగ్, లాడ్జింగ్ పాఠశాల క్యాంపస్‌లో అందుబాటులో ఉండేలా సదుపాయం ఉంటుంది. ఎంపికైన ఉపాధ్యాయులు సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఆంగ్లభాషలో బోధించాల్సి ఉంటుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 02వ తేదీలోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, పీహెచ్‌డీ, ఎంఫిల్, ఎంఈడీ, టెట్ ఉత్తీర్ణతతో పాటు బోధననానుభవం కలిగి ఉండాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial